Sudeep: బ్రేక్‌లో ఉన్న హీరో.. కారణమేంటంటే..

ABN , First Publish Date - 2023-04-02T15:27:04+05:30 IST

కన్నడ సూపర్ స్టార్స్‌లో సుదీప్ (Sudeep) ఒకరు. యాత్‌లో ఆయనకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ‘ఈగ’ (Eega) తో తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువయ్యారు. సుదీప్ నుంచి సినిమా వస్తుందంటే చాలు అభిమానులందరు ఆసక్తిగా ఎదరు చూస్తుంటారు.

Sudeep: బ్రేక్‌లో ఉన్న హీరో.. కారణమేంటంటే..

కన్నడ సూపర్ స్టార్స్‌లో సుదీప్ (Sudeep) ఒకరు. యాత్‌లో ఆయనకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ‘ఈగ’ (Eega) తో తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువయ్యారు. సుదీప్ నుంచి సినిమా వస్తుందంటే చాలు అభిమానులందరు ఆసక్తిగా ఎదరు చూస్తుంటారు. చివరగా ఆయన ‘విక్రాంత్ రోణ’ (Vikrant Rona) లో నటించారు. ఈ మూవీ అనంతరం సుదీప్ నెక్ట్స్ ఏ ప్రాజెక్టు చేస్తాడోనని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు.

‘‘నా స్నేహితులందరికి హాలో. నా నెక్ట్స్ ప్రాజెక్టు గురించి మీరు చేస్తున్న ట్వీట్స్, మీమ్స్ అన్ని నాకు అర్థమవుతున్నాయి. మీరు అందరు నాపై చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు. అందువల్ల నేను చిన్న స్పష్టత ఇవ్వాలనుకుంటున్నాను. నేను సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్నాను. మొదటిసారిగా నేను తీసుకున్న బ్రేక్ ఇదే. విక్రాంత్ రోణ అనేది కష్టతరమైన ప్రాజెక్టు. కోవిడ్ విలయతాండవం చేస్తున్నప్పటికి అన్నింటిని తట్టుకుని ఈ సినిమాను షూట్ చేశాం. బిగ్‌బాస్ ఓటీటీ ప్లస్ టీవీ చిత్రీకరణ కూడా చాలాకాలం సాగింది. అందువల్ల కొంచెం బ్రేక్ తీసుకుని నా మనసుకు హాయిని కలిగించే పనిని చేయాలనుకున్నాను. క్రికెట్ నాకు సంతోషాన్నిస్తుంది. దీని కోసం కొంచెం సమయాన్ని వెచ్చించాను. నా దైనందిన జీవితంలో స్క్రిఫ్ట్ చర్చలు, మీటింగ్స్ అనేవి సాధారణమైన విషయం. మూడు స్క్రిఫ్ట్‌లు ఫైనలైజ్ అయ్యాయి.. దాని అర్థం ఏంటంటే మూడు సినిమాలు చేయబోతున్నాను. ఆ చిత్రాలకు సంబంధించి చాలా హోంవర్క్ అవసరం. ఆ చిత్ర బృందాలు పగలు రాత్రి అనే తేడా లేకుండా అందుకోసం కష్టపడుతున్నాయి. ఆ మూవీస్‌కు సంబంధించిన ప్రకటనలు అతి త్వరలోనే వస్తాయి’’ అని కిచ్చా సుదీప్ తెలిపారు.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

Janhvi Kapoor: స్టేజ్‌పై డ్యాన్స్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్స్..

Dasara: సీన్‌ను తొలగించాలని డిమాండ్.. థియేటర్స్ వద్ద ధర్నా..

Koffee With Karan: భార్యతో కలిసి రావాలంటూ సౌత్ స్టార్ హీరోలకు పిలుపు.. బుక్ చేస్తాడేమో చూసుకోండి..

Web Series: భారత్‌లో ఎక్కువ మంది వీక్షించిన వెబ్ సిరీస్ ఏంటో తెలుసా..?

SSMB29: మహేశ్ సినిమా కోసం రాజమౌళి వర్క్‌షాప్స్

Suriya: ముంబైలో లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేసిన సూర్య.. ధర వింటే షాకే..

Updated Date - 2023-04-02T15:28:08+05:30 IST