The Kerala Story: కేరళ స్టోరీకి తమిళ నాడులో షాక్.. విషయం ఏమిటంటే?

ABN , First Publish Date - 2023-05-07T14:17:03+05:30 IST

‘ది కేరళ స్టోరీ’ టైటిల్‌తో రూపుదిద్దుకున్న చిత్రానికి సంబంధించి ట్రైలర్ విడుదల అనంతరం వివాదాలు చుట్టుముట్టిన విషయం తెలిసిందే. అయితే.. అన్ని అడ్డంకులను ఎదుర్కొని ఎలాగోలా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు ఇప్పుడు తమిళ నాడు ప్రభుత్వం

The Kerala Story: కేరళ స్టోరీకి తమిళ నాడులో షాక్.. విషయం ఏమిటంటే?
The Kerala Story Poster

‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story).. కొన్ని రోజులుగా ఎక్కడ చూసినా ఈ పేరే వినిపిస్తోంది. సోషల్ మీడియాలో దాదాపు వారం రోజుల నుండి ఈ పేరు ట్రెండ్ అవుతోంది. ‘ది కేరళ స్టోరీ’ టైటిల్‌తో రూపుదిద్దుకున్న చిత్రానికి సంబంధించి ట్రైలర్ విడుదల అనంతరం వివాదాలు చుట్టుముట్టిన విషయం తెలిసిందే. అయితే.. అన్ని అడ్డంకులను ఎదుర్కొని ఎలాగోలా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు ఇప్పుడు తమిళ నాడు ప్రభుత్వం షాకిచ్చింది. తమిళ నాడులోని అన్ని మల్లీప్లెక్స్ థియేటర్లలో ‘ది కేరళ స్టోరీ’ చిత్ర ప్రదర్శనను నిలిపివేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ సంచలన నిర్ణయంతో దాదాపు ఈ సినిమా తమిళ నాడులో పూర్తి స్థాయిలో ఆగిపోయినట్లుగానే తెలుస్తోంది.

అసలు విషయం ఏమిటంటే.. విడుదలకు ముందే ఈ సినిమాపై రాజకీయ దుమారం మొదలైంది. కేరళ రాష్ట్రాన్ని, ప్రభుత్వాన్ని కించపరిచేలా తెరకెక్కించారనే ఆరోపణలతో.. ఈ సినిమాను బ్యాన్ చేయాలని అక్కడి ప్రభుత్వం ఎంతగానో ప్రయత్నించింది. కానీ కోర్టులు మాత్రం అందుకు ఒప్పుకోలేదు. కోర్టు అనుమతులతో ఈ చిత్రం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. విడుదల తర్వాత కొన్ని చోట్ల.. ఇది అందరూ చూడాల్సిన సినిమా (#TheKeralaStoryAMustWatch) అంటూ కామెంట్స్ వినిపిస్తున్నా.. కొన్ని చోట్ల మాత్రం భారీ స్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ‘ది కేరళ స్టోరీ’ విడుదలకు వ్యతిరేకంగా తమిళనాడులోని నామ్ తమిళర్ కట్చి (NTK) శనివారం చెన్నైలో నిరసనకు దిగింది. ఈ చిత్రానికి వ్యతిరేకంగా చెన్నైలోని స్కైవాక్ మాల్ సమీపంలోని అన్నానగర్ ఆర్చ్‌ వద్ద నామ్ తమిళర్ పార్టీ నిర్వాహకుడు, నటుడు మరియు దర్శకుడు సీమాన్ నేతృత్వంలోని కార్యకర్తలు నిరసనలకు దిగారు. దీంతో శాంతి భద్రతల దృష్ట్యా.. తమిళ నాడులోని మల్టీప్లెక్స్ థియేటర్ల (Multiplex Theatres)లో ఆదివారం నుంచి ఈ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని తమిళనాడు ప్రభుత్వం (Tamil Nadu Government) నిర్ణయించింది. ప్రభుత్వమే కాకుండా.. తమిళనాడులోని పలు రాజకీయ పార్టీలు సైతం.. సినిమాను ప్రదర్శిస్తే.. థియేటర్లను సీజ్ చేస్తామని హెచ్చరించడంతో.. థియేటర్ల యజమానులు ఈ సినిమాను ప్రదర్శించేందుకు ఆసక్తి చూపడం లేదు. ఈ హెచ్చరికలతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ సినిమా ప్రదర్శన ఆగిపోయిందనేది తాజా సమాచారం.

The-Kerala-Story.jpg

కేరళలో తప్పిపోయిన 32 వేల మంది యువతులు ఏమయ్యారు, ఎక్కడున్నారు? అనే ఇతివృత్తంతో రూపుదిద్దుకొన్న చిత్రం ‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story). కేరళలో తప్పిపోయిన నలుగురు అమాయకపు యువతులు మతం మార్చుకుని, ఐసిస్‌ ఆధ్వర్యంలో ఉగ్రవాదులుగా మారినట్లు ఈ ట్రైలర్‌లో చూపించడంతో వివాదాలు మొదలయ్యాయి. ఈ వివాదాలపై చిత్ర దర్శకుడు సుదీప్తో సేన్‌ (Sudipto Sen) స్పందిస్తూ.. ‘కేరళలో కొన్ని నెలలు ఉండి రీసెర్చి చేసిన తర్వాత, బాధిత కుటుంబాలతో మాట్లాడిన తర్వాత తీసిన సినిమా ఇది’ అని అంటే.. ‘కేరళ గురించి వ్యతిరేకంగా తీసిన సినిమా కాదిది. అలాగే ఉగ్రవాదులను టార్గెట్‌ చేస్తూ చిత్రం తీశామే తప్ప.. ముస్లీముల గురించి కాదు’ అని నిర్మాత విపుల్‌ షా (Vipul Amrutlal Shah) చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

************************************************

*NTR: మరో సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నాడా?

*Pic Talk: చందురుని మించు అందమొలికించు...

*Dimple Hayathi: కొంటె పనులు చాలా చేశాను

*Megastar VS Superstar: చిరంజీవికి పోటీగా రజనీకాంత్.. ఆగస్ట్‌లో అసలు మజా!

*Ramabanam Film Review: అన్నదమ్ముల కథన్నారు, కానీ తీరా చూసాక...

*Bhumika Chawla: హీరోల వయసుపై భూమిక కామెంట్స్.. ఏం మారలేదు

Updated Date - 2023-05-07T14:18:11+05:30 IST