Game Changer: అనుకున్నదే అయ్యింది.. ‘జరగండి’ దీపావళికి రావడం లేదు

ABN , First Publish Date - 2023-11-11T16:17:18+05:30 IST

గ్లోబ‌ల్‌ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా సెన్సేషనల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ చేంజ‌ర్‌’. ఎన్నో సూప‌ర్ డూప‌ర్ బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాల‌ను రూపొందించిన నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ ఈ మూవీని నిర్మిస్తోంది. దీపావళికి ఈ సినిమా నుంచి ‘జరగండి’ సాంగ్‌ విడుదల కావాల్సి ఉండగా.. చివరి నిమిషంలో ఈ పాట విడుదలను వాయిదా వేసినట్లుగా మేకర్స్ ప్రకటించారు.

Game Changer: అనుకున్నదే అయ్యింది.. ‘జరగండి’ దీపావళికి రావడం లేదు
Ram Charan in Game Changer

గ్లోబ‌ల్‌ స్టార్ రామ్ చ‌ర‌ణ్ (Global Star Ram Charan) హీరోగా సెన్సేషనల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ (Shankar) ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ చేంజ‌ర్‌’ (Game Changer). ఎన్నో సూప‌ర్ డూప‌ర్ బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాల‌ను రూపొందించిన నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ క్రియేష‌న్స్ (SVC) బ్యాన‌ర్ ఈ మూవీని నిర్మిస్తోంది. భారీ బ‌డ్జెట్‌తో నిర్మాత‌లు దిల్ రాజు (Dil Raju), శిరీష్ (Sirish) అన్ కాంప్ర‌మైజ్డ్‌గా అంచ‌నాల‌కు ధీటుగా నిర్మిస్తున్నారు. RRR వంటి సెన్సేష‌న‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ చేస్తోన్న సినిమా కావ‌టంతో ఈ సినిమాపై ఓ రేంజ్‌లో అంచ‌నాలు నెల‌కొని ఉన్నాయి. ఈ సినిమా అప్‌డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతగా వేచి చూస్తున్నారో తెలియంది కాదు. అలాంటి వారందరినీ ఈ దీపావళి (Diwali)కి ఓ సాంగ్‌తో ఖుషి చేయాలని మేకర్స్ భావించారు. కానీ చివరి నిమిషంలో ఈ పాటను విడుదల చేయడం లేదంటూ మేకర్స్ అధికారికంగా ప్రకటించి మరోసారి ఫ్యాన్స్‌ని నిరాశపరిచారు.

విషయంలోకి వస్తే.. ఈ సినిమాకు సంబంధించి ఇంతకు ముందు ఓ పాట లీక్ అయింది. దీనిపై నిర్మాత దిల్ రాజు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సైబర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ లీకులో భాగమైన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. ఈ అరెస్ట్ తర్వాత కూడా దీపావళికి సాంగ్ విడుదల అని మేకర్స్ ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్ అంతా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. సోషల్ మీడియాలో ‘గేమ్ చేంజర్’ (#GameChanger), మ్యాన్ ‌ఆఫ్ మాసెస్ రామ్ చరణ్ (#ManOfMassesRamCharan) ట్యాగ్స్‌తో ట్రెండ్‌ని షేకాడిస్తున్నారు. అయితే.. ఎప్పుడెప్పుడు సాంగ్ వస్తుందా? అని ఎదురుచూస్తున్న అభిమానుల ఆశలపై ఒక్క లేఖతో ఒక్కసారిగా నీళ్లు చల్లేసింది చిత్రయూనిట్. ఈ పాట విడుదలను వాయిదా వేస్తున్నామంటూ.. చివరి నిమిషంలో మేకర్స్ తెలపడంతో ఫ్యాన్స్‌లో కోపం కట్టలు తెంచుకుంటోంది. వాస్తవానికి రెండు రోజుల క్రితం నుండే ఈ వాయిదాకు సంబంధించి వార్తలు వైరల్ అవుతున్నాయి. కానీ మేకర్స్ నుండి స్పష్టమైన ప్రకటన రాకపోవడంతో.. వాయిదా ఉండదనే అభిమానులు భావించారు. కానీ.. మేకర్స్ కూడా అధికారికంగా ప్రకటించడంతో.. అనుకున్నదే అయ్యింది అంటూ ఫ్యాన్స్ కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.


SVC.jpg

‘‘కొన్ని అనివార్యమైన ఆడియో డాక్యుమెంటేషన్ సమస్యల కారణంగా దీపావళికి విడుదల కావాల్సిన ‘గేమ్ చేంజర్’ సినిమాలోని ‘జరగండి’ (Jaragandi) పాట విడుదలను వాయిదా వేయడం జరిగింది. త్వరలోనే ఈ పాట విడుదలకు సంబంధించి అప్‌డేట్‌తో మీ ముందుకు వస్తాము. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) అభిమానులు, శంకర్ అభిమానులు ఈ పాట కోసం ఎంతగా వెయిట్ చేస్తున్నారో.. ఆ వెయిట్‌కి తగ్గ ఫలితం కచ్చితంగా ఉంటుందని తెలియజేస్తున్నాము. ‘గేమ్ చేంజర్’ విషయంలో ప్రతిదీ ది బెస్ట్ ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాము. అద్భుతమైన క్వాలిటీతో అందరినీ ఎంటర్‌టైన్ చేసేందుకు యూనిట్ అను నిత్యం కష్టపడుతోంది’’ అని నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ క్రియేష‌న్స్ (SVC) అధికారికంగా ఓ లేఖను విడుదల చేసింది.


ఇవి కూడా చదవండి:

========================

*Salman Khan: నాకు, కత్రినాకు ఈ దీపావళి ఎంతో ప్రత్యేకం.. ఎందుకంటే?

*******************************

*Ala Ninnu Cheri: సినిమా చూసిన వారంతా చెబుతున్న మాట అదే..

********************************

*Niharika Konidela: ఫీచర్ ఫిల్మ్ కేటగిరిలోకి.. నిహారిక మరో స్టెప్

****************************************

Updated Date - 2023-11-11T16:17:19+05:30 IST