Malayalam Actor: ఆస్తి కోసం భార్యనే మళ్లీ పెళ్లి చేసుకుంటున్న నటుడు

ABN , First Publish Date - 2023-03-08T11:33:49+05:30 IST

వివాహమైన 29 ఏళ్ల తర్వాత ఆస్తి కోసం మలయాళీ నటుడు సీ శుక్కుర్ (C Shukkur) తన భార్యనే మళ్లీ పెళ్లి చేసుకోనున్నాడు.

Malayalam Actor: ఆస్తి కోసం భార్యనే మళ్లీ పెళ్లి చేసుకుంటున్న నటుడు

వివాహమైన 29 ఏళ్ల తర్వాత ఆస్తి కోసం మలయాళీ నటుడు సీ శుక్కుర్ (C Shukkur) తన భార్యనే మళ్లీ పెళ్లి చేసుకోనున్నాడు. కేరళలోని కాసర్‌గోడ్‌కు చెందిన ఒక ముస్లిం జంట కుమార్తెల వారసత్వ సంపదకు సంబంధించి సమాజంలో లింగ వివక్షకు వ్యతిరేక ప్రచారంలో భాగంగా మరోసారి వివాహానికి సిద్ధమయ్యారు.

న్యాయవాది అయిన శుక్కూర్ నటుడు కూడా. మలయాళీ హీరో కుంచాకో బోబన్ నటించిన ‘నా తాన్ కేసు కొడు’ అనే చిత్రంలో లాయర్ పాత్రలో నటించాడు. ఈ నటుడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున తన భార్య షీనాని మరోసారి పెళ్లాడబోతున్నారు. దానికి కారణం ఆస్తి. ఈ ముస్లిం జంట మొదట ముస్లిం పెళ్లి పద్ధతై షరియత్ చట్టం ప్రకారం వివాహం చేసుకున్నారు. ఈ జంటకి ముగ్గురు కూతుర్లు సంతానంగా కలిగారు.

అయితే.. ముస్లిం పర్సనల్ లా (Muslim Personal Law) (షరియత్) ప్రకారం, మగ పిల్లలకి మాత్రమే తమ తల్లిదండ్రుల ఆస్తిని పూర్తిగా దక్కతుంది. కూతుర్లకి మాత్రం మూడింట రెండొంతుల ఆస్తి మాత్రమే దక్కుతుంది. మిగిలిన భాగం తండ్రి సోదరులకి చెందుతుంది. ఇది శుక్కుర్ దంపతులకి నచ్చలేదు. తమ కూతుర్ల భవిష్యత్తు కోసం, అలాగే లింగ వివక్షకి వ్యతిరేకంగా ప్రత్యేక వివాహ చట్టం (Special Marriage Act (SMA)) ప్రకారం పెళ్లి చేసుకోడానికి ఈ జంట సిద్ధమైంది. దీని మూలంగా వారి మొత్తం ఆస్తి కూతుర్లకి దక్కే అవకాశం ఏర్పడుతుంది.

కాగా.. శుక్కుర్, షీనా దంపతులకి 1994లో అక్టోబర్ 6న షరియత్ చట్టం ప్రకారం పెళ్లైంది. వీరు మార్చి 8, 2023న కసరగోడ్‌లోని కన్హంగడ్ సబ్ రిజిస్ట్రర్ కార్యాలయంలో రెండో సారి పెళ్లి చేసుకోనున్నారు.

ఇవి కూడా చదవండి:

Anicka: హీరోయిన్‌ని ముఖం వాచిపోయేలా కొట్టిన మాజీ ప్రియుడు.. అసలు విషయం ఏమిటంటే?

Video Viral: ‘కేజీఎఫ్’ కాంట్రవర్సీ.. సారీ కాని సారీ చెప్పిన వెంకటేశ్ మహా

Kushboo Sundar : కన్నతండ్రే నన్ను లైంగికంగా వేధించాడు.. షాకింగ్ విషయాలు వెల్లడించిన నటి

Manchu Manoj Weds Mounika reddy: ముహూర్తం ఫిక్స్.. అతి కొద్దిమంది సమక్షంలో..

Allu Arjun: అల్లు అర్జున్ నెక్ట్స్ మూవీపై అధికారిక ప్రకటన.. డైరెక్టర్ ఎవరో తెలుసా?

Pawan Kalyan: కన్నడ స్టార్ హీరోలకు పవన్ క్షమాపణలు.. కారణం ఏంటంటే..

Rashmi Gautam: ‘ఇది దారుణం.. వాడి లవర్ వాడి ఇష్టమంట’.. నాగశౌర్యకి సపోర్టుగా రష్మి పోస్టు


Updated Date - 2023-03-08T11:43:27+05:30 IST