Oscars95: ఆస్కార్ నిర్వాహకులపై ఉక్రెయిన్ మంత్రి విమర్శలు.. కారణం ఏంటంటే..

ABN , First Publish Date - 2023-03-14T09:52:03+05:30 IST

గత కొద్దిరోజులుగా సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ‘ఆస్కార్ 95’ (Oscars95) వేడుకలు పూర్తయ్యాయి.

Oscars95: ఆస్కార్ నిర్వాహకులపై ఉక్రెయిన్ మంత్రి విమర్శలు.. కారణం ఏంటంటే..
Oscars

గత కొద్దిరోజులుగా సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ‘ఆస్కార్ 95’ (Oscars95) వేడుకలు పూర్తయ్యాయి. భారత కాలమానం ప్రకారం మార్చి 13న లాస్ ఎంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో అట్టహాసంగా జరిగాయి. ఈ సారి భారతదేశానికి రెండు అవార్డులు రావడంతో దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు అందరూ సంతోషంలో మునిగి తేలుతున్నారు. ఈ తరుణంలో ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా (Dmytro Kuleba) మాత్రం ఆస్కార్ నిర్వహకులపై విమర్శలు చేశారు.

రష్యాకి, ఉక్రెయిన్‌కి మధ్య గత కొన్ని నెలలుగా యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ యుద్ధం గురించి వీలు దొరికిన ప్రతి చోట మాట్లాడుతూ.. రష్యాపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ (Volodymyr Zelensky)విమర్శలు చేస్తున్నారు. తాజాగా జరిగిన ఆస్కార్ వేడుకలో కూడా ఆయన మాట్లాడాలని అనుకున్నారు. కానీ ఆస్కార్ నిర్వహకులు ఆ అవకాశం ఇవ్వలేదు. దానిపై ఆ దేశ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా తాజాగా విమర్శలు చేశారు.

కులేబా మాట్లాడుతూ.. ‘‘యుద్ధం కథగా తెరకెక్కిన ‘ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్’ (All Quiet on the Western Front) చిత్రానికి ఆస్కార్ అవార్డు ఇచ్చారు. కానీ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అంత పెద్ద యుద్ధం చేస్తున్న దేశాన్ని ముందుకు నడిపిస్తున్న ప్రెసిడెంట్ జెలెన్స్కీని మాత్రం అక్కడ మాట్లాడటానికి అనుమతించరు. ఇది చూస్తే.. అక్కడి సినీ పరిశ్రమలోని మేనేజర్లు, నిర్మాతల కపటత్వం గురించి తెలుస్తోంది’ పేర్కొన్నారు.

అలాగే, కులేబా ఇంకా మాట్లాడుతూ.. ‘వారి కపటత్వాన్ని వర్ణించడానికి మాటలు సరిపోవు. యుద్ధ ప్రాధానంగా తెరకెక్కిన చిత్రానికి అవార్డు ఇస్తే.. నిజమైన యుద్ధానికి మాత్రం ప్రాధాన్యం ఇవ్వరా. మీలో ఏదో తప్పు ఉంది’ అని చెప్పుకొచ్చారు. కాగా.. ఆస్కార్ అవార్డు సాధించిన ‘నాటు నాటు’ పాటని ఉక్రెయిన్‌లోని ఓ ప్యాలెస్‌లో చిత్రీకరించిన విషయం అందరికీ తెలిసిందే.

ఇవి కూడా చదవండి:

Oscars 2023: భుజంపై పులి బొమ్మతో ఎన్టీఆర్.. నిర్వాహకులు అడిగితే.. యంగ్ టైగర్ జవాబుకి అందరూ ఫిదా..

SIR OTT Streaming: ఓటీటీలో క్లాస్ తీసుకోడానికి సిద్ధమైన ధనుష్..

Rana Naidu Webseries: ఛీఛీ.. ఇలా చేశారేంటి?.. దగ్గుబాటి హీరోలని ఆడేసుకుంటున్న నెటిజన్లు

NTR: ఏ హీరో ఇష్టపడని పాత్రలో అదరగొట్టిన ఎన్‌టీఆర్.. ఏం చేసినా అంతే..

Writer Padmabhushan OTT Streaming: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..

Anicka: హీరోయిన్‌ని ముఖం వాచిపోయేలా కొట్టిన మాజీ ప్రియుడు.. అసలు విషయం ఏమిటంటే?

Updated Date - 2023-03-14T09:52:06+05:30 IST