Mahi V Raghav: ‘సైతాన్’ వెబ్ సిరీస్‌పై మరోసారి హెచ్చరిక చేసిన దర్శకుడు

ABN , First Publish Date - 2023-06-14T20:15:10+05:30 IST

‘యాత్ర’ దర్శకుడు మహి వి రాఘవ్ రూపొందించిన ‘సైతాన్’ వెబ్ సిరీస్‌కు స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతున్న సందర్భంగా.. దర్శకుడు మరోసారి ప్రేక్షకులను జాగ్రత్తలు తీసుకోమని తెలుపుతూ హెచ్చరిక జారీ చేశారు. బుధవారం మీడియాకు మొదటి ఎపిసోడ్‌ని ప్రదర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. లోకంలో జరుగుతున్న క్రైమ్‌ని.. అంతే స్థాయిలో ఇందులో చూపించినట్లుగా చెప్పుకొచ్చారు.

Mahi V Raghav: ‘సైతాన్’ వెబ్ సిరీస్‌పై మరోసారి హెచ్చరిక చేసిన దర్శకుడు
Director Mahi V Raghav

ఈ మధ్య కాలంలో వచ్చిన ‘రానా నాయుడు’ (Rana Naidu) వెబ్ సిరీస్ తర్వాత.. అంతే స్థాయిలో, కాదు కాదు.. అంతకంటే ఎక్కువగానే హాట్ టాపిక్ అయిన వెబ్ సిరీస్ ‘సైతాన్’ (Shaitan). ‘యాత్ర’ (Yatra) దర్శకుడు మహి వి రాఘవ్ (Mahi V Raghav) రూపొందించిన ఈ వెబ్ సిరీస్.. ట్రైలర్ విడుదల తర్వాత మరింతగా హాట్ టాపిక్ అయింది. అందుకు కారణం ఆ ట్రైలర్‌లో ఉన్న కంటెంటే. ట్రైలర్‌లో చూపిన ఒళ్ళు గగుర్పొడిచే క్రైమ్ అంశాలు, బూతు డైలాగ్స్.. ఓ వర్గపు ఆడియన్స్‌ని ఆకట్టుకోవడంతో.. మిలియన్ల కొద్దీ వ్యూస్ ఆ ట్రైలర్ సొంతం చేసుకుంటోంది. అయితే ట్రైలర్‌లో ఉన్న కొన్ని ఘాటైన అభ్యంతకర పదాలు, డైలాగ్స్‌పై కూడా అంతే స్థాయిలో విమర్శలు, చర్చలు నడుస్తున్నాయి. ఈ నేపధ్యంలో తాజాగా ‘సైతాన్’ వెబ్ సిరీస్‌ (Shaitan Web Series)లోని ఒక ఎపిసోడ్‌తో పాటు షో రీల్‌ను మేకర్స్ మీడియాకు ప్రదర్శించారు.

ఈ ప్రదర్శన అనంతరం దర్శకుడు మహి వి రాఘవ్ (Director Mahi V Raghav) మీడియాతో ముచ్చటిస్తూ.. మరోసారి ప్రేక్షకులకు హెచ్చరిక జారీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఈ సిరీస్ వీక్షించిన మీడియా వారు సిరీస్ కంటెంట్‌ను అలాగే టేకింగ్‌ను మెచ్చుకోవడం సంతోషంగా అనిపించింది. సమాజంలో జరిగే కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సిరీస్‌లోని పాత్రలను రూపొందించడం జరిగింది. ఆర్టిస్ట్‌లు రిషి, సెల్లి, జాఫర్, దేవయాని అలాగే ఇతర నటీనటులు అందరూ చాలా బాగా చేశారు. (Mahi V Raghav about Shaitan)

Mahi.jpg

ఒక తెలుగు వెబ్ సిరీస్‌లో క్రైమ్ సన్నివేశాలని ఈ తరహాలో భయకంరంగా చూపించడం ఇదే తొలిసారి. వెన్నులో వణుకుపుట్టించే విధంగా ఆ సీన్స్ ఉంటాయి. నేను కొత్తగా ఇందులో చూపించింది ఏమీ లేదు.. ప్రస్తుతం బయట ప్రపంచంలో క్రైమ్ ఏ విధంగా పెరిగిందో, జరుగుతుందో.. అదే ఇందులో చూపించాను. ఈ వెబ్ సిరీస్‌లో ఉండే వయలెన్స్.. బోల్డ్ కంటెంట్ చాలా డిస్టర్బ్ చేసే విధంగా ఉంటాయి. కానీ.. తప్పలేదు. అందుకే ముందుగానే ఈ వెబ్ సిరీస్ చూసే ముందు అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోమని చెబుతున్నాను. ఇంతకు ముందు కూడా చెప్పాను.. ఇప్పుడు మరోసారి తెలియజేస్తున్నాను. జూన్ 15 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌ (Disney Plus Hotstar)లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతోంది..’’ అని తెలిపారు.

ఇవి కూడా చదవండి:

**************************************

*Shah Rukh Khan: ఎంత అభిమాని అయితే మాత్రం.. పబ్లిగ్గా అలా ముద్దు పెట్టేసిందేంటి?


*****************************************

*Sreeleela: బర్త్‌డే బ్యూటీ.. శ్రీలీల గురించి ఈ విషయాలు తెలుసా..?


**************************************

*Prabhas Srinu: తల్లి సమానురాలితో ఎఫైరా?.. రూమర్స్‌పై ప్రభాస్ శ్రీను క్లారిటీ!

**************************************

*Varun Tej: ఎంగేజ్‌మెంట్ తర్వాత లావణ్యతో కలిసి.. వరుణ్ తేజ్ చేసిన పోస్ట్ వైరల్

**************************************

*Kaliveerudu: ‘కాంతార’ తరహాలో మరో కన్నడ చిత్రం.. తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారా?

**************************************

*Adipurush: ఆదిపురుష్‌ టీమ్‌కు కేసీఆర్ సర్కార్ తియ్యటి శుభవార్త.. ఈ విషయం సినీ ప్రేక్షకులు, ఫ్యాన్స్‌కు తెలిస్తే..!

**************************************

Updated Date - 2023-06-14T20:16:10+05:30 IST