Baby: ‘బేబీ’ దర్శకుడికి మరో కారు గిఫ్ట్.. సక్సెస్ ఇచ్చిన కిక్కు అలాంటిది

ABN , First Publish Date - 2023-09-29T19:48:42+05:30 IST

ఈ ఇయర్ కల్ట్ బ్లాక్‌బస్టర్ మూవీగా సూపర్ సక్సెస్ అందుకున్న చిత్రం ‘బేబీ’. సాయి రాజేశ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రూ. 90 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి.. చిన్న సినిమాలలోనే అతి పెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఈ సక్సెస్ కిక్కులో నిర్మాత ఎస్కేఎన్ మరో కారుని అదీ కూడా బెంజ్ కారుని దర్శకుడికి గిఫ్ట్‌గా ఇచ్చారు.

Baby: ‘బేబీ’ దర్శకుడికి మరో కారు గిఫ్ట్.. సక్సెస్ ఇచ్చిన కిక్కు అలాంటిది
Baby Movie director and Producer

ఈ ఇయర్ కల్ట్ బ్లాక్‌బస్టర్ మూవీగా సూపర్ సక్సెస్ అందుకున్న చిత్రం ‘బేబీ’ (Baby). ప్రేక్షకుల ఆదరణతో పాటు మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi), అల్లు అర్జున్ (Allu Arjun), విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) వంటి స్టార్ హీరోల ప్రశంసలు అందుకుందీ సినిమా. యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్‌గా దర్శకుడు సాయి రాజేశ్ (Sai Rajesh) తెరకెక్కించిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద రూ. 90 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించి.. చిన్న సినిమాల్లో పెద్ద విజయాన్ని అందుకుంది. ఈ సక్సెస్ నేపథ్యంలో దర్శకుడు సాయి రాజేశ్‌కు బెంజ్ కారు (Benz Car) గిఫ్ట్‌గా ఇచ్చారు నిర్మాత ఎస్కేఎన్ (SKN). రీసెంట్‌గా సూపర్ స్టార్ రజనీకాంత్ (Super Star Rajinikanth) నటించిన ‘జైలర్’ (Jailer) చిత్రం భారీ విజయం సాధించి, కలెక్షన్ల సునామీ సృష్టించడంతో.. హీరోకి, దర్శకుడికి, సంగీత దర్శకుడికి నిర్మాత కాస్ట్లీ కార్లను గిఫ్ట్‌గా ఇచ్చిన విషయం తెలిసిందే.

‘బేబీ’ విషయానికి వస్తే.. చిన్న సినిమాల పరంగా చూస్తే.. ఈ సినిమా సాధించిన కలెక్షన్స్ దాదాపు ‘జైలర్’ రేంజ్ అనే చెప్పుకోవాలి. అందుకే నిర్మాత ఎస్కేఎన్.. మరో మారు తన సినిమా సక్సెస్ కిక్కుని ఇలా ప్రదర్శించారు. వాస్తవానికి ‘బేబీ’ సినిమా రిలీజ్‌కు ముందే రషెస్ చూసిన కాన్ఫిడెన్స్‌తో డైరెక్టర్ సాయి రాజేశ్‌కు ఒక కారు గిఫ్ట్‌గా ఇచ్చిన నిర్మాత ఎస్కేఎన్... ‘బేబీ’ సక్సెస్ సంతోషంలో ఇప్పుడు బెంజ్ కారు (Benz Car)‌ను బహుమతిగా అందించారు.


Sai-Rajesh.jpg

ఎస్కేఎన్, సాయి రాజేశ్ ఇండస్ట్రీకి రాకముందు నుంచీ మంచి ఫ్రెండ్స్. ‘బేబీ’ మూవీ సక్సెస్ వాళ్ల స్నేహానికి, ఒకరి మీద మరొకరికి ఉన్న నమ్మకానికి, సినిమా మేకింగ్ పట్ల ఉన్న ప్యాషన్‌కు కొలమానంగా నిలిచింది. థియేటర్స్‌లో సూపర్ హిట్ అయిన ‘బేబీ’ (Baby Movie) మూవీ ఓటీటీలోనూ రికార్డ్ స్థాయిలో వ్యూస్ దక్కించుకుంది. కాగా.. సాయి రాజేష్ తన నెక్స్ట్ సినిమా కూడా నిర్మాత ఎస్కేఎన్‌తోనే చేస్తున్నారు. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కనుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.


ఇవి కూడా చదవండి:

============================

*Varun Tej: వరుణ్ తేజ్ సినిమాకు షాకింగ్ నాన్ థియేట్రికల్ రైట్స్

************************************

*Ala Ninnu Cheri: కోడి బాయె లచ్చమ్మదీ.. పాట వదిలిన తలసాని.. హెబ్బా ఏముందిరా?

***************************************

*Agent: ‘ఏజెంట్’ని వదలని కష్టాలు.. ఓటీటీ‌లో విడుదల డౌటే.. ఎందుకంటే?

***************************************

*Pawan Kalyan: జనసేనకు స్టంట్ మేన్ బద్రి విరాళం

*************************************

Updated Date - 2023-09-29T19:50:24+05:30 IST