కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Rajinikanth: రజినీకాంత్‌పై వరద బాధితుల అసహనం!

ABN, Publish Date - Dec 28 , 2023 | 07:46 PM

సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌పై తూత్తుక్కుడి, తిరునెల్వేలి జిల్లాల వరద బాధితులు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనికి బలమైన కారణం లేకపోలేదు. తన చిత్రం షూటింగు కోసం తూత్తుక్కుడి జిల్లాలోనే బస చేస్తున్న రజినీకాంత్‌.. ఇటీవల సంభవించిన వరదలో సర్వం కోల్పోయి కట్టుబట్టలతో ఉన్న వరద బాధితులను కనీసం మాటమాత్రం కూడా పరామర్శించలేదు. దీంతో వారు అసహనాన్ని ప్రదర్శించారు.

Super Star Rajinikanth

సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ (Super Star Rajinikanth) పై తూత్తుక్కుడి (Thoothukudi), తిరునెల్వేలి (Tirunelveli) జిల్లాల వరద బాధితులు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనికి బలమైన కారణం లేకపోలేదు. తన చిత్రం షూటింగు కోసం తూత్తుక్కుడి జిల్లాలోనే బస చేస్తున్న రజినీకాంత్‌.. ఇటీవల సంభవించిన వరదలో సర్వం కోల్పోయి కట్టుబట్టలతో ఉన్న వరద బాధితులను (Flood Victims) కనీసం మాటమాత్రం కూడా పరామర్శించలేదు. ఒక్క వరద బాధిత ప్రాంతాన్ని కూడా ఆయన సందర్శించలేదు. తమకు ఎలాంటి సాయం అక్కర్లేదని, కానీ సర్వం కోల్పోయి కట్టుబట్టలతో ఉన్న తమను కనీసం ఓదార్చేందుకు కూడా ఆయనకు తీరికలేదా అని వారు ప్రశ్నిస్తున్నారు.

పైగా, వరద ముంపునకు గురైన జిల్లాల్లోనే ఆయన తన చిత్రం షూటింగ్‌ జరుపుకోవడం వరద బాధితులను తీవ్ర అసంతృప్తికి, అసహనానికి గురిచేస్తోంది. టీజే జ్ఞానవేల్‌ (TJ Gnanavel) దర్శకత్వంలో ఈ కొత్త చిత్రం రూపుదిద్దుకుంటుంది. ఇప్పటికే కేరళ, ముంబై, హైదరాబాద్‌ నగరాల్లో షూటింగ్‌ జరుపుకున్న ఈ చిత్రం ప్రస్తుతం తూత్తుక్కుడిలో కీలక సన్నివేశాలను చిత్రీకరణలో బిజీగా ఉంది. కొన్ని రోజులుగా చిత్ర యూనిట్‌ సభ్యులంతా ఇక్కడకు చేరుకుని షూటింగులో పాల్గొంటున్నారు.


ఇపుడు తన పోర్షన్‌కు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ కోసం రజినీకాంత్‌ (Rajinikanth) చెన్నై నుంచి తూత్తుక్కుడికి విమానంలో చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు భారీ సంఖ్యలో విమానాశ్రయానికి చేరుకుని ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత రజినీకాంత్‌ ఎయిర్‌పోర్టు నుంచి షూటింగ్‌ లొకేషన్‌కు వెళ్ళిపోయారు. ఈ చర్యను తూత్తుక్కుడి వరద బాధితులతో పాటు ఆయన అభిమానులు సైతం ఖండిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Prabhas: ప్రభాస్ సత్తా ఏంటో చూపిన ‘సలార్’.. కేవలం 6 రోజుల్లో ఎన్ని కోట్ల వసూళ్లంటే?

****************************

*Vaishnavi Chaitanya: ‘బేబి’ హీరోయిన్‌కు మరో ఛాన్స్.. హీరో ఎవరంటే?

**************************

*Tenant: ‘నా క‌థ‌లో నువ్వున్నావా? నీ క‌థ‌నే నేను అయ్యానా?’ అంటోన్న సత్యం రాజేష్!

***************************

Updated Date - Dec 28 , 2023 | 07:46 PM
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!