Baby Team: సెలెస్టీ క్లినిక్ సెంటర్‌లో ‘బేబీ’ టీమ్ సందడి

ABN , First Publish Date - 2023-10-15T21:48:56+05:30 IST

పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారు ఎక్కువగా చర్మ వ్యాధులకు మరియు హెయిర్ ఫాల్స్‌కి ఎక్కువగా గురవుతున్నారని ‘బేబీ’ హీరోయిన్ వైష్ణవి చైత్యన్య అన్నారు. ఆదివారం ఆమె కోకాపేట్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన సెలెస్టీ స్కిన్ లేజర్ మరియు హెయిర్ క్లినిక్‌ సెంటర్‌ని తన కో స్టార్స్ ఆనంద్ దేవరకొండ మరియు విరాజ్‌ అశ్విన్‌తో కలిసి ప్రారంభించారు.

Baby Team: సెలెస్టీ క్లినిక్ సెంటర్‌లో ‘బేబీ’ టీమ్ సందడి
Baby Movie Team

పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారు ఎక్కువగా చర్మ వ్యాధులకు మరియు హెయిర్ ఫాల్స్‌కి ఎక్కువగా గురవుతున్నారని ‘బేబీ’ (Baby) హీరోయిన్ వైష్ణవి చైత్యన్య అన్నారు. ఆదివారం ఆమె కోకాపేట్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన సెలెస్టీ స్కిన్ లేజర్ మరియు హెయిర్ క్లినిక్‌ సెంటర్‌ని తన కో స్టార్స్ ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda) మరియు విరాజ్‌ అశ్విన్ (Viraj Ashwin)తో కలిసి ప్రారంభించారు. వీరిని చూసేందుకు జనాలు ఎగబడ్డారు. సినిమాని ఆదరించి.. పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ఈ సందర్భంగా వారు ధన్యవాదాలు తెలిపారు.


Anand.jpg

అనంతరం వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) మాట్లాడుతూ.. చర్మ వ్యాధులు మరియు హెయిర్ ట్రీట్మెంట్ కోసం ప్రస్తుతం అధునాతన శస్త్ర చికిత్సలు హైదరాబాద్ నగరంలో కూడా అందుబాటులోకి వచ్చాయని.. ఒకప్పుడు ముంబై, చెన్నై, బెంగళూరు వంటి ప్రదేశాలకు వెళ్ళాల్సి వచ్చేదని అన్నారు. అత్యాధునిక పరికరాలతో, ప్రపంచ స్థాయి వైద్యం అందించేందుకు సెలెస్టీ స్కిన్ లేజర్ మరియు హెయిర్ క్లినిక్‌ని కోకాపేట్‌లో ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆమె నిర్వాహకులను అభినందించారు. నేటి యువత, మహిళలు స్కిన్‌కేర్‌ మరియు హెయిర్‌పై ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నారని అలాంటి వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. నగర వాసుల అవసరాలు తీర్చేందుకు నగరంలో మరిన్ని శాఖలు తెరవనున్నామని నిర్వాహకులు డాక్టర్‌ రాజ్ కిరీటి ఈ. పి. మరియు డాక్టర్ శ్రీదేవి తెలిపారు.


ఇవి కూడా చదవండి:

============================

*Leo: ‘లియో’ ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో టిక్కెట్‌ ధర రూ.5 వేలా?

***********************************

*Salaar Vs Dunki: రెబల్‌ స్టార్‌తో పోటీకి తగ్గేదే లే అంటోన్న బాద్‌షా..

**********************************

*Salman Khan: ఆయుధం లేకుండానే.. ‘టైగర్’ వారి అంతు చూస్తాడు

***********************************

*Taapsee Pannu: ఇప్పటి వరకు కమర్షియల్ హీరోతో చేసే అవకాశం రాలేదంటూ సంచలన వ్యాఖ్యలు

*************************************

Updated Date - 2023-10-15T21:50:10+05:30 IST