Dochevaarevarura: ఓటీటీ విడుదలకు సిద్ధమైన కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్.. ఎప్పుడు, ఎక్కడంటే?

ABN , First Publish Date - 2023-09-27T22:32:41+05:30 IST

వినోదాత్మక చిత్రాల దర్శకుడిగా దర్శకుడు శివ నాగేశ్వరరావు ఓ ఇమేజ్ ఉంది. ఆయన తెరకెక్కించిన పలు చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. తాజాగా ఆయన దర్శకత్వంలో ‘దోచేవారెవరురా’ అనే టైటిల్‌తో అనే మూవీ రూపుదిద్దుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. సెప్టెంబర్ 29 నుండి ఆహా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది.

Dochevaarevarura: ఓటీటీ విడుదలకు సిద్ధమైన కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్.. ఎప్పుడు, ఎక్కడంటే?
Dochevaarevarura Movie Poster

వినోదాత్మక చిత్రాల దర్శకుడిగా దర్శకుడు శివ నాగేశ్వరరావు (Siva Nageswara Rao) ఓ ఇమేజ్ ఉంది. ఆయన తెరకెక్కించిన పలు చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. తాజాగా ఆయన దర్శకత్వంలో ‘దోచేవారెవరురా’ (Dochevaarevarura) అనే టైటిల్‌తో అనే మూవీ రూపుదిద్దుకున్న విషయం తెలిసిందే. ఇటీవల థియేటర్స్‌లో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 29 నుండి ఆహా ఓటీటీ (Aha OTT)లో స్ట్రీమింగ్ కానుందని మేకర్స్, సదరు ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించారు.

గీత రచయిత చైతన్య ప్రసాద్ తనయుడు ప్రణవ చంద్ర (Pranava Chandra) ఈ మూవీతో హీరోగా పరిచయం కాగా.. మలయాళీ బొద్దుగుమ్మ మాళవిక సతీశన్ హీరోయిన్‌గా నటించింది. ‘రంగస్థలం’, ‘పుష్ప’ వంటి చిత్రాలలో తన నట విశ్వరూపం చూపించిన అజయ్ ఘోష్ (Ajay Ghosh) ఇందులో అన్నదమ్ములుగా ద్విపాత్రాభినయం చేశాడు. మూగవాడి సైగలను అర్థం చేసుకోమని ప్రేక్షకులకు పరీక్ష పెట్టకుండా అతని భావాన్ని సబ్ టైటిల్స్‌ వేశారు. అలానే బిత్తిరి సత్తి కిరాయి హంతకుడి పాత్ర పోషించాడు. ఆ పాత్ర ద్వారా వినోదాన్ని అందించాడు దర్శకుడు. అజయ్ ఘోష్, బిత్తిరి సత్తి… ఈ ఇద్దరి మీద చెరొకపాట పెట్టడం విశేషం. యూ ట్యూబర్ ప్రణవి సాధనాల అజయ్ ఘోష్ భార్యగా నటించింది. ఇతర పాత్రలను ‘జెమిని’ సురేశ్, కోట, భరణి, టార్జాన్, బెనర్జీ తదితరులు పోషించారు.


Dochevarevaruraa.jpg

‘దోచేవారెవరురా’ కథ విషయానికి వస్తే.. ప్రతి మనిషి వేరొక మనిషి చేతిలో ఏదో ఒక రకంగా దోపిడీకి గురవుతూనే ఉంటాడు. కొందరు డబ్బుల్ని దోచుకుంటే.. మరికొందరు మాన ప్రాణాలను దోచుకుంటారు. ఇంకొందరు మనసుల్ని దోచుకుంటారు. రాజకీయ నాయకులైతే సమాజాన్నే దోచుకుంటారు. ఇలా రకరకాలుగా దోచుకునే పాత్రలతో దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఓ అనాధ పిల్లాడికి మేలైన వైద్యం చేయించడం కోసం హీరో దొంగగా మారి డబ్బులు దోచుకుంటాడు. అదే వ్యక్తి హీరోయిన్‌కు సాయం చేసి ఆమె మనసు దోచుకోవాలని చూస్తాడు. అలానే తమ్ముడు ప్రేమించిన అమ్మాయిపై మోజు పడి ఓ అన్న ఆమె శీలాన్ని దోచుకుంటాడు. తనను మోసం చేసి పెళ్ళాడిన వాడి ఆస్తిని అతని భార్య దోచుకుంటుంది. ఓ కిరాయి హంతకుడు డబ్బుల కోసం ఇతరుల ప్రాణాలను దోచుకుంటాడు. ఇలాంటి చిత్ర విచిత్రమైన పాత్రలతో సాగే కథే ‘దోచేవారెవరురా’. (Dochevaarevarura OTT Release Details)


ఇవి కూడా చదవండి:

============================

*Agent: ‘ఏజెంట్’ని వదలని కష్టాలు.. ఓటీటీ‌లో విడుదల డౌటే.. ఎందుకంటే?

***************************************

*Pawan Kalyan: జనసేనకు స్టంట్ మేన్ బద్రి విరాళం

*************************************

*Bhagavanth Kesari: బాలయ్య ‘భగవంత్ కేసరి’ నుంచి స్పెషల్ సర్‌ప్రైజ్.. ఎప్పుడంటే?

**********************************

*Vishal: అదోరకం సనాతన ధర్మం.. విశాల్‌ వ్యాఖ్యలకు నిర్మాత కౌంటర్‌

**********************************

*Tiger Nageswara Rao: టైగర్ కా హుకుమ్.. ట్రైలర్ రిలీజ్‌కు డేట్ ఫిక్సయింది

***********************************

Updated Date - 2023-09-27T22:32:41+05:30 IST