సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Shaakuntalam: చెప్పిన టైమ్ కంటే ఒక రోజు ముందే.. ఓటీటీలోకి వచ్చేసింది

ABN, First Publish Date - 2023-05-11T23:55:44+05:30

కాళిదాసు రచించిన ‘అభిజ్ఞాన శాకుంతలం’ కావ్యం ఆధారంగా తెరకెక్కిన శాకుంతలం చిత్రానికి గుణశేఖర్ దర్శకుడు. నీలిమ గుణ నిర్మించారు. ఏప్రిల్‌ 14న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయాన్ని చవిచూసింది. ఎన్నో అంచనాల మధ్య

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సమంత (Samantha) టైటిల్‌ పాత్రలో నటించిన సినిమా ‘శాకుంతలం’ (Shaakuntalam). దిల్‌రాజు (Dil Raju) సమర్పించిన ఈ చిత్రం గుణ టీమ్‌ వర్క్స్ నిర్మించింది. కాళిదాసు రచించిన ‘అభిజ్ఞాన శాకుంతలం’ కావ్యం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి గుణశేఖర్ (Guna Sekhar) దర్శకుడు. నీలిమ గుణ (Neelima Guna) నిర్మించారు. ఏప్రిల్‌ 14న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయాన్ని చవిచూసింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు తొలి రోజు, తొలి ఆట నుంచే తిరస్కరించారు. దీంతో ఈ చిత్రం ఈ యేడాది ఇప్పటి వరకు విడుదలైన చిత్రాలలో.. భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ఇప్పుడీ చిత్రాన్ని ఓటీటీలోకి వదిలారు. వాస్తవానికి ఈ చిత్రం మే 12న అఫీషియల్‌గా ఓటీటీలో విడుదల కావాల్సి ఉండగా.. ఒక రోజు ముందే అంటే మే 11నే ‘శాకుంతలం’ ఓటీటీలో దర్శనమిచ్చింది అందరినీ ఆశ్చర్యపరిచింది.

ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో (Amazon Prime Video)లో తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. బిగ్‌ స్క్రీన్ ప్రేక్షకులని అలరించలేకపోయిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో ఎటువంటి టాక్‌ని, ఆదరణను రాబట్టుకుంటుందో అనేది వేచి చూడాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఈ చిత్రానికి ఓటీటీలో బాగానే ఆదరణ లభిస్తున్నట్లుగా తెలుస్తోంది. మహాభారతంలోని శకుంతల-దుష్యంతుడి ప్రేమకథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో శకుంతలగా సమంత నటించగా.. దుష్యంతుడిగా మలయాళ నటుడు దేవ్ మోహన్ (Dev Mohan) నటించారు. ఇంకా భారీ తారాగణం ఇందులో నటించారు.

‘శాకుంతలం’ కథ (Shaakuntalam Story) విషయానికి వస్తే.. ఈ కథ ఏమి అంత తెలియనిది కాదు, అందరికీ తెలిసిందే. విశ్వామిత్ర మహర్షి తపస్సును భంగం చేయడానికి దేవేంద్రుడు అప్సరస అయిన మేనకను పంపిస్తాడు. ఆ క్రమంలో మేనక, విశ్వామిత్రులు శారీరకంగా కలుస్తారు, ఒక పాప పుడుతుంది. ఆ పాపని మేనక భూలోకంలో వదిలి వెళ్ళిపోతుంది. పక్షులు తీసుకువెళ్లి కణ్వ మహర్షి ఆశ్రమంలో వదిలేస్తాయి, కణ్వ మహర్షి ఆ పాపకి శకుంతల అని నామకరణం చేస్తాడు. శకుంతల పెద్దదైన తర్వాత.. ఒకనాడు దుష్యంత మహారాజు (దేవ్ మోహన్) వేటకు వచ్చి కణ్వ మహర్షి ఆశ్రమంలో ఉన్న శకుంతలను చూసి, మోహించి, ప్రేమలో పడి గాంధర్వ వివాహం చేసుకుంటాడు. రాజ్యానికి వెళ్లి మేళ తాళాలతో తిరిగి వచ్చి శకుంతలను తీసుకొని వెళ్తానంటాడు. ఈలోపు శకుంతల గర్భవతి అవుతుంది. అప్పుడు శకుంతలను దుష్యంత మహారాజు రాజ్యానికి వెళ్లి కలవమని కణ్వ మహర్షి చెబుతాడు. అతని మాట విని దుష్యంత మహారాజు రాజ్యానికి వెళ్లిన శకుంతలకు ఏమైంది? దుష్యంత మహారాజు ఎందుకు శకుంతలని తీసుకు వెళ్ళడానికి రాలేదు? వంటి ప్రశ్నలకు సమాధానమే విజువల్ వండర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం.

ఇవి చదవండి:

************************************************

*Naresh: ట్రైలర్.. జస్ట్ మచ్చు తునక మాత్రమే! నా బయోపిక్ కాదు

*Harish Shankar: అప్పుడు 10 ఏళ్ల ఆకలి.. ఇప్పుడు ఇది నా 11 ఏళ్ల ఆకలి

*Ustaad Bhagat Singh: ఈసారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది

*Poonam Kaur: ‘ఉస్తాద్’‌ని కెలికిన పూనమ్ కౌర్.. ఉగ్రరూపం ప్రదర్శిస్తోన్న ఫ్యాన్స్

*Allu Arjun: 30 ఏళ్ల తర్వాత సడెన్‌గా ఆమెని చూసి షాకైన బన్నీ.. ఆమె ఎవరో తెలుసా?

*Kushboo: పెళ్ళి కోసం నేను మతం మారలేదు.. ‘కేరళ స్టోరీ’ విమర్శలపై ధీటైన సమాధానం

*NBK108: బ్రహ్మాజీకి కోపం వచ్చింది.. అందుకే డైరెక్టర్‌కి నమస్తే పెట్టేశాడు

*Aadi Saikumar: ఆది సినిమా.. ఒకటి కాదు.. రెండు ఓటీటీల్లో..

Updated Date - 2023-05-12T00:03:59+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!