Heat Trailer Talk: ప్రత్యర్థిని అంచనా వేసేవాడు.. ప్రెజర్‌ను హ్యాండిల్ చేసేవాడే విన్నర్

ABN , First Publish Date - 2023-05-02T20:01:36+05:30 IST

ఫ్రెండ్ అంటే వెలుతురున్నప్పుడు షాడో లాంటి వాడు కాదు.. చీకట్లో కూడా వెలుతురునిచ్చే వాడే నిజమైన ఫ్రెండ్.. అనే డైలాగ్‌తో మొదలైన ఈ ట్రైలర్..

Heat Trailer Talk: ప్రత్యర్థిని అంచనా వేసేవాడు.. ప్రెజర్‌ను హ్యాండిల్ చేసేవాడే విన్నర్
Heat Movie Pic

మర్డర్ మిస్టరీలు, సస్పెన్స్ థ్రిల్లర్ జానర్‌ చిత్రాలు తీసే విధంగా తీస్తే మాత్రం.. వాటికెప్పుడూ డిమాండ్ ఉంటూనే ఉంటుంది. ఓ సెక్షన్ ఆఫ్ ఆడియెన్స్ ఆ చిత్రాలను ఎంతగానో ఇష్టపడుతుంటారు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా.. ఈ జానర్‌లో వచ్చే చిత్రాలను ఆసక్తికరంగా మలిస్తే చాలు.. ఈజీగా హిట్ కొట్టవచ్చు. ఇప్పుడీ జానర్‌లో త్వరలో రాబోతోన్న చిత్రం ‘హీట్’ (HEAT). వర్దన్ గుర్రాల (Vardhan Gurrala), స్నేహా ఖుషి (Senha Kushi) హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని ఎం.ఆర్.వర్మ (MR Varma) సమర్పణలో ర్యాన్ స్టూడియోస్, కౌముది సినిమాస్ (Kaumudhi Cinemas) బ్యానర్ల మీద ఎం.ఆర్.వర్మ, సంజోష్ (M R Varma, Sanjosh) సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీకి ఎం.ఎన్.అర్జున్, శరత్ వర్మ (M N Arjun& Sharath Varma) దర్శకత్వం వహించారు. మే 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సస్పెన్స్ థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఆసాంతం ఉత్కంఠను రేకెత్తించేలా ఉంది. (HEAT Movie Telugu Trailer)

ట్రైలర్ విషయానికి వస్తే.. ఫ్రెండ్ అంటే వెలుతురున్నప్పుడు షాడో లాంటి వాడు కాదు.. చీకట్లో కూడా వెలుతురునిచ్చే వాడే నిజమైన ఫ్రెండ్.. అనే డైలాగ్‌తో ట్రైలర్ మొదలైంది. ఛేజింగ్ సీన్లు, మర్డర్ సీన్లతో ట్రైలర్‌‌ను పరుగులు పెట్టించారు. ట్రైలర్ మధ్యలో వచ్చిన.. ‘మనకి అర్హత లేని వాటిని టచ్ చేయాలంటే గుండె ధైర్యం ఉండాలి’.. ‘ఆట (Game)లో ఆడాలంటే.. ఆడటం మాత్రమే తెలిస్తే చాలదు.. ప్రత్యర్థిని సరిగ్గా అంచనా వేయగలిగిన వాడు.. ప్రెజర్‌ను సరిగ్గా హ్యాండిల్ చేయగలిగిన వాడు మాత్రమే గెలుస్తాడు’.. ‘మైండ్ ఈజ్ డేంజరస్ వెపన్’.. ‘ఎమోషన్ ఈజ్ ఏ మోస్ట్ డేంజరస్ వెపన్’.. అంటూ వచ్చిన డైలాగ్స్.. ఈ డైలాగ్స్‌కి సరిపడా సన్నివేశాలు సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేస్తున్నాయి. విజువల్స్, ఆర్ఆర్, సినిమాటోగ్రఫీ అన్నీ కూడా హైలెట్ అనేలా ఉన్నాయి. (HEAT Movie Telugu Trailer Talk)

మొత్తం ఈ ట్రైలర్ చూస్తుంటే.. ప్రేక్షకులకు మరో మంచి థ్రిల్లింగ్ చిత్రం రాబోతుందనేది అర్థమవుతోంది. ఈ సినిమాకు గౌతమ్ రవిరామ్ సంగీతాన్ని అందించగా.. రోహిత్ బాచు కెమెరామెన్‌గా పని చేశారు. మోహన్ సాయి, అంబికా వాణి, వంశీ రాజ్, పుల్కిత్, అప్పాజీ అంబరీష, జయ శ్రీ రాచకొండ, ప్రభావతి వర్మ తదితరులు ఇతర పాత్రలలో నటించారు.


ఇవి కూడా చదవండి:

************************************************

* The Kerala Story: కథ నిజమని నిరూపించండి.. కోటీశ్వరులు కండి!

*Naga Chaitanya: నా లైఫ్‌లో ఇప్పటి వరకు నేను బాధపడలేదు

*Sarath Kumar: ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 20 సినిమాలు

*Balagam: కానిస్టేబుల్ పరీక్షలో సినిమాపై ప్రశ్న.. ఫూలిష్ క్వశ్చన్ అంటూ నెటిజన్ల ఫైర్

*PS2: కలెక్షన్ల ఊచకోత మొదలైంది..

Updated Date - 2023-05-02T20:01:36+05:30 IST