సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Young Actor: ఇంట్లో ఉరి వేసుకొని నటుడి ఆత్మహత్య

ABN, First Publish Date - 2023-04-24T16:51:03+05:30

ఇప్పుడిప్పుడే మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకుంటోన్న ఓ యువ నటుడు బెంగళూర్‌లోని తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ ఘటన

Actor Sampath Jayaram
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సినిమా పరిశ్రమలో (Cinema Industry) వరసగా విషాదకర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే పలువురు ప్రముఖులను దూరం చేసుకున్న సినిమా ఇండస్ట్రీ.. తాజాగా మరో యువ నటుడిని కోల్పోయింది. విషయం ఏమిటనేది తెలియదు కానీ.. ఇప్పుడిప్పుడే మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకుంటోన్న ఓ యువ నటుడు బెంగళూర్‌లోని తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ ఘటన కన్నడ సినీ ఇండస్ట్రీని షాక్‌కు గురి చేసింది.

సినిమాలలోనే కాకుండా.. టీవీ పరిశ్రమలో కూడా మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకుంటున్న కన్నడ నటుడు సంపత్ జయరామ్‌ (Sampath Jayaram) ఆత్మహత్య చేసుకున్నారు. కన్నడలో అగ్నిసాక్షి (Agnisakshi) సీరియల్‌తో సంపత్ జయరామ్‌ మంచి గుర్తింపును పొందారు. సీరియల్స్‌తో పాటు పలు చిత్రాల్లోనూ ఆయన నటిస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఆయనకు సరైన అవకాశాలు రాకపోవడం కారణంగానే ఆయన ఆత్మహత్య చేసుకుని ఉంటాడనేలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రస్తుతం అతని వయసు 35 సంవత్సరాలు. సంపత్‌కు ఏడాది కిందటే వివాహం (Marriage) జరిగింది. పెళ్లి అనంతరం ఖర్చులు బాగా పెరిగిపోవడం, అదే సమయంలో అవకాశాలు రాకపోవడంతో.. డిప్రెషన్‌కి లోనైన సంపత్ ఇలా ఆత్మహత్య చేసుకుని ఉంటాడని.. అతని సన్నిహితులు సైతం చెబుతుండటం విశేషం. సంపత్ జయరామ్ ఆత్మహత్యపై పోలీసులు (Police) కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంపత్‌ మృతితో ఆయన కుటుంబం షాక్‌కు గురవగా.. పలువురు కన్నడ సినీ, టీవీ ప్రముఖులు సంపత్‌ మృతికి నివాళులర్పిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

************************************************

*King Nagarjuna: కడుపులో ఉండగానే.. అయ్యగారి గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!

*Hari Hara Veera Mallu: కీరవాణి కూడా..!

*Akhil Akkineni: ‘ఏజెంట్’లో అది నాకు చాలా కష్టమనిపించింది

*Dhanush: 40 ఏళ్ల వయసులో యూత్‌ ఐకాన్‌ అవార్డు

*Mama Mascheendra Teaser Talk: మహేష్ బావ.. ఆ ఇద్దర్నీ ఒకేసారి చంపేస్తాడట!

*OG Producer: మటన్ బిర్యానీతో పవన్ కల్యాణ్ ఫ్యాన్‌ని సర్‌ప్రైజ్ చేసిన నిర్మాత

*Young Actress: మోడల్స్‌ని వ్యభిచార ఊబిలోకి దించుతోన్న నటి అరెస్ట్

Updated Date - 2023-04-24T16:51:03+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!