Producer: టాలీవుడ్‌లో మరో విషాదం.. ప్రముఖ నిర్మాత మృతి

ABN , First Publish Date - 2023-11-11T17:20:26+05:30 IST

చంద్రమోహన్ మరణ వార్త మరవక ముందే టాలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత యక్కలి రవీంద్ర బాబు (55), హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ.. శనివారం మధ్యాహ్నం మృతి చెందారు. శ్రావ్య ఫిలిమ్స్ వ్యవస్థాపక నిర్మాతగా మిత్రులతో కలిసి ‘సొంత ఊరు, గంగపుత్రులు’ వంటి అవార్డు చిత్రాలతో పాటు.. ‘ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, రొమాంటిక్ క్రిమినల్స్, గల్ఫ్, వలస’ వంటి చిత్రాలను ఆయన నిర్మించారు.

Producer: టాలీవుడ్‌లో మరో విషాదం.. ప్రముఖ నిర్మాత మృతి
Producer Ravindra Babu Yakkali

ఒక వైపు సీనియర్‌ నటుడు చంద్రమోహన్‌ (Chandramohan) మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతికి సంతాపం ప్రకటిస్తూ సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. చంద్రమోహన్‌ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నారు. అయితే చంద్రమోహన్ మరణ వార్తతో విషాదంలో ఉన్న ఇండస్ట్రీని మరో విషాద వార్త వెంటాడింది. ప్రముఖ నిర్మాత యక్కలి రవీంద్ర బాబు (55), హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ.. శనివారం మధ్యాహ్నం మృతి చెందారు. (#RavindraBabuYakkali)

నిర్మాత యక్కలి రవీంద్ర బాబు (Ravindra Babu Yakkali) శ్రావ్య ఫిలిమ్స్ వ్యవస్థాపక నిర్మాతగా మిత్రులతో కలిసి ‘సొంత ఊరు, గంగపుత్రులు’ వంటి అవార్డు చిత్రాలతో పాటు.. ‘ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, రొమాంటిక్ క్రిమినల్స్, గల్ఫ్, వలస’ వంటి చిత్రాలను నిర్మించి అభిరుచి గల నిర్మాతగా పేరు పొందారు. మార్కాపురంలో పుట్టి మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి.. ఛార్టర్డ్ ఇంజనీర్‌గా తన సేవలు అందిస్తూనే.. తనకి సినిమా పట్ల ఉన్న ఇష్టంతో నిర్మాతగా మారి దాదాపు 17 చిత్రాలను నిర్మించి పలు అవార్డులను పొందారు. (Ravindra Babu Yakkali No More)


Yakkali.jpg

తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళం భాషలలో కూడా నిర్మాత యక్కలి రవీంద్ర బాబు చిత్రాలను నిర్మించారు. ఆయనకు భార్య రమాదేవి.. ఒక కుమార్తె (ఆశ్రీత), కుమారుడు (సాయి ప్రభాస్) ఉన్నారు. నిర్మాతగానే కాకుండా గీత రచయితగా కూడా ఆయన తన ప్రతిభను చాటారు. ‘హనీ ట్రాప్, సంస్కార కాలనీ, మా నాన్న నక్సలైట్’ వంటి పలు చిత్రాలలో హృద్యమైన సాహిత్యం అందించిన సాహితి అభిలాషి అతను. యక్కలి రవీంద్ర బాబు మరణ వార్త తెలిసిన టాలీవుడ్.. ఆయనకు నివాళులు అర్పిస్తోంది. (Ravindra Babu Yakkali Passes Away)


ఇవి కూడా చదవండి:

========================

*Game Changer: అనుకున్నదే అయ్యింది.. ‘జరగండి’ దీపావళికి రావడం లేదు

******************************

*Salman Khan: నాకు, కత్రినాకు ఈ దీపావళి ఎంతో ప్రత్యేకం.. ఎందుకంటే?

*******************************

*Ala Ninnu Cheri: సినిమా చూసిన వారంతా చెబుతున్న మాట అదే..

********************************

*Niharika Konidela: ఫీచర్ ఫిల్మ్ కేటగిరిలోకి.. నిహారిక మరో స్టెప్

****************************************

Updated Date - 2023-11-11T17:28:13+05:30 IST