Shah Rukh Khan: ఎంత అభిమాని అయితే మాత్రం.. పబ్లిగ్గా అలా ముద్దు పెట్టేసిందేంటి?

ABN , First Publish Date - 2023-06-14T19:25:21+05:30 IST

‘పఠాన్’ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్.. తన తదుపరి సినిమా ‘జవాన్’ ప్రొమోషన్స్‌లో యమా యాక్టివ్‌గా కనిపిస్తున్నారు. తాజాగా ఆయన ఓ పబ్లిక్ ఫంక్షన్‌కు అటెంట్ కాగా.. అక్కడొక లేడీ ఫ్యాన్ ఆయన అనుమతి లేకుండా బుగ్గపై గాఢంగా ముద్దు ఇచ్చేసింది. ఈ పరిణామానికి షారుఖ్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. లేడీ ఫ్యాన్ మాత్రం ముద్దు పెట్టేసి కామ్‌గా వెళ్లిపోయింది.

Shah Rukh Khan: ఎంత అభిమాని అయితే మాత్రం.. పబ్లిగ్గా అలా ముద్దు పెట్టేసిందేంటి?
Shah Rukh Khan

సరైన సినిమా లేక రోజురోజుకు పడిపోతున్న బాలీవుడ్ ప్రతిష్టను మళ్లీ నిలబెట్టింది మాత్రం బాలీవుడ్ బాద్‌షా (Bollywood Baadshah) షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) నటించిన ‘పఠాన్’ చిత్రమే. టాక్‌తో సంబంధం లేకుండా విడుదలైన అన్ని చోట్లా ‘పఠాన్’ (Pathaan) కనకవర్షం కురిపించింది. ఈ సినిమా ఇచ్చిన విజయానందంలో ఇప్పుడు షారూఖ్ తన తదుపరి చిత్రం విషయంలో యమా యాక్టివ్‌గా కనిపిస్తున్నారు. ముఖ్యంగా ఫ్యాన్స్‌కి బాగా దగ్గరయ్యారు. సోషల్ మీడియాలో తరుచూ ఫ్యాన్స్‌తో చిట్ చాట్ చేస్తూ.. ఎన్నో విషయాలను షేర్ చేసుకుంటున్నారు. అలాగే ‘పఠాన్’ సినిమాకి ముందు పబ్లిక్ ఈవెంట్స్‌లో అస్సలు కనిపించని షారుఖ్.. ఆ తర్వాత మాత్రం విరివిగా దర్శనమిస్తున్నారు. ఇప్పుడు ‘జవాన్’ (Jawan) సినిమా సెట్స్‌పై ఉండగానే.. ఆ సినిమాపై బీభత్సమైన హైప్ క్రియేట్ అయ్యేలా.. షారుఖ్ ఆ సినిమాని ప్రేక్షకులలోకి తీసుకెళుతున్నారు.

ఈ క్రమంలో ఆయన తాజాగా ఓ పబ్లిక్ ఫంక్షన్‌కు అటెండ్ కాగా.. అక్కడ ఓ మహిళ చేసిన పనికి ఆయన బిత్తరపోయారు. ఆఫ్‌కోర్స్.. ఆయనకి ఇలాంటివి కొత్తేం కాదు కానీ.. పబ్లిక్ ఫంక్షన్‌లో ఓ లేడీ ఫ్యాన్ (Lady Fan).. మిమ్మల్ని ముద్దు పెట్టుకోనా? అని అడగడం.. ఆయన అంగీకారం తెలపక ముందే.. బిగించి పట్టుకుని ముద్దు పెట్టడంతో.. షారుఖ్ కూడా షాక్‌కి గురయ్యారు. అంతమంది ముందు.. వేరే వాళ్లతో ఫొటోలు దిగుతుండగా.. సడెన్‌గా ఆ మహిళ బలవంతంగా ముద్దు ఇవ్వడంతో.. షారుఖ్ కాస్త ఇబ్బంది పడినట్లుగా తెలుస్తోంది. ఈ ముద్దుకి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవడమే కాకుండా.. నెటిజన్లు కూడా రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. (Lady Fan Kissed Shah Rukh Khan)

ఈ వీడియో చూస్తుంటే.. ఆమెతో పాటు చాలా మంది మహిళలు అక్కడ ఉన్నారు. వారంతా కేవలం హగ్ ఇచ్చి పక్కకు తప్పుకుంటే.. ఈ మహిళ మాత్రం అస్సలు కంట్రోల్ చేసుకోలేకపోయింది. షారుఖ్ ఏం అనుకుంటాడో అని కూడా ఆలోచించకుండా.. తనపాటికి తను ముద్దు పెట్టేసి కామ్‌గా అక్కడి నుంచి జారుకుంది. దీంతో.. అభిమానించే హీరో కనబడితే చాలు.. అన్నీ మరిచిపోయి చిన్నపిల్లల మాదిరిగా ప్రవర్తించడం ఏం బాగాలేదని కొందరు.. అభిమాన హీరోని ముద్దుపెట్టుకున్న ఆమె ఆనందం వర్ణించలేనిదంటూ మరికొందరు.. ఇలా ఈ వీడియోకి కామెంట్స్ చేస్తున్నారు. షారుఖ్ ‘జవాన్’ (Jawan) విషయానికి వస్తే.. తమిళ దర్శకుడు అట్లీ (Atlee) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటోంది. సెప్టెంబ‌ర్ 7న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమా కాకుండా మరో రెండు సినిమాలలో షారుఖ్ నటిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

**************************************

*Sreeleela: బర్త్‌డే బ్యూటీ.. శ్రీలీల గురించి ఈ విషయాలు తెలుసా..?


**************************************

*Prabhas Srinu: తల్లి సమానురాలితో ఎఫైరా?.. రూమర్స్‌పై ప్రభాస్ శ్రీను క్లారిటీ!

**************************************

*Varun Tej: ఎంగేజ్‌మెంట్ తర్వాత లావణ్యతో కలిసి.. వరుణ్ తేజ్ చేసిన పోస్ట్ వైరల్

**************************************

*Kaliveerudu: ‘కాంతార’ తరహాలో మరో కన్నడ చిత్రం.. తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారా?

**************************************

*Adipurush: ఆదిపురుష్‌ టీమ్‌కు కేసీఆర్ సర్కార్ తియ్యటి శుభవార్త.. ఈ విషయం సినీ ప్రేక్షకులు, ఫ్యాన్స్‌కు తెలిస్తే..!

**************************************

*Sai Dharam Tej: కంటతడి పెట్టిన సాయిధరమ్ తేజ్.. కారణమదే..

**************************************

Updated Date - 2023-06-14T19:25:21+05:30 IST