Chandramohan: అడుగు ఎత్తు ఎక్కువుంటేనా.. ఏఎన్నార్‌ మాటలకు చంద్రమోహన్ ఏమనేవారంటే..

ABN , First Publish Date - 2023-11-11T20:49:54+05:30 IST

చంద్రమోహన్ తన పర్సనాలిటీ వల్ల చాలా ఇబ్బందులు పడ్డానని ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీలో ఎన్టీఆర్‌కి అభిమానిని అని చెప్పిన చంద్రమోహన్.. ఎన్టీఆర్‌తో కంటే ఏఎన్నార్‌తో ఎక్కువ సినిమాలు చేశానని చెప్పుకొచ్చారు.

Chandramohan: అడుగు ఎత్తు ఎక్కువుంటేనా.. ఏఎన్నార్‌ మాటలకు చంద్రమోహన్ ఏమనేవారంటే..
ANR And Chandra Mohan

చంద్రమోహన్ (Chandramohan) తన పర్సనాలిటీ వల్ల చాలా ఇబ్బందులు పడ్డానని ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీలో ఎన్టీఆర్‌ (NTR)కి అభిమానిని అని చెప్పిన చంద్రమోహన్.. ఎన్టీఆర్‌తో కంటే ఏఎన్నార్‌ (ANR)తో ఎక్కువ సినిమాలు చేశానని చెప్పుకొచ్చారు. ఇంకా ఆయన ఏం చెప్పారంటే..

‘‘నేను కాలేజీలో ఉండగానే రామారావుగారి అభిమానిని. ఆయనంత అందగాడు ఏ సినీ ఇండస్ట్రీలో ఉండడు అని నా అభిప్రాయం. ఆయన పోషించిన కృష్ణుడు, కర్ణుడు, దుర్యోధనుడు పాత్రలంటే నాకు చాలా ఇష్టం. ఈ జన్మలో అలాంటి వేషాలు నేను వేయలేను. అందుకే ఆ అభిమానం మరింత పెరిగిందేమో. అవకాశాలను బట్టి ఆయనతో కలసి కొన్ని సినిమాలు చేశాను. అయితే రామారావుగారితో కంటే నాగేశ్వరరావుగారితోనే ఎక్కువ చిత్రాలు పనిచేశాను. రామారావుగారి డిసిప్లిన్‌ అంటే నాకు చాలా గౌరవం. ఆయనలా ఉండాలని ప్రయత్నించాను కానీ నా వల్ల కాలేదు.


Chandramohan-Pic.jpg

పర్సనాలిటీ వల్ల ఇబ్బందులు...

అయితే అడుగు ఎత్తు ఎక్కువుంటే నన్ను దాటి వెళ్లిపోయేవాడివయ్యా అని ఏఎన్నార్‌ అంటూ ఉండేవారు. అలా మరో అడుగు ఎత్తు ఉండుంటే ఇన్ని సినిమాలు చేసేవాడినా అనేది సందేహమే. రామారావుగారిలా పౌరాణిక వేషాలు వేయాలి, పద్యాలు పాడాలని కోరిక నాకు ఉండేది. కానీ అప్పుడు నిజంగా పర్సనాలిటీ అడ్డం పడింది. నా పక్కన నటించిన హీరోయిన్స్‌తో కూడా హైట్‌ పరంగా కొన్ని సమస్యలు వచ్చాయి. ‘యశోదాకృష్ణ’ (Yashoda Krishna) చిత్రంలో నటించేటప్పుడు శ్రీదేవి (Sridevi) చాలా చిన్న పిల్ల. షూటింగ్‌ అయ్యాక మద్రాసు తిరిగి వస్తున్నప్పుడు ఒళ్లో పడుకుని నిద్ర పోయేది. ఆమె నా మొదట్లో నా పక్కన హీరోయిన్‌గా నటించింది కానీ నా కంటే పొడుగు పెరిగిపోయింది. ‘మీ పక్కన మళ్లీ ఎప్పుడు హీరోయిన్‌గా చేస్తాను?’ అనేది కానీ అది జరగలేదు. ఇలా కొన్ని సందర్భాల్లో పర్సనాలిటీ వల్ల ఇబ్బందులు పడ్డాను’’ అని చంద్రమోహన్ (Chandra Mohan) చెప్పుకొచ్చేవారు.


ఇవి కూడా చదవండి:

========================

*Shantala: ‘శాంతల’ను కొనియాడిన భారత మాజీ ఉపరాష్ట్రపతి

*******************************

*Producer: టాలీవుడ్‌లో మరో విషాదం.. ప్రముఖ నిర్మాత మృతి

******************************

*Game Changer: అనుకున్నదే అయ్యింది.. ‘జరగండి’ దీపావళికి రావడం లేదు

******************************

*Salman Khan: నాకు, కత్రినాకు ఈ దీపావళి ఎంతో ప్రత్యేకం.. ఎందుకంటే?

*******************************

Updated Date - 2023-11-11T20:49:56+05:30 IST