Serial Artists: బతుకమ్మ సంబరాల్లో సీరియల్ నటీనటుల సందడి

ABN , First Publish Date - 2023-10-19T21:09:06+05:30 IST

దసరా, బతుకమ్మ పండుగ సంబరాల్లో తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్ స్టార్ మా‌లో వచ్చే సీరియల్స్‌లో నటించే నటీనటులు సందడి చేశారు. తమ అభిమాన ప్రేక్షకులకు ఆనందాన్ని ఇచ్చేందుకు హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాతాలలో ఉన్న దుర్గా పూజా మండపాలను వారు సందర్శించారు.

Serial Artists: బతుకమ్మ సంబరాల్లో సీరియల్ నటీనటుల సందడి

దసరా, బతుకమ్మ పండుగ సంబరాల్లో తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్ స్టార్ మా‌లో వచ్చే సీరియల్స్‌లో నటించే నటీనటులు (Serial Artists) సందడి చేశారు. తమ అభిమాన ప్రేక్షకులకు ఆనందాన్ని ఇచ్చేందుకు హైదరాబాద్ (Hyderabad) నగరంలోని వివిధ ప్రాతాలలో ఉన్న దుర్గా పూజా మండపాలను వారు సందర్శించారు. ‘స్టార్ మా’లో వచ్చే ‘పలుకే బంగారమాయెనా’, ‘నాగ పంచమి’ సీరియల్స్‌లో నటించే నటీనటులు బుధవారం సాయంత్రం నగరంలోని వివిధ ప్రాంతాల్లో తమ అభిమానులతో సంతోషంగా గడిపి.. వారికి మెమరబుల్ క్షణాలను అందించారు. (Dussehra Celebrations)


Celebrations.jpg

ప్రకాశవంతంగా వెలిగిపోతున్న దుర్గా పూజా మండపాల వద్ద వారంతా బతుకమ్మ ఆడుతూ, పాటలు పాడుతూ, డ్యాన్స్ చేస్తూ, సెల్ఫీలు తీసుకుంటూ, బహుమతులను అందిస్తూ, సమిష్టి స్ఫూర్తిని చాటుతూ తమ అభిమానులతో ఆనందోత్సవాలను జరుపుకున్నారు. తమ వీక్షకులతో దృఢమైన బంధాన్ని పెంపొందించుకోవడానికి మరియు ప్రతి పండుగను సంతోషకరమైన అనుభూతిగా మార్చడానికి స్టార్ మా ఈ విధంగా ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇంతకు ముందు గణపతి ఉత్సవాలలోనూ కొందరు సీరియల్ తారలు ఇలానే సందడి చేశారు. ఇప్పుడు దసరా, బతుకమ్మ వేడుకల సందర్భంగా తమ కళాకారులను సదరు ఛానెల్ ప్రేక్షకులకు మరింత చేరువ చేస్తోంది. (Bathukamma Celebrations)


ఇవి కూడా చదవండి:

============================

*Pindam: హీరో శ్రీ విష్ణు వదిలిన ‘పిండం’ ఫస్ట్ లుక్ పోస్టర్.. థ్రిల్లింగ్!

************************************

*Bramayugam: మమ్ముట్టి స్పీడ్‌ చూస్తుంటే ‘భ్రమ’లు తొలగిపోతున్నాయ్..

***********************************

*Japan: అమ్మాయిలు, గోల్డ్‌తో ఫుల్ టైమ్ ఎంజాయ్ చేసే మాస్ ఐటెం రాజా!

*********************************

*Family Star Glimpse: ఉల్లిపాయలు కొంటే ఆడు మనిషి కాదా.. పిల్లల్ని రెడీ చేస్తే ఆడు మగాడు కాదా.. ఐరెన్ వంచాలా ఏంటి?

*********************************

*Rana Daggubati: తెలుగు చిత్ర పరిశ్రమలో ఇలాంటి దర్శకుడు ఉన్నందుకు గౌరవంగా భావిస్తున్నా..

********************************

Updated Date - 2023-10-19T21:09:06+05:30 IST