Vijay Antony: మరో మెగాస్టార్ చిరు మూవీ టైటిల్‌కి ఫిక్సయిన విజయ్ ఆంటోని

ABN , First Publish Date - 2023-09-29T22:16:16+05:30 IST

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘రోషగాడు, జ్వాల’ వంటి చిత్రాల టైటిల్స్‌తో విజయ్ ఆంటోని సినిమాలు చేసిన విషయం తెలిసిందే. అలాగే ‘ఇంద్రసేన’ అనే టైటిల్‌తో కూడా విజయ్ ఆంటోని ఓ మూవీ చేశారు. ఇప్పుడు మరోసారి మెగాస్టార్ మూవీ టైటిల్‌కు ఆయన ఫిక్సయ్యారు. వైవిధ్యమైన చిత్రాలతో సౌత్ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటున్న హీరో విజయ్ ఆంటోనీ తన కొత్త సినిమాకు ‘హిట్లర్’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు.

Vijay Antony: మరో మెగాస్టార్ చిరు మూవీ టైటిల్‌కి ఫిక్సయిన విజయ్ ఆంటోని
Vijay Antony in Hitler Movie

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) నటించిన ‘రోషగాడు (Roshagadu), జ్వాల (Jwala)’ వంటి చిత్రాల టైటిల్స్‌తో విజయ్ ఆంటోని (Vijay Antony) సినిమాలు చేసిన విషయం తెలిసిందే. అలాగే ‘ఇంద్రసేన’ అనే టైటిల్‌తో కూడా విజయ్ ఆంటోని ఓ మూవీ చేశారు. ఇప్పుడు మరోసారి మెగాస్టార్ మూవీ టైటిల్‌కు ఆయన ఫిక్సయ్యారు. వైవిధ్యమైన చిత్రాలతో సౌత్ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటున్న హీరో విజయ్ ఆంటోనీ తన కొత్త సినిమాకు ‘హిట్లర్’ (Hitler) అనే టైటిల్‌ని ఖరారు చేశారు. విజయ్ ఆంటోనీతో గతంలో ‘విజయ్ రాఘవన్’ అనే మూవీని నిర్మించిన చెందూర్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ సంస్థ.. తమ 7వ ప్రాజెక్ట్‌గా ఈ ‘హిట్లర్’ సినిమాను నిర్మిస్తోంది. డీటీ రాజా, డీఆర్ సంజయ్ కుమార్ నిర్మాతలు. హిట్లర్ సినిమాను యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు ధన రూపొందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. (Vijay Antony Hitler)

ట్రైన్ జర్నీలో ఉన్న హీరో విజయ్ ఆంటోనీ ఒక క్రైమ్ ఇన్సిడెంట్‌ను ఎదుర్కొన్నట్లు‌గా ఈ మోషన్ పోస్టర్‌లో చూపించారు. ఇదే ట్రైన్‌లో హీరోయిన్ రియా సుమన్ హీరో కలుసుకుంటాడు. గన్ పేలుస్తోన్న గౌతమ్ మీనన్ ఓ కీలక పాత్రలో కనిపించారు. ఈ మోషన్ పోస్టర్‌లో విజయ్ ఆంటోనీ ఫ్రెష్ లుక్‌లో దర్శనమిచ్చారు. చివరలో ఆయన జోకర్ గెటప్‌లో కనిపించడం ఆసక్తికరంగా ఉంది. ట్రైన్ జర్నీ నేపథ్యంగా రూపొందించిన మోషన్ పోస్టర్ సినిమా మీద క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది. (Hitler First Look and Motion Poster Out)


Vijay-Antony-Hitler.jpg

ప్రజాస్వామ్యం పేరుతో కొందరు పాలకులు నియంతల్లా వ్యవహరిస్తున్నారు. అలాంటి నియంతను ఎదుర్కొనే ఓ సాధారణ పౌరుడి కథే ఈ ‘హిట్లర్’ అని మేకర్స్ చెబుతున్నారు. ‘హిట్లర్’ ఒక పేరు కావొచ్చు కానీ ఇప్పుడున్న ప్రజాస్వామ్య పరిస్థితుల్లో ఆ పేరు నియంతలకు మారుపేరుగా మారింది. అందుకే సినిమాకు ఈ టైటిల్ యాప్ట్ అనుకున్నాం అని వారు వెల్లడించారు. ప్రస్తుతం చిత్రీకరణ తుది దశలో ఉన్న ఈ సినిమాని త్వరలో పాన్ ఇండియా స్థాయిలో హిందీతో పాటు తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో థియేట‌లో రిలీజ్ చేయబోతున్నామని నిర్మాతలు తెలియజేశారు.


ఇవి కూడా చదవండి:

============================

*Baby: ‘బేబీ’ దర్శకుడికి మరో కారు గిఫ్ట్.. సక్సెస్ ఇచ్చిన కిక్కు అలాంటిది

************************************

*Varun Tej: వరుణ్ తేజ్ సినిమాకు షాకింగ్ నాన్ థియేట్రికల్ రైట్స్

************************************

*Ala Ninnu Cheri: కోడి బాయె లచ్చమ్మదీ.. పాట వదిలిన తలసాని.. హెబ్బా ఏముందిరా?

***************************************

*Agent: ‘ఏజెంట్’ని వదలని కష్టాలు.. ఓటీటీ‌లో విడుదల డౌటే.. ఎందుకంటే?

***************************************

Updated Date - 2023-09-29T22:16:16+05:30 IST