Chandramohan: మీరు హీరోయిన్లకు లక్కీ హీరో.. మరి మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరంటే?

ABN , First Publish Date - 2023-11-11T22:44:04+05:30 IST

‘చంద్రమోహన్‌ పక్కన నటిస్తే టాప్‌ హీరోయిన్‌ పొజిషన్‌ గ్యారంటీ’ అనే టాక్ ఇండస్ట్రీలో ఉండేది. పలువురు ఓల్డ్ హీరోయిన్లు కూడా ఈ విషయం పబ్లిగ్గా చెప్పారు. మరి ఇంతమంది హీరోయిన్లకి మీరు లక్కీ హీరో కదా.. అందులో మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరని చంద్రమోహన్‌ని ఓ సందర్భంలో అడిగినప్పుడు ఏమని సమాధానం ఇచ్చారంటే..

Chandramohan: మీరు హీరోయిన్లకు లక్కీ హీరో.. మరి మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరంటే?
Chandramohan

‘చంద్రమోహన్‌ (Chandramohan) పక్కన నటిస్తే టాప్‌ హీరోయిన్‌ పొజిషన్‌ గ్యారంటీ’ అనే టాక్ ఇండస్ట్రీలో ఉండేది. పలువురు ఓల్డ్ హీరోయిన్లు కూడా ఈ విషయం పబ్లిగ్గా చెప్పారు. మరి ఇంతమంది హీరోయిన్లకి మీరు లక్కీ హీరో కదా.. అందులో మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరని చంద్రమోహన్‌ని ఓ సందర్భంలో అడిగినప్పుడు ఏమని సమాధానం ఇచ్చారంటే..

‘‘యాదృచ్చికమే అయినా నా పక్కన నటించిన దాదాపు 60 మంది కథానాయికల్లో అత్యధికులు అగ్ర స్థానానికి చేరుకున్నారు. శ్రీదేవి, జయప్రద, జయసుధ, విజయనిర్మల, వాణిశ్రీ, మంజుల, చంద్రకళ, విజయశాంతి... ఇలా ఎంతమందికో నేను తొలి హీరోను (Frist Hero). అయితే అందులో నా ప్రతిభ ఏమీ లేదు. అది వారి అదృష్టం (Luck), ప్రతిభ (Talent). ‘చంద్రమోహన్‌ పక్కన నటిస్తే టాప్‌ హీరోయిన్‌ పొజిషన్‌ గ్యారంటీ’ అనే సెంటిమెంట్‌ వ్యాపించేలా చేశారు. (Chandramohan Heroines)


Jayasudha.jpg

ఇక నా పక్కన నటించిన హీరోయిన్లలో ఫేవరెట్‌ (Chandra Mohan Favourite Heroine) అంటే జయసుధ (Jayasudha) అనే చెప్పాలి. ఎందుకంటే మేమిద్దరం దాదాపు 34 చిత్రాల్లో జంటగా నటించాం. అలాగే లక్ష్మి, వాణిశ్రీ, రాధిక, మాధవి, జయప్రద, విజయశాంతి.... ఇలా చాలా మంది హీరోయిన్లతో నటించాను. ఒక్కో హీరోయిన్‌తో పది, పదిహేను చిత్రాలు కూడా చేశాను. అలాగే నా పక్కన బాల నటిగా నటించిన శ్రీదేవి (Sridevi).. ఆ తర్వాత హీరోయిన్‌గానూ చేసింది. ఆమె ఎప్పుడు కనిపించినా.. ‘మీ పక్కన మళ్లీ ఎప్పుడు హీరోయిన్‌గా చేస్తానో?’ అంటూ ఉండేది. నా పక్కన నటించిన వారంతా నన్ను ఎంతగానో అభిమానించేవారు.


ఇవి కూడా చదవండి:

========================

*Hansika: మ్యారేజ్ తర్వాత మరింత బిజీగా.. హన్సిక స్పందనిదే!

******************************

*Chandramohan: అడుగు ఎత్తు ఎక్కువుంటేనా.. ఏఎన్నార్‌ మాటలకు చంద్రమోహన్ ఏమనేవారంటే..

*********************************

*Shantala: ‘శాంతల’ను కొనియాడిన భారత మాజీ ఉపరాష్ట్రపతి

*******************************

*Producer: టాలీవుడ్‌లో మరో విషాదం.. ప్రముఖ నిర్మాత మృతి

******************************

*Game Changer: అనుకున్నదే అయ్యింది.. ‘జరగండి’ దీపావళికి రావడం లేదు

******************************

Updated Date - 2023-11-11T22:44:05+05:30 IST