NBK108: బ్రహ్మాజీకి కోపం వచ్చింది.. అందుకే డైరెక్టర్‌కి నమస్తే పెట్టేశాడు

ABN , First Publish Date - 2023-05-10T18:22:55+05:30 IST

NBK108 సినిమాలో అవకాశం వచ్చిన వారందరికీ ఆన్ బోర్డ్ అంటూ ప్రత్యేకంగా పరిచయం చేశారు. కాజల్ అగర్వాల్, శ్రీలీల వంటి వారందరికీ వెల్‌కమ్ టు ఆన్ బోర్డ్ అంటూ స్వాగతం పలికారు. దీనిపై బ్రహ్మాజీ అలుక వహించారు. దీంతో ఆయన ఏం చేశాడంటే..

NBK108: బ్రహ్మాజీకి కోపం వచ్చింది.. అందుకే డైరెక్టర్‌కి నమస్తే పెట్టేశాడు
Brahmaji at NBK108 Sets

NBK108 దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi)పై విలక్షణ నటుడు బ్రహ్మాజీ (Brahmaji) సోషల్ మీడియా వేదికగా పంచ్‌లు పేల్చారు. పంచ్‌లే కాదు.. BMW కారులో నుంచి స్టైలిష్‌గా దిగి.. అనిల్ రావిపూడి కాళ్లకు దండం పెట్టబోతున్నట్లుగా అతనికి ఓ ఝలక్ కూడా ఇచ్చారు. ఇప్పుడా వీడియోని బ్రహ్మాజీ ట్విట్టర్‌లో షేర్ చేయడంతో.. దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అసలీదంతా ఎందుకు వచ్చిందంటే.. బుధవారం NBK108 సినిమాకు సంబంధించి మేకర్స్ ఓ అప్‌డేట్‌ను వదిలిన విషయం తెలిసిందే. అంతకుముందు ఈ సినిమాలో అవకాశం వచ్చిన వారందరికీ ఆన్ బోర్డ్ అంటూ ప్రత్యేకంగా పరిచయం చేశారు. కాజల్ అగర్వాల్ (Kajal Agarwal), శ్రీలీల (Sreeleela) వంటి వారందరికీ వెల్‌కమ్ టు ఆన్ బోర్డ్ అంటూ స్వాగతం పలికారు. దీనిపై బ్రహ్మాజీ అలుక వహించారు.

అందుకే సోషల్ మీడియా వేదికగా తన అలుకని తెలియజేశారు. ‘‘డైరెక్టర్ గారూ.. మేము కూడా ఆన్ బోర్డే.. మాకు వెల్‌కమ్ లేదా. సర్లే.. నా పాన్ ఇండియా అభిమానులందరి కోసం ఈ చిన్న గ్లింప్స్’’ అంటూ ఓ వీడియోని జత చేశారు. ఈ వీడియోలో BMW కారులో నుంచి అదిరిపోయే లెవల్‌లో బ్రహ్మాజీ కారు దిగగా.. సెట్‌లో కూర్చుని డిస్కస్ చేస్తున్న అనిల్ రావిపూడి ఇది చూసి.. అన్నగారూ వెల్‌కమ్ అంటూ కుర్చీలో నుంచి లేచి రాగా.. అతని కాళ్లకు బ్రహ్మాజీ నమస్కారం పెట్టబోయారు. దీంతో షాకైన అనిల్ రావిపూడి.. ‘పెద్దోడివి నాకు నమస్కారం పెడతావేంటి’ అని వెనక్కి జరిగారు. నమస్కారం కాదు.. షూ బ్రాండ్ ఏంటో చూద్దామని అని.. జోక్ విసిరారు బ్రహ్మాజీ. అనంతరం ‘బ్రహ్మాజీగారూ.. వెల్‌కమ్ ఆన్ బోర్డ్’ అంటూ బ్రహ్మాజీని కౌగిలించుకుని అనిల్ రావిపూడి స్వాగతం పలికారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే దీనికి నెటిజన్ల కామెంట్స్ చూస్తే.. బ్రహ్మాజీ కూడా పొట్టచెక్కలయ్యేలా నవ్వుకుంటాడు. ఇంతకీ నెటిజన్లు ఏమని కామెంట్స్ చేస్తున్నారంటే.. (Netizens Reaction on Brahmaji Posted Video)

* మీరు బాలయ్యకి విలన్‌గా ఒక సీరియస్ రోల్ చేస్తే సూపర్బ్‌గా ఉంటుంది.

* ఆ వీడియో మొదలైన తీరు చూస్తే.. బాలయ్య‌గారు వచ్చి మీకు వెల్‌కమ్ చెబుతారేమో అనుకున్నా..

* వెల్‌కమ్ అంకుల్.. సంతూర్ సోప్ యాడ్ మీరే చేస్తే భలే ఉంటుంది

* లవ్ యు బ్రహ్మాజీ బ్రో.. మీ టైమింగ్‌కి, మీ యాక్టింగ్‌కి టేక్ ఏ బౌ.. ఇలా నెటిజన్లు బ్రహ్మాజీ ట్వీట్‌కు కామెంట్స్ చేస్తున్నారు. ఇక సినిమా విషయానికి వస్తే.. గాడ్ ఆఫ్ మాసెస్ (God Of Masses) నటసింహ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో షైన్ స్క్రీన్స్ బ్యానర్‌ (Shine Screens)పై సాహు గారపాటి, హరీష్ పెద్ది భారీ ఎత్తున నిర్మిస్తున్న చిత్రం ‘NBK108’. కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల కీలక పాత్రలో కనిపించనుంది. తాజాగా ఇందులో ఓ పవర్ ఫుల్ పాత్ర కోసం బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ నటించబోతున్నట్లుగా తెలుపుతూ.. మేకర్స్ ఓ వీడియోని కూడా విడుదల చేశారు. ఇందులో అర్జున్ రాంపాల్.. బాలకృష్ణ లెజెండ్ (Legend) చిత్రంలోని ‘ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు’ అనే పాపులర్ డైలాగ్ చెబుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న షూటింగ్‌లో ఆయన జాయిన్ అయ్యారు.


ఇవి కూడా చదవండి:

************************************************

*Aadi Saikumar: ఆది సినిమా.. ఒకటి కాదు.. రెండు ఓటీటీల్లో..

*Vijayashanthi: ఆ హక్కు ఎవరికుంది?.. ‘ది కేరళ స్టోరీ’ బ్యాన్‌పై సంచలన వ్యాఖ్యలు

*Vasuki Anand: పవన్ కల్యాణ్ సోదరి అందుకే రీ ఎంట్రీ ఇస్తున్నానంటోంది

*VD12: విజయ్ బర్త్‌డే స్పెషల్‌గా ప్రత్యేక పోస్టర్.. ఫ్యాన్స్ ఖుష్

*Kushi: సినిమా పేర్లతో విజయ్ దేవరకొండ, సమంత పాటేసుకున్నారు.. పాట ఎలా ఉందంటే..

Updated Date - 2023-05-10T18:22:59+05:30 IST