Mission Tashafi: హై ఇన్‌టెన్స్ యాక్ష‌న్ స్పై థ్రిల్ల‌ర్‌ సిరీస్‌లో తిరువీర్

ABN , First Publish Date - 2023-07-23T21:20:42+05:30 IST

తిరువీర్‌.. ఇప్పుడు తెలుగు సినిమాల్లో వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో ఆక‌ట్టుకుంటూ విల‌క్ష‌ణ న‌టుడిగా త‌న‌దైన గుర్తింపును పొందుతూ దూసుకెళుతోన్న హీరో. ఓ వైపు సినిమాల‌తో పాటు ఓటీటీ మాధ్య‌మంలోనూ తిరువీర్ రాణిస్తున్నారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ‘మిషన్ తషాఫి’ పేరుతో Zee 5, ప్రణతి రెడ్డి నిర్మిస్తోన్న హై ఇన్‌టెన్స్ యాక్ష‌న్ స్పై థ్రిల్ల‌ర్‌లో తిరువీర్ నటిస్తున్నట్లుగా తెలుపుతూ ఆయన లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు.

Mission Tashafi: హై ఇన్‌టెన్స్ యాక్ష‌న్ స్పై థ్రిల్ల‌ర్‌ సిరీస్‌లో తిరువీర్
Thiruveer

తిరువీర్‌.. ఇప్పుడు తెలుగు సినిమాల్లో వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో ఆక‌ట్టుకుంటూ విల‌క్ష‌ణ న‌టుడిగా త‌న‌దైన గుర్తింపును పొందుతూ దూసుకెళుతోన్న హీరో. ఓ వైపు సినిమాల‌తో పాటు ఓటీటీ మాధ్య‌మంలోనూ తిరువీర్ (Thiruveer) రాణిస్తున్నారు. ఇప్పుడు టాప్ ఓటీటీ మాధ్య‌మాల్లో ఒక‌టైన జీ5 ఎంతో ప్రెస్టీజియ‌స్‌గా రూపొందిస్తోన్న వెబ్ సిరీస్ ‘మిషన్ తషాఫి’ (Mission Tashafi)లో ఆయ‌న ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించి జీ 5 (Zee5) అధికారిక ప్ర‌క‌ట‌న‌ను ఆదివారం విడుద‌ల చేసింది. ఎంగేజింగ్‌, థ్రిల్లింగ్ యాక్ష‌న్ స‌న్నివేశాల‌తో సినిమాల‌ను తెర‌కెక్కిస్తూ త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ స‌త్తారు (Praveen Sattaru) ఈ వెబ్ సిరీస్‌ను డైరెక్ట్ చేస్తున్నారు. ప్ర‌ణ‌తి రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే రెగ్యుల‌ర్ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ వెబ్ సిరీస్‌లోకి వెర్స‌టైల్ యాక్ట‌ర్ తిరువీర్ జాయిన్ కావ‌టంపై మేక‌ర్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. తిరువీర్ బ‌ర్త్‌డే సంద‌ర్బంగా ‘మిషన్ తషాఫి’లో ఆయ‌న న‌టిస్తున్నారంటూ జీ 5 అధికారికంగా ప్ర‌క‌టిస్తూ.. ఆయన లుక్‌ని కూడా విడుదల చేసింది. తిరువీర్ విల‌క్ష‌ణ న‌ట‌న‌తో త‌న పాత్ర‌ను డైరెక్ట‌ర్ ఊహించిన దాని కంటే ఇంకా బెట‌ర్ ఔట్ పుట్ ఇస్తార‌ని మేక‌ర్స్‌ భావిస్తున్నారు. ప్ర‌వీణ్ స‌త్తారు వంటి డైరెక్ట‌ర్‌తో క‌లిసి ప‌ని చేయ‌టంపై తిరువీర్ సైతం ఎంతో ఆస‌క్తిగా ఉన్నారు.


Praveen-Sattaru.jpg

ఇండియాలో భారీ విధ్వంసాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్న ఒక విదేశీ తీవ్రవాద సంస్థకి, ఇండియన్ RAW ఏజెంట్స్‌కి మధ్య నడిచే భావోద్వేగమైన హై ఇన్‌టెన్స్ యాక్ష‌న్ స్పై థ్రిల్ల‌ర్ ఇదని జీ5 వర్గాలు తెలిపాయి. 8 ఎపిసోడ్స్ ఉన్న ‘మిషన్ తషాఫి’ వెబ్ సిరీస్‌ను ఫిల్మ్ రిప‌బ్లిక్ బ్యాన‌ర్‌పై ప్ర‌ణ‌తి రెడ్డి (Pranathi Reddy) నిర్మిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగు ఓటీటీలో ఎవ‌రూ నిర్మించని రీతిలో జీ 5 దీన్ని భారీ బ‌డ్జెట్‌, హై టెక్నిక‌ల్ వేల్యూస్‌తో రూపొందిస్తోంది. అంతే కాకుండా ఇప్ప‌టి వ‌ర‌కు ఓ తెలుగు వెబ్ సిరీస్‌ను ఫారిన్ లొకేష‌న్స్‌లో చిత్రీక‌రించ‌లేదు. తొలిసారి ‘మిషన్ తషాఫి’ సిరీస్‌ను విదేశాల్లో కూడా చిత్రీక‌రిస్తున్నారు. అలాగే ఇంట‌ర్నేష‌న‌ల్ యాక్ష‌న్ కొరియోగ్రాఫ‌ర్స్ నేతృత్వంలో ఫైట్స్‌ను చిత్రీక‌రిస్తున్నారు డైరెక్ట‌ర్ ప్ర‌వీణ్ స‌త్తారు. త్వరలోనే ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్స్ ప్రకటించనున్నారు. (Thiruveer Look From Mission Tashafi)

ఇవి కూడా చదవండి:

**************************************

*Bhagavanth Kesari: ఆయుధ పూజతో గీ సారి దసరా జోర్దారుంటది

**************************************

*Amala Paul: మళ్లీ స్పాట్‌లైట్‌లోకి అమల.. ఫొటోస్‌‌తో మతి పోగొట్టేసిందిగా!

**************************************

*SS Rajamouli: ‘కల్కి 2989 AD’ గ్లింప్స్ రాజమౌళికి నచ్చిందా.. ఎలా స్పందించారంటే?

**************************************

*Unstoppable: ఓటీటీలోకి వచ్చేసిన ‘అన్‌స్టాపబుల్’.. ఎందులో స్ట్రీమింగ్ అంటే..

**************************************

*Malavika Mohanan: జీవితం ఒక కళాకృతి కాదా?

**************************************

Updated Date - 2023-07-23T21:20:42+05:30 IST