Citadel Webseries: ఇరగదీసిన ప్రియాంక చోప్రా.. ఆకట్టుకుంటున్న యాక్షన్..

ABN , First Publish Date - 2023-03-31T16:00:45+05:30 IST

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) హాలీవుడ్‌లో వరుస ప్రాజెక్టులతో చేస్తున్న సంగతి తెలిసిందే.

Citadel Webseries: ఇరగదీసిన ప్రియాంక చోప్రా.. ఆకట్టుకుంటున్న యాక్షన్..
Priyanka Chopra Citadel

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) హాలీవుడ్‌లో వరుస ప్రాజెక్టులతో చేస్తున్న సంగతి తెలిసిందే. ఓ వైపు సినిమాలు.. మరోవైపు వెబ్‌సిరీస్‌లు చేస్తూ కెరీర్‌లో దూసుకుపోతోంది. ఇటీవలే సూపర్ హిట్ సినిమాల సిరీస్ ‘మ్యాట్రిక్స్ 4’ చిత్రంతో పలకరించిన ప్రియాంక తాజాగా నటించిన ‘సిటడెల్’ (Citadel) వెబ్‌సిరీస్‌లో నటించింది. ‘అవెంజర్స్: ఎండ్ గేమ్’తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రుస్సో బ్రదర్స్ ఈ సిరీస్‌కి నిర్మాతలు. దీంతో ఈ వెబ్‌సిరీస్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సిరీస్ ఏప్రిల్ 28 నుంచి అమెజాన్ ప్రైమ్‌ (Amazon Prime) లో స్ట్రీమింగ్ కానుంది.

citadel.jpg

ఈ తరుణంలో ఈ వెబ్‌సిరీస్ టీజర్‌ని మేకర్స్ విడుదల చేయగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఆ సంతోషాన్ని కొనసాగిస్తూ.. తాజాగా సిరీస్ యాజమాన్యం వెబ్‌సిరీస్ ట్రైలర్‌ని విడుదల చేసింది. ఈ స్పై థ్రిల్లర్‌లో రిచర్డ్ మాడెన్, ప్రియాంక చోప్రా సీక్రెట్ ఏజెంట్లుగా నటించారు. ఈ ట్రైలర్‌ ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. యాక్షన్ సీక్వెన్స్ చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. యాక్షన్ మామూలుగా లేదు. వారిద్దరూ కూడా కెరీర్ బెస్ట్ ఫర్ఫామెన్స్ ఇచ్చారు.

Priyanka-chopra-1.jpg

ముఖ్యంగా ప్రియాంక అయితే ఇరగదీసిందని ఇండియాలోని ఆమె అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇది చూస్తుంటే ప్రియాంక ఏదో ఒకరోజు ఆస్కార్ అవార్డు అందుకుంటుదనిపిస్తోందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ‘సిటడెల్’ అనే గూఢచారి సంస్థ చాలా ఆపరేషన్స్ చేస్తుంటుంది. అయితే అది కేవలం డబ్బు కోసమే. దాని కోసం ఏ దేశం కోసమైన గూఢఛర్యం చేస్తుంది. అంతేకాని.. ఏ దేశానికి నమ్మకంగా ఉండదు. అలాంటి సంస్థ నష్టాల్లో ఉన్నప్పుడు ఏం చేసిందనేది ఈ వెబ్‌సిరీస్ కథాంశం. ఈ సిరీస్ ఇంగ్లిష్‌తో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుంది. (Citadel Trailer out)

ఇవి కూడా చదవండి:

Adipurush: మరోసారి ప్రభాస్ మూవీ పోస్టర్‌పై ట్రోలింగ్.. ఈసారి హనుమంతుడి గెటప్‌పై..

Dasara Twitter Review: నాని మొదటి పాన్ ఇండియా మూవీ ఎలా ఉందంటే..

Sridevi Shoban Babu OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన బావామరదళ్లు.. ఎక్కడ చూడొచ్చంటే..

Taapsee Pannu: తాప్సీపై కేసు.. ఆ సమయంలో లక్ష్మీదేవి లాకెట్ ధరించడంతో..

Adipurush: రిలాక్స్ ప్రభాస్ ఫ్యాన్స్.. వాటిని నమ్మొద్దు.. దానికే ఫిక్సయిపోండి..

Shah Rukh Khan Vs Virat Kohli: సోషల్ మీడియాలో కొట్టేసుకుంటున్న ఫ్యాన్స్.. కారణం ఏంటంటే..

Updated Date - 2023-03-31T16:02:09+05:30 IST