Heroines: బుల్లితెర నుంచి వెండితెరకి.. వీరి రూటే సపరేటు..

ABN , First Publish Date - 2023-03-09T14:09:32+05:30 IST

చాలామంది హీరోయిన్స్ మోడల్స్‌గా ఉండి.. అనంతరం సినిమా అవకాశాలు దక్కించుకోడం తెలిసిందే.

Heroines: బుల్లితెర నుంచి వెండితెరకి.. వీరి రూటే సపరేటు..

చాలామంది హీరోయిన్స్ మోడల్స్‌గా ఉండి.. అనంతరం సినిమా అవకాశాలు దక్కించుకోడం తెలిసిందే. అయితే కొందరూ మాత్రం డిఫరెంటుగా బుల్లితెర నుంచి వెండితెరకు పరిచయమవుతున్నారు. వీరిలో అనేక మంది తమ ప్రతిభతో సినీ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. బుల్లితెరపై ప్రసారమైన అనేక పాపులర్‌ సీరియళ్లలో నటించి ప్రేక్షకుల మనసు దోచుకున్న ఎందరో నటీమణులకు వెండితెరపై అవకాశాలు వస్తున్నాయి. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకున్న వారిలో హన్సికా మోత్వానీ (Hansika Motwani), శ్రీ విద్య (Sri Vidya), ప్రియా భవానీశంకర్‌, వాణి భోజన్‌, మృణాల్‌ ఠాకూర్‌, మౌనీరాయ్‌ వంటివారు ఉన్నారు.

వీరిలో మృణాల్‌ ఠాకూర్‌కు ‘సీతారామం’ చిత్రంతో దక్షిణాదిలో బాగా పాపులారిటీ వచ్చిన సంగతి తెలిసిందే. వాణిభోజన్‌కు సైతం వరుసగా మూవీ అవకాశాలు వస్తున్నాయి. ఈమె చేతిలో అనేక ప్రాజెక్టులున్నాయి. టీవీలో న్యూస్‌ రీడర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన ప్రియా భవానీ శంకర్‌ ప్రస్తుతం తమిళంతో పాటు తెలుగులోనూ అవకాశాలు దక్కించుకుంటోంది. కమల్ హాసన్ ‘ఇండియన్‌-2’లోనూ నటించే ఛాన్స్ కొట్టేశారు. హన్సిక మోత్వానీ దక్షిణాదిలో చిన్న ఖుష్బూగా ప్రేక్షకులతో నీరాజనాలు అందుకున్న ఈమె.. హీరోయిన్‌గా ఓ వెలిగింది. ఈ భామ ఇటీవల వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి:

Sri Devi 2.0: పల్లెటూరి యువతిలా మారిపోయిన జాన్వీ.. చూపు తిప్పుకోలేకపోతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్

OTT Release: తాజాగా ఓటీటీలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాలు ఇవే..

Anicka: హీరోయిన్‌ని ముఖం వాచిపోయేలా కొట్టిన మాజీ ప్రియుడు.. అసలు విషయం ఏమిటంటే?

Video Viral: ‘కేజీఎఫ్’ కాంట్రవర్సీ.. సారీ కాని సారీ చెప్పిన వెంకటేశ్ మహా

Kushboo Sundar : కన్నతండ్రే నన్ను లైంగికంగా వేధించాడు.. షాకింగ్ విషయాలు వెల్లడించిన నటి

Manchu Manoj Weds Mounika reddy: ముహూర్తం ఫిక్స్.. అతి కొద్దిమంది సమక్షంలో..

Allu Arjun: అల్లు అర్జున్ నెక్ట్స్ మూవీపై అధికారిక ప్రకటన.. డైరెక్టర్ ఎవరో తెలుసా?

Updated Date - 2023-03-09T14:09:34+05:30 IST