Sindhooram: ఓటీటీలోకి వచ్చేసిన ‘సిందూరం’.. ఏ ఓటీటీలోకి అంటే?

ABN , First Publish Date - 2023-04-21T22:41:23+05:30 IST

సింధూరం చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నట్లుగా మేకర్స్‌తో పాటు సదరు ఓటీటీ సంస్థ కూడా ప్రకటించింది. ఎవరైనా థియేటర్స్‌లో ఈ సినిమాని మిస్ అయ్యామనుకుంటే.. ఇప్పుడీ సినిమాని ఓటీటీలో చూసేయవచ్చు.

Sindhooram: ఓటీటీలోకి వచ్చేసిన ‘సిందూరం’.. ఏ ఓటీటీలోకి అంటే?
Sindhooram Movie Still

శివ బాలాజీ (Siva Balaji), ధర్మ (Dharma), బ్రిగిడా సాగ ప్రధాన తారాగణంగా శ్యామ్ తుమ్మలపల్లి (Director Shyam Tummalapalli) దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సిందూరం’ (Sindhooram). ఈ ఏడాది జనవరి 26న థియేటర్స్‌లో విడుదలై విమర్శకుల ప్రశంసలతో పాటు జనాధారణ పొందిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతున్నట్లుగా మేకర్స్‌తో పాటు సదరు ఓటీటీ సంస్థ కూడా ప్రకటించింది. ఎవరైనా థియేటర్స్‌లో ఈ సినిమాని మిస్ అయ్యామనుకుంటే.. ఇప్పుడీ సినిమాని ఓటీటీలో చూసేయవచ్చు.

నక్సల్స్ పాయింట్‌తో ఉద్యమం నేపథ్యంలో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. హిస్టరీలో జరిగిన కొన్ని రియాలిటీ సన్నివేశాలను ఈ సిందూరం సినిమాలో చూపించడం జరిగింది. ఉద్యమ నేపథ్యం, రాజకీయం, ప్రేమకథ ఇందులో ఉంటాయి. ఓవరాల్‌గా ఇది నక్సల్ ఇన్ఫార్మర్ కథగా తెరకెక్కింది. హై ఇంటెన్స్ సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి కూడా మంచి స్పందననే రాబట్టుకుంది. (Sindhooram Release in OTT)

ఈ సినిమా కథ విషయానికి వస్తే.. (Sindhooram Story) కథ అంతా కూడా 2003 ప్రాంతంలో జరుగుతుంది. శ్రీరామగిరి ఎజెన్సీ ఏరియాలో పెత్తందార్లు, భూస్వాముల ఆగడాలు, దానిపై సింగన్న దళం (శివబాలాజీ) చేసే పోరాటాల నేపథ్యంలో ఉంటుందీ కథ. అలాంటి సమయంలో ఎమ్మార్వోగా శిరీష రెడ్డి (బ్రిగిడ సాగా) శ్రీరామగిరికి వస్తుంది. అక్కడి సమస్యలను పరిష్కరించాలని ప్రయత్నం చేస్తుంటుంది. శిరీషకు తోడుగా ఆమె కాలేజ్ ఫ్రెండ్‌ రవి (ధర్మ) ఉంటాడు. ఆ రవి నక్సలైట్ ఇన్‌ఫార్మర్‌. ఊర్లో జరిగే జడ్పీటీసీ ఎన్నికల్లో భాగంగా తన అన్న ఈశ్వరయ్య చనిపోవడంతో ఎమ్మార్వోగా ఉన్న శిరీష ఆ ఎన్నికలలో పోటీ చేయాల్సి వస్తుంది. అయితే ఆమె పోటీ చేయడం సింగన్న దళానికి నచ్చదు. అప్పుడు శిరీషను సింగన్న దళం ఏం చేసింది? సింగన్న దళం చేసిన పనికి రవి ఏం చేశాడు? అసలు ఈశ్వరయ్యను చంపింది ఎవరు? వంటి ఆసక్తికర కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. (Sindhooram in Amazon Prime)

ఇవి కూడా చదవండి:

************************************************

*Sai Madhav Burra: రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’పై ఆసక్తికర కామెంట్స్

*Malli Pelli Teaser Review: నరేష్, పవిత్ర, రమ్య రఘుపతి.. ఎమ్మెస్ రాజు ఏంటి మాకీ కర్మ?

*Ramabanam Trailer Talk: ‘లక్ష్యం 2’ అనిపిస్తోంది

*Virupaksha Twitter Review: ‘విరూపాక్ష’ ట్విట్టర్ టాక్ ఎలా ఉందంటే..?

*Mrunal Thakur: ఈమె ‘సీతా రామం’ సీత అంటే ఎవరూ నమ్మరు కాక నమ్మరంతే..!

Updated Date - 2023-04-21T22:41:23+05:30 IST