Salman Khan: నాకు, కత్రినాకు ఈ దీపావళి ఎంతో ప్రత్యేకం.. ఎందుకంటే?

ABN , First Publish Date - 2023-11-10T22:03:58+05:30 IST

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా పలు చిత్రాల్లో నటించి, ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై మోస్ట్ సక్సెస్‌ఫుల్ జోడీగా పేరుని సంపాదించుకున్నారు. అయితే వీరిద్దరూ కలిసి నటించిన సినిమా ఏదీ కూడా దీపావళికి ఇప్పటి వరకు రిలీజ్ కాలేదు. తొలిసారి ఈ జోడీ నటించిన ‘టైగర్ 3’ దీపావళికి సందడి చేయనుంది. దీంతో ఈ సినిమా తమకెంతో ప్రత్యేకమని వారిద్దరూ చెప్పుకొచ్చారు.

Salman Khan: నాకు, కత్రినాకు ఈ దీపావళి ఎంతో ప్రత్యేకం.. ఎందుకంటే?
Salman Khan and Katrina Kaif

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan), కత్రినా కైఫ్ (Katrina Kaif) జంటగా పలు చిత్రాల్లో నటించి, ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై మోస్ట్ సక్సెస్‌ఫుల్ జోడీగా పేరుని సంపాదించుకున్నారు. అయితే వీరిద్దరూ కలిసి నటించిన సినిమా ఏదీ కూడా దీపావళి (Diwali)కి ఇప్పటి వరకు రిలీజ్ కాలేదు. తొలిసారి ఈ జోడీ నటించిన ‘టైగర్ 3’ (Tiger 3) దీపావళికి సందడి చేయనుంది. దీంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది.

దీపావళికి ఈ సినిమా విడుదల కాబోతోన్న నేపథ్యాన్ని పురస్కరించుకుని సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ.. దీపావళి పండుగకి సినిమా రిలీజ్ కావటం అనేది ఎంతో ప్రత్యేకమైనది. ఎందుకంటే ఆరోజుల్లో విడుదలయ్యే చిత్రాలను ప్రేక్షకుల ఆస్వాదించటానికి ఎక్కువగా ఇష్టపడతారు. అలా దీపావళి రోజున విడుదలైన నా చిత్రాలు తీపి గుర్తులుగా మిగిలిపోయాయి. అయితే నాకు, కత్రినాకు ఈ దీపావళి పండుగ మరెంతో ప్రత్యేకం. ఎందుకంటే ఇప్పటి వరకు మేం కలిసి నటించిన ఏ సినిమా కూడా దీపావళికి రిలీజ్ కాలేదు. తొలిసారి ‘టైగర్ 3’ రిలీజ్ కానుంది. కాబట్టి మేం ఎంతో ఆనందంతో, ఆసక్తికరంగానూ ఎదురు చూస్తున్నాం. దీపావళి అంటే వ్యక్తులే కాదు, కుటుంబాలు కూడా ఒక చోటికి చేరుతాయి. నాకు కావాల్సిన వారితో దీపావళి పండుగను సెలబ్రేట్ చేసుకోవటానికి నేను ఇష్టపడతాను. అలాగే నా కుటుంబ సభ్యులందరితో కలిసి ‘టైగర్ 3’ సినిమాను చూస్తాను. అందరూ ఈ సినిమాను బిగ్ స్క్రీన్‌పై చూసి అద్భుతమైన ఎక్స్‌పీరియెన్స్‌ని పొందుతారని భావిస్తున్నానని అన్నారు. (Salman Khan About Tiger 3 Release and Diwali)


Salman-Khan.jpg

ఇదే విషయంపై కత్రినా కైఫ్ (Katrina Kaif About Tiger 3 Release) మాట్లాడుతూ.. దీపావళి పండుగ అంటే అందరికీ ప్రత్యేకమైనది. అయితే ఈఏడాది నాకు మరింత ప్రత్యేకంగా మారింది. ఎందుకంటే నేను, సల్మాన్ ఖాన్ నటించిన ‘టైగర్ 3’ రిలీజ్ అవుతుంది. చెడుపై మంచి ఎలా విజయం సాధించిందనే విషయాన్ని ఇందులో చూపించాం. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అయిన దీపావళి రోజునే ‘టైగర్ 3’ రిలీజ్ కావటం ఆనందంగా ఉంది. నేను, సల్మాన్ ఖాన్ నటించిన సినిమాల్లో తొలిసారి దీపావళికి రిలీజ్ అవుతున్న సినిమా ఇది. కచ్చితంగా మేం ప్రేక్షకులను మెప్పిస్తాం. ప్రేక్షకులకు మరింత సంతోషాన్ని, ఎగ్జయిట్‌మెంట్‌ను అందిస్తాం. దీపావళి అంటే సెలబ్రేషన్స్ (Diwali Celebrations). ఆ సెలబ్రేషన్స్‌ని ఈ సినిమా డబుల్ చేస్తుందని ఆశిస్తున్నానని తెలిపింది. కాగా, యష్ రాజ్ ఫిలిమ్స్ (YRF) బ్యానర్‌పై మనీష్ శర్మ (Maneesh Sharma) దర్శకత్వంలో ఆదిత్య చోప్రా (Aditya Chopra) నిర్మించిన ఈ భారీ బడ్జెట్ చిత్రం దీపావళి సందర్భంగా నవంబర్ 12న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది.


ఇవి కూడా చదవండి:

========================

*Ala Ninnu Cheri: సినిమా చూసిన వారంతా చెబుతున్న మాట అదే..

********************************

*Niharika Konidela: ఫీచర్ ఫిల్మ్ కేటగిరిలోకి.. నిహారిక మరో స్టెప్

****************************************

*Suman: అలా చేస్తే.. అన్ని భాషల సినిమా వాళ్లు ఆంధ్రా వైపు చూస్తారు

***************************************

Updated Date - 2023-11-10T22:03:59+05:30 IST