సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

OTT Release: తాజాగా ఓటీటీలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాలు ఇవే..

ABN, First Publish Date - 2023-03-09T08:20:03+05:30

కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టాక ఓటీటీల్లో విడుదల తగ్గి థియేటర్‌ రిలీజ్‌లు పెరుగుతాయని ప్రేక్షకులు భావించారు.

ott
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టాక ఓటీటీల్లో విడుదల తగ్గి థియేటర్‌ రిలీజ్‌లు పెరుగుతాయని ప్రేక్షకులు భావించారు. కానీ అనూహ్యంగా అటు థియేటర్‌, ఇటు ఓటీటీ.. దేనికదే స్పెషల్‌ కంటెంట్‌తో ముందుకు వస్తూ సత్తా చాటుతున్నాయి. థియేటర్‌లో రిలీజైన సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. కాగా.. మార్చి 8న ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్ సిరీస్‌ల గురించి తెలుసుకుందాం..

ఫారవే (Faraway)

ఆడ్రీ ఓ యువ అమెరికన్ మహిళ. ఫిలిప్పీన్స్‌కు ఒక మర్మమైన మిషన్ పై వెళుతుంది. అప్పుడు ఆమె దగ్గర చాలా తక్కువ డబ్బు ఉంటుంది. అలాగే ఆ మిషన్ లో విజయానికి అవకాశం లేదు. అయితే అక్కడి వారైనా తన స్నేహితులు హాజెల్, రే కలవడం వల్ల అందులో గెలిచే అవకాశాలు పెరుగుతాయి. దాని కోసం వారు 300 మైల్స్ ప్రయాణించాల్సి వస్తుంది. అడవి, సముద్రం, రాళ్లు రప్పలు, మోటార్ సైకిల్ ముఠా వంటి పలు ప్రమాదాల నుంచి తప్పించుకోవాలి ఉంటుంది. ఆ సమస్యలను ఎదుర్కొంటూ లక్ష్యాన్ని ఎలా చేరారు అనేదే ఈ 'ఫారవే' కథాంశం. ఈ జర్మన్ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఇందుబాలా భాటర్ హోటల్ (Indubala Bhaater Hotel)

ఇందూబాలా అనే మహిళ కథ ఈ వెబ్ సీరిస్. ఇండియాలోని ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుని ఆమె బంగ్లాదేశ్‌లోని ఒక గ్రామం నుంచి కోల్‌కతాకు వస్తుంది. ఆమె ఇమ్మిగ్రేషన్ కారణంగా తన మూలాలను వదిలివేయాల్సి వస్తుంది. అప్పటి నుంచి కొల్‌కతాలోనే ఉండిపోతుంది. అయినప్పటికీ ఆమె మనసు మాత్రం సొంత గ్రామమైన దేషేర్ బరిలోనే ఉండిపోతుంది.

నెట్ ఫ్లిక్స్ (Netflix)

MH370: The Plane That Disappeared - ఇంగ్లిష్

అమెజాన్ ప్రైమ్ (Amazon prime)

College Detectives - హిందీ

ఇవి కూడా చదవండి:

Anicka: హీరోయిన్‌ని ముఖం వాచిపోయేలా కొట్టిన మాజీ ప్రియుడు.. అసలు విషయం ఏమిటంటే?

Video Viral: ‘కేజీఎఫ్’ కాంట్రవర్సీ.. సారీ కాని సారీ చెప్పిన వెంకటేశ్ మహా

Kushboo Sundar : కన్నతండ్రే నన్ను లైంగికంగా వేధించాడు.. షాకింగ్ విషయాలు వెల్లడించిన నటి

Manchu Manoj Weds Mounika reddy: ముహూర్తం ఫిక్స్.. అతి కొద్దిమంది సమక్షంలో..

Allu Arjun: అల్లు అర్జున్ నెక్ట్స్ మూవీపై అధికారిక ప్రకటన.. డైరెక్టర్ ఎవరో తెలుసా?

Pawan Kalyan: కన్నడ స్టార్ హీరోలకు పవన్ క్షమాపణలు.. కారణం ఏంటంటే..

Rashmi Gautam: ‘ఇది దారుణం.. వాడి లవర్ వాడి ఇష్టమంట’.. నాగశౌర్యకి సపోర్టుగా రష్మి పోస్టు


Updated Date - 2023-03-09T08:21:05+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!