సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Hari Hara Veera Mallu: కీరవాణి కూడా..!

ABN, First Publish Date - 2023-04-24T14:18:39+05:30

పవన్ కల్యాణ్ ఇప్పటి వరకు టచ్ చేయని జానర్‌లో తెరకెక్కుతోంది. అలాగే ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి విడుదలైన స్టిల్స్, గ్లింప్స్ సినిమాపై భారీ హైప్‌ని క్రియేట్ చేశాయి. కాకపోతే..

MM Keeravani and Pawan Kalyan
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Power Star Pawan Kalyan) ఇప్పటి వరకు చేసిన సినిమాలు ఒక లెక్క.. ఇప్పుడు చేస్తున్న సినిమాలు మరో లెక్క అన్నట్లుగా.. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల ఆర్డర్ ఉంది. సముద్రఖని దర్శకత్వంలో ‘వినోదయ్య సిత్తం’ రీమేక్ మినహా.. మిగతా దర్శకులతో చేస్తున్న చిత్రాలన్నీ పవన్ కల్యాణ్ స్టామినా ఏంటో మరోసారి బాక్సాఫీస్‌కి తెలియజెప్పే చిత్రాలే. హరీష్ శంకర్ (Harish Shankar), సుజీత్‌ (Sujeeth)లతో చేస్తున్న చిత్రాలు ప్రస్తుతం సెట్స్‌పై ఉన్నప్పటికీ.. మెగాభిమానులందరి కళ్లు.. క్రిష్ (Krish) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) సినిమాపైనే ఉన్నాయనేది కాదనలేని సత్యం. ఎందుకంటే.. ఈ సినిమా పవన్ కల్యాణ్ ఇప్పటి వరకు టచ్ చేయని జానర్‌లో తెరకెక్కుతోంది. అలాగే ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి విడుదలైన స్టిల్స్, గ్లింప్స్ సినిమాపై భారీ హైప్‌ని క్రియేట్ చేశాయి. కాకపోతే షూటింగ్ మాత్రం నత్తనడకన నడుస్తుండటం ఫ్యాన్స్‌కి నిరాశను కలిగిస్తున్నా.. తాజాగా ఈ సినిమాకు సంబంధించి వచ్చిన అప్‌డేట్‌తో ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు.

ఆ అప్‌డేట్ ఏమిటంటే.. ఇప్పటి వరకు పవన్ కల్యాణ్ ఎన్నో పాటలు పాడారు. ‘జానీ’, ‘తమ్ముడు’, ‘ఖుషి’, ‘పంజా’, ‘అత్తారింటికి దారేది’, ‘అజ్ఞాతవాసి’ వంటి చిత్రాలలో పవన్ కల్యాణ్ పాటలు పాడారు. సంగీత దర్శకులు రమణ గోగుల, మణిశర్మ, దేవిశ్రీ ప్రసాద్ వంటి వారు పవన్ కల్యాణ్‌తో పాటలు పాడించారు. ఇప్పుడు ఎమ్.ఎమ్. కీరవాణి (M.M. Keeravani) వంతొచ్చింది. ‘హరిహర వీరమల్లు’ చిత్రంతో పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో కీరవాణి ఓ పాటను పాడించబోతున్నారట. అదీ కూడా అలాంటిలాంటి సాంగ్ కాదని.. పవన్ కల్యాణ్‌లానే పవర్‌ఫుల్‌గా ఉండబోతుందని అంటున్నారు. తాజాగా ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. (Hari Hara Veera Mallu Update)

ఆస్కార్ విన్న‌ర్ (Oscar Winner) ఎమ్.ఎమ్. కీర‌వాణి ఈ సినిమాలో ప్ర‌త్యేక సంద‌ర్భంలో వ‌చ్చే ఓ పాటకు ప‌వ‌న్ కల్యాణ్ గ‌ళం అయితేనే బాగుంటుంద‌ని భావించి.. ఈ సాంగ్ పాడ‌మ‌ని ప‌వ‌న్‌ను రిక్వెస్ట్ చేసిన‌ట్లుగా టాక్ నడుస్తోంది. కీర‌వాణి కోరడంతో పవన్ కల్యాణ్ కూడా ఓకే చెప్పారని.. త్వరలోనే ఈ పాటను రికార్డ్ చేయనున్నారని అంటున్నారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ ఉన్న బిజీలో.. మళ్లీ సింగర్‌గా అవతారం ఎత్తడం అంటే మాములు విషయం కాదు. కానీ, తనకి నచ్చితే ఎంత వరకైనా వెళ్లడానికి పవన్ కల్యాణ్ వెనుకాడరు. అది మరోసారి ఈ సాంగ్ విషయంలో స్పష్టమైందని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ పాటకు సంబంధించి మేకర్స్ మాత్రం ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఇక ‘హరిహర వీరమల్లు’ సినిమా విషయానికి వస్తే.. పీరియాడిక‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రాన్ని ద‌ర్శ‌కుడు క్రిష్‌ (Director Krish) తెరకెక్కిస్తున్నారు. ఇందులో మొఘ‌లుల కాలం నాటి బందిపోటు దొంగ‌గా ప‌వ‌న్ క‌ల్యాణ్ కనిపించనున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన చివరి షెడ్యూల్ షూటింగ్ మే నెలలో ప్రారంభంకానున్నట్లుగా తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి:

************************************************

*Akhil Akkineni: ‘ఏజెంట్’లో అది నాకు చాలా కష్టమనిపించింది

*Dhanush: 40 ఏళ్ల వయసులో యూత్‌ ఐకాన్‌ అవార్డు

*Mama Mascheendra Teaser Talk: మహేష్ బావ.. ఆ ఇద్దర్నీ ఒకేసారి చంపేస్తాడట!

*OG Producer: మటన్ బిర్యానీతో పవన్ కల్యాణ్ ఫ్యాన్‌ని సర్‌ప్రైజ్ చేసిన నిర్మాత

*Young Actress: మోడల్స్‌ని వ్యభిచార ఊబిలోకి దించుతోన్న నటి అరెస్ట్

Updated Date - 2023-04-24T14:18:39+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!