Pic Talk: భగవంతుడూ భక్తుడూ ఆయనే!

ABN , First Publish Date - 2023-04-16T13:35:26+05:30 IST

ఆ రోజుల్లో ఈ సినిమా వాల్‌పోస్టరు క్యాలెండర్‌గా బహుళ ప్రచారం పొందింది. నేటికీ ఎన్‌.టి.రామారావు గురించి రాసే పుస్తకాలలో గానీ, ఫొటో ప్రదర్శనలలో గానీ

Pic Talk: భగవంతుడూ భక్తుడూ ఆయనే!
NT Ramarao in Sri Satyanarayana Mahathyam

అశ్వరాజా పిక్చర్స్‌ (Aswaraja Pictures) వారి ‘శ్రీ సత్యనారాయణ మహాత్మ్యం’ (Sri Satyanarayana Mahathyam) (27-06-1964) చిత్రంలోనిది ఈ స్టిల్‌. మహిమగల శ్రీసత్యనారాయణస్వామి అవతార విశేషాలను సంకలనం చేస్తూ తెరకెక్కిన చిత్రమిది. ఈ చిత్రంలో ఎన్‌.టి.రామారావు (N. T. Rama Rao) భగవంతుడిగా, భక్తుడిగా వైవిధ్యభరితమైన నటనను ప్రదర్శించారు. శ్రీమన్నారాయణుడిగా ఎన్‌.టి.ఆర్‌. (NTR) చాలా అందంగా కన్పిస్తారు. ఆ రోజుల్లో ఈ సినిమా వాల్‌పోస్టరు క్యాలెండర్‌గా బహుళ ప్రచారం పొందింది. నేటికీ ఎన్‌.టి.రామారావు గురించి రాసే పుస్తకాలలో గానీ, ఫొటో ప్రదర్శనలలో గానీ ఈ చిత్రం బొమ్మ లేకుండా ఉండదు.

NTR-100.jpg

భక్తుడైన సత్యదాసు (Satyadasu) పాత్ర గతంలో ఎన్‌.టి.ఆర్‌. వేసిన పుండరీకుని తలపిస్తుంది. సాత్త్వికమైన నటనతో ఆద్యంతం ఎంతో నిగ్రహంగా నటించారు. ప్రేక్షకుల్ని మెప్పించారు. భక్తుడిగా ఆవేదన, భగవంతుడిగా వాత్సల్యం రెండూ ఏక కాలంలో ప్రదర్శించి, ఆయా రసాలను పాత్రోచితంగా పలికించి పురాణ పాత్రలో తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు. ‘హే మాధవా! మధుసూదనా’, ‘జాబిల్లి శోభనీవే’ పాటలలో ఎన్‌.టి.ఆర్‌. అభినయం స్మరణీయం. భక్తుడుగా నటించిన ఎన్టీఆర్ సరసన రత్నవల్లి పాత్రలో కృష్ణకుమారి (Krishna Kumari) నటించారు. (NT Ramarao in Sri Satyanarayana Mahathyam)

NTR.jpg

- డా. కంపల్లె రవిచంద్రన్‌

98487 20478.

ఇవి కూడా చదవండి:

*********************************

*Shaakuntalam: ఇక అల్లు అర్జున్ ఫ్యాన్సే.. ఈ ప్రోమో అర్థం అదేనా?

*Vetrimaaran: ‘విడుదల’కు పాజిటివ్ టాక్.. ఛాన్స్ ఇచ్చే టాలీవుడ్ హీరో ఎవరు?

*Tammreddy Bharadwaja: మీ ఫ్యామిలీస్‌‌ని తిట్టినప్పుడు.. ఏమైంది మీ మగతనం? ఇండస్ట్రీ హీరోలకి సూటి ప్రశ్న?

*Actress Prema: రెండో పెళ్లి విషయమై ఫుల్ క్లారిటీ ఇచ్చిన ప్రేమ..!

*Radhika Apte: నన్ను ఆ సర్జరీ చేయించుకోమన్నారు.. ఇప్పుడలా అంటేనా?

Updated Date - 2023-04-16T13:35:27+05:30 IST