సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Pic Talk: చందురుని మించు అందమొలికించు...

ABN, First Publish Date - 2023-05-07T11:01:04+05:30

ఈ చిత్రాన్ని మొదట అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswara Rao), సావిత్రి (Savitri)లతో తీయాలనుకున్నారు. కానీ అక్కినేని.. సావిత్రికి అన్న (Brother)గా వేయడానికి..

NTR And Savitri
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజ్యలక్ష్మీ ప్రొడక్షన్స్‌ (Rajalakshmi Productions) వారి ‘రక్త సంబంధం’ (1-11-1962) చిత్రం (Rakta Sambandham Movie) లోనిదీ స్టిల్‌. తమిళంలో ఘన విజయం సాధించిన ‘పాశమలర్‌’ (Pasamalar) చిత్రానికి తెలుగు వెర్షన్‌. ఈ చిత్రాన్ని మొదట అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswara Rao), సావిత్రి (Savitri)లతో తీయాలనుకున్నారు. కానీ అక్కినేని.. సావిత్రికి అన్న (Brother)గా వేయడానికి ఒప్పుకోకపోవడంతో, ఎన్‌.టి.ఆర్‌. (NT Rama Rao) ఆ పాత్ర పోషించారు.

ఎన్‌.టి.రామారావు, సావిత్రి అన్నాచెల్లెళ్ల (Brother and Sisters) పాత్రల నుండి విడదీయరానంతగా ఆ పాత్రల్లో లీనమై నటించారు. తోబుట్టువు సుఖం కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేసిన అన్నయ్యగా ఎన్‌.టి.రామారావు (NTR) ప్రేక్షకుల్ని ఏడిపించేశారు. ప్రతి మహిళ ఈ చిత్రంలోని అన్నలాంటి అన్న తనకూ ఉంటే బావుండునని అనుకున్న చిత్రమిది.

‘బంగారు బొమ్మ రావేమే’ పాట లేని పెళ్లిపందిరి, ‘చందురుని మించు అందమొలికించు’ అన్న జోలపాట పాడని తల్లి ఆనాడు లేరంటే అతిశయోక్తి కాదు. ఈ చిత్రంలోని పతాక సన్నివేశాలు ఎన్‌.టి.ఆర్‌, సావిత్రిల నటనకు గొప్ప ఉదాహరణలుగా నిలిచాయి.

10-10-1988న జంటనగరాల్లో మరోసారి విడుదలై రిపీట్‌ రన్‌లో కూడా వందరోజుల ఆడి విజయపతాకం ఎగురవేసిందీ చిత్రం. 5-2-1989న హైదరాబాద్‌ చిక్కడపల్లి ఫంక్షన్‌ ప్యాలెస్‌లో ద్వితీయ శతదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కాగా వి. మధుసూదన రావు (V. Madhusudhana Rao) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ఘంటసాల (Ghantasala) సంగీతం అందించారు.

- డా. కంపల్లె రవిచంద్రన్‌ (98487 20478)

ఇవి కూడా చదవండి:

************************************************

*Dimple Hayathi: కొంటె పనులు చాలా చేశాను

*Megastar VS Superstar: చిరంజీవికి పోటీగా రజనీకాంత్.. ఆగస్ట్‌లో అసలు మజా!

*Ramabanam Film Review: అన్నదమ్ముల కథన్నారు, కానీ తీరా చూసాక...

*Bhumika Chawla: హీరోల వయసుపై భూమిక కామెంట్స్.. ఏం మారలేదు

*Takkar: చాలా రోజుల తర్వాత.. ఓన్లీ హీరోయిన్‌పైనే సాంగ్

*The Kerala Story: అది కాదు.. ఇది కదా అసలు స్టోరీ.. ఏఆర్ రెహమాన్ కూడా దండం పెట్టేశారు

Updated Date - 2023-05-07T11:01:04+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!