Puli Meka: దూసుకెళుతోన్న ‘పులి మేక’.. ఇప్పటి వరకు ఎన్ని వ్యూయింట్ మినిట్స్ అంటే..

ABN , First Publish Date - 2023-03-09T22:29:45+05:30 IST

జీ 5 (Zee 5), కోన ఫిల్మ్ కార్పొరేష‌న్ (Kona Film Corporation) క‌లిసి రూపొందించిన ఒరిజినల్ (ZEE5 Original) ‘పులి మేక’ (Puli Meka). టీజ‌ర్‌, ట్రైల‌ర్‌, గ్లింప్స్ ఇలా ప్రారంభం నుంచే క్యూరియాసిటీని క్రియేట్ చేసిన

Puli Meka: దూసుకెళుతోన్న ‘పులి మేక’.. ఇప్పటి వరకు ఎన్ని వ్యూయింట్ మినిట్స్ అంటే..
Puli Meka Web Series

జీ 5 (Zee 5), కోన ఫిల్మ్ కార్పొరేష‌న్ (Kona Film Corporation) క‌లిసి రూపొందించిన ఒరిజినల్ (ZEE5 Original) ‘పులి మేక’ (Puli Meka). టీజ‌ర్‌, ట్రైల‌ర్‌, గ్లింప్స్ ఇలా ప్రారంభం నుంచే క్యూరియాసిటీని క్రియేట్ చేసిన ఈ సిరీస్ ఆడియెన్స్ మ‌న్న‌న‌లు పొందుతూ ప్రస్తుతం జీ 5 ఓటీటీలో దూసుకెళ్తోంది. ఇప్ప‌టికే ఈ క్రైమ్ థ్రిల్ల‌ర్ 100 మిలియ‌న్స్ వ్యూయింగ్ మినిట్స్‌ను (100 million viewing minutes) సాధించి ఓటీటీ సూప‌ర్ హిట్‌గా నిలిచినట్లుగా తాజాగా జీ 5 ఓటీటీ వర్గాలు వెల్లడించాయి.

‘‘స్మార్ట్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా పులి మేక ఆడియెన్స్‌ను క‌ట్టి ప‌డేసింది. సిరీస్‌లో ఉండే ట్విస్టులు, ట‌ర్న్‌ల‌ను ప్రేక్ష‌కులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా లావ‌ణ్య త్రిపాఠి (Lavanya Tripathi), ఆది సాయికుమార్ (Aadi Saikumar) పాత్ర‌లు స‌హా ఎంటైర్ సిరీస్‌ను ఫ్యామిలీ అంతా క‌లిసి చూసి ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే గోప‌రాజు ర‌మ‌ణ, సిరి హన్మంత్‌, రాజా చెంబోలు, నోయెల్ సేన్ ఇలా ప్ర‌తీ పాత్ర‌ ఆడియెన్స్‌ను మెప్పించాయి. ఇందులో సోష‌ల్ మెసేజ్ మ‌రీ ముఖ్యంగా మ‌హిళ‌ల‌ను ఆక‌ట్టుకుంటోంది. పులి మేక ఒరిజిన‌ల్ ఇంత బాగా రావ‌టంలో షో ర‌న్న‌ర్‌గా, రైట‌ర్‌గా కోన వెంక‌ట్ (Kona Venkat) త‌న‌దైన పాత్ర‌ను అద్భుతంగా పోషించారు. వ్యూయింగ్ నెంబ‌ర్స్ ద్వారా ప్రేక్ష‌కులు ఆయ‌న‌కు ప్ర‌శంస‌లను అందించారు..’’ అని జీ 5 యూనిట్ తెలియజేసింది. ఈ ఒరిజినల్‌ను ఆదరించిన తమ సబ్‌స్క్రైబర్స్‌కు వారు ధన్యవాదాలు తెలిపారు.

Also Read: Puli Meka web series Review: ఆసక్తికరంగా వున్న పులి మేక ఆట


కాగా.. టాప్ మోస్ట్ డిజిట‌ల్ కంటెంట్ ప్రొవైడ‌ర్‌గా ఇండియాలోనే త‌న‌దైన స్థానాన్ని, గుర్తింపును ద‌క్కించుకుంది జీ 5. తెలుగులో మాత్ర‌మే కాదు.. త‌మిళ్‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ, మ‌రాఠీ, గుజరాతీ, బెంగాలీ స‌హా ఇత‌ర భాష‌ల్లో వైవిధ్య‌మైన కంటెంట్‌ను ప్రేక్ష‌కుల‌కు అందిస్తూ అలరిస్తోంది. ‘పులి మేక’ క్రైమ్ థ్రిల్ల‌ర్ ఫిబ్ర‌వ‌రి 23 నుంచి జీ 5లో స్ట్రీమింగ్ అవుతోంది. (Puli Meka Web Series)

ఇవి కూడా చదవండి:

*********************************

*Nagababu: ‘ఆర్ఆర్ఆర్’ మీద కామెంట్‌కు వైసీపీ వారి భాషలో సమాధానం

*Jr NTR: ‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్ సైడ్ యాక్టరా? ఇలా అవమానించారేంటి?

*Lakshmi Manchu: రక్తం మరిగిపోతోంది.. మంచు లక్ష్మికి కోపం తెప్పించిన వైరల్ వీడియో..

*Star Producer: పాపం.. దీన స్థితిలో స్టార్ నిర్మాత.. ఆదుకున్న స్టార్ హీరో

*NBK: ఏదైనా బాలయ్య దిగనంత వరకే.. వన్స్ హి స్టెప్ ఇన్..

*Poonam Kaur: మళ్లీ చెబుతున్నా అర్థం చేసుకోండి.. వేదికపైనే కంటతడి పెట్టిన పూనమ్ కౌర్..

*Manchu Manoj: ఏ జన్మ పుణ్యమో నాది.. పెళ్లి తర్వాత మంచు మనోజ్ ఎవరి గురించి ఈ మాటన్నాడంటే..

Updated Date - 2023-03-09T22:29:47+05:30 IST