Vimanam: మరో ‘బలగం’ అయ్యే లక్షణాలు పుష్కలంగా కనబడుతున్నాయ్..

ABN , First Publish Date - 2023-05-02T23:28:45+05:30 IST

తండ్రి కొడుకుల మధ్య బంధాన్ని (Father and Son Relation) చూస్తుంటే మాత్రం, ఈ సినిమా మరో ‘బలగం’ అయ్యే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని అంగీకరించక తప్పదు. వీర‌య్య అనే అంగ వైకల్యం ఉన్న తండ్రి పాత్ర‌లో

Vimanam: మరో ‘బలగం’ అయ్యే లక్షణాలు పుష్కలంగా కనబడుతున్నాయ్..
Vimanam Movie Still

ఓ చిన్న కుర్రాడు.. అత‌నికి విమానం (Vimanam) ఎక్కాల‌ని ఎంతో ఆశ‌.. కానీ ఎలా? ఎప్పుడు విమానాన్ని చూసినా అలా ఆనందం, ఆశ్చ‌ర్యంతో చూస్తూనే ఉండిపోతాడు. తన కోరిక‌ను తండ్రికి చెబితే బాగా చ‌దువుకుంటే విమానం ఎక్క‌వ‌చ్చున‌ని చెబుతాడు. అంగ వైక‌ల్యంతో బాధ‌ప‌డే తండ్రి వీర‌య్య ఎలాంటి క‌ష్టం తెలియ‌కుండా త‌ల్లి లేని కొడుకుని పెంచుకుంటుంటాడు. మ‌రి ఆ పిల్లాడి కోరిక తీరిందా? తండ్రి చెప్పిన‌ట్లే ఆ పిల్లాడు విమానం ఎక్కాడా? అనే సంగ‌తి తెలుసుకోవాలంటే జూన్ 9న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అవుతున్న ‘విమానం’ సినిమా చూడాల్సిందేనంటున్నారు దర్శక నిర్మాతలు. కథగా చెబుతుంటే ఇలా ఉంది కానీ.. టీజర్‌లో తండ్రి కొడుకుల మధ్య బంధాన్ని (Father and Son Relation) చూస్తుంటే మాత్రం, ఈ సినిమా మరో ‘బలగం’ అయ్యే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని అంగీకరించక తప్పదు. వీర‌య్య అనే అంగ వైకల్యం ఉన్న తండ్రి పాత్ర‌లో స‌ముద్ర ఖ‌ని (Samuthirakani), కొడుకు పాత్రలో మాస్టర్ ధ్రువన్ (Master Dhruvan) న‌టిస్తుండగా సుమ‌తి పాత్ర‌లో అన‌సూయ భ‌ర‌ద్వాజ్ (Anasuya Bharadwaj)‌, రాజేంద్ర‌న్ పాత్ర‌లో రాజేంద్ర‌న్ (Rajendran)‌, డేనియ‌ల్ పాత్ర‌లో ధ‌న్‌రాజ్ (Dhanraj)‌, కోటి పాత్ర‌లో రాహుల్ రామ‌కృష్ణ (Rahul Ramakrishna) ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో మెప్పించబోతున్నారు. ఈ పాత్రల లుక్స్‌ని తాజాగా విడుదల చేశారు. ఈ లుక్స్ చూసినా కూడా అదే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇవే కాదు.. ఈ చిత్రానికి సంబంధించి తాజాగా విడుదల చేసిన లిరికల్ సాంగ్ కూడా అదే భావనని కలిగిస్తోంది.

‘విమానం’ చిత్రంలోని తండ్రీ కొడుకుల మధ్య అనుబంధాన్ని తెలియజేసేలా ‘రేలా రేలా..’ అనే లిరికల్ సాంగ్‌ (Rela Rela Lyrical Song)ను మంగళవారం చిత్రయూనిట్ విడుదల చేసింది. చిత్ర సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ (Charan Arjun) ఈ పాటను రాయటం విశేషం. ప్రముఖ సింగర్ మంగ్లీ (Singer Mangli) తనదైన పంథాలో ఆలపించి.. పాటకు మంచి ఫీల్‌నిచ్చారు.

‘‘సిన్నోడా ఓ సిన్నోడా.. సిన్న సిన్న మేడ

సిత్తరంగ జూపిస్తాది.. సంబరాల జాడ

ఎగిరీ దూకితే.. అంబరమందదా..

ఇంతకు మించినా.. సంబరముంటదా..

ఎన్నడు చూడని ఆనందములోన

రేల రేలా.. రేల రేలా.. మనసు ఉరకలేసేనా

అంతేలేని సంతోషాలు మన సొంతమయ్యేనా..’’ అంటూ పాట హుషారుగా సాగితే.. పాటకు వచ్చే వీడియో సన్నివేశాలు హార్ట్ టచింగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఆదిత్య మ్యూజిక్ (Aditya Music) ద్వారా ఈ పాట మార్కెట్‌లోకి విడుదలైంది.

Samudrakhani.jpg

కాగా.. వైవిధ్యంగా ప్రమోషనల్ కంటెంట్‌తో విమానం సినిమాపై బ‌జ్ క్రియేట్‌ చేస్తోంది టీమ్‌. అందులో భాగంగా ఇప్ప‌టికే సినిమాలోని పాత్ర‌ల‌ను ప‌రిచ‌యం చేశారు. అలాగే చిత్ర నిర్మాత‌లు ఆడియెన్స్‌ను వారి తొలి విమాన ప్ర‌యాణానికి సంబంధించిన ఫొటోలు, వీడియోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయాలని ఆహ్వానించారు. ఇందులో పాల్గొనే పార్టిసిపెంట్స్‌కు బ‌హుమతుల‌ను కూడా అందిస్తామ‌ని ప్ర‌క‌టించారు. శివ ప్రసాద్ యానాల (Siva Prasad Yanala) దర్శకత్వంలో జీ స్టూడియోస్ (Zee Studios)‌, కిర‌ణ్ కొర్ర‌పాటి (కిర‌ణ్ కొర్ర‌పాటి క్రియేటివ్ వ‌ర్క్స్‌) (Kiran Korrapati Creative Works) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

************************************************

*I am Salman: సల్మాన్ ఖాన్ ఇలా మారిపోయాడేంటి? గ్రూట్ ఎంత పని చేశావ్..

*JD Chakravarthy: ఆ టైటిల్ కొట్టేద్దామనుకున్నా..

*Heat Trailer Talk: ప్రత్యర్థిని అంచనా వేసేవాడు.. ప్రెజర్‌ను హ్యాండిల్ చేసేవాడే విన్నర్

* The Kerala Story: కథ నిజమని నిరూపించండి.. కోటీశ్వరులు కండి!

*Naga Chaitanya: నా లైఫ్‌లో ఇప్పటి వరకు నేను బాధపడలేదు

*Sarath Kumar: ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 20 సినిమాలు

*Balagam: కానిస్టేబుల్ పరీక్షలో సినిమాపై ప్రశ్న.. ఫూలిష్ క్వశ్చన్ అంటూ నెటిజన్ల ఫైర్

Updated Date - 2023-05-02T23:28:45+05:30 IST