సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Rakul Preet Singh: రకుల్‌ రీ ఎంట్రీ సాధ్యమేనా?

ABN, First Publish Date - 2023-04-16T14:21:19+05:30

రకుల్ తన పారితోషికాన్ని తగ్గించుకొంటానని, ఎలాంటి పాత్ర అయినా చేయడానికి సిద్ధంగానే ఉన్నానని దర్శక నిర్మాతలకు సంకేతాలు పంపుతోందట

Rakul Preet Singh
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘కొండపొలం’ (Kondapolam) తర్వాత తెలుగులో సినిమాలేం చేయలేదు రకుల్‌ప్రీత్‌ సింగ్‌ (Rakulpreet Singh). ‘కొండపొలం’ వచ్చి రెండేళ్లే దాటేసింది. కాకపోతే.. ఈలోగా ఓ అరడజను హిందీ ప్రాజెక్టుల్లో (Bollywood) మెరిసింది. అవేం రకుల్‌కి కెరీర్‌ పరంగా పెద్దగా సాయపడలేదు. ఈలోగా.. టాలీవుడ్‌ (Tollywood) రకుల్‌ని పూర్తిగా మర్చిపోయింది. ఆమె చేతిలో ఒక్క తెలుగు సినిమా లేదు. రకుల్‌ మాత్రం తెలుగులో మళ్లీ మెరవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. తన పారితోషికాన్ని తగ్గించుకొంటానని, ఎలాంటి పాత్ర అయినా చేయడానికి సిద్ధంగానే ఉన్నానని దర్శక నిర్మాతలకు సంకేతాలు పంపుతోందట.

అయితే రకుల్‌ రీ ఎంట్రీ అంత ఈజీ కాదు. ఎందుకంటే శ్రీలీల (Sreeleela), కృతిశెట్టి (Krithi Shetty) రూపంలో యువ కథానాయికల నుంచి గట్టి పోటీ ఏర్పడుతోంది. దానికి తోడు... బాలీవుడ్‌ కథానాయికల (Bollywood Heroines) హవా తెలుగులో బాగా ఉంది. వీళ్లందరి ధాటిని తట్టుకోవడం కష్టమే. అయితే రకుల్‌ చేతిలో ‘ఇండియన్‌ 2’ (Indian 2) ఉంది. ఇది పాన్‌ ఇండియా సినిమా. తెలుగులోనూ భారీ స్థాయిలోనే విడుదల అవుతుంది. ఈ సినిమాతో రకుల్‌ జాతకం మారే అవకాశం ఉంది. ‘ఇండియన్‌ 2’ హిట్టయి, అందులో రకుల్‌ పాత్రకు మంచి పేరొస్తే... టాలీవుడ్‌ నుంచి ఇంకొన్ని అవకాశాలు రాబట్టొచ్చు. మరి శంకర్‌ ఏం చేస్తాడో చూడాలి.

అలాగే రకుల్‌ (Rakul)కి ఇంకో ఛాన్స్ కూడా ఉంది. కుర్ర హీరోలే అని కూర్చోకుండా.. చిరు (Chiru), బాలయ్య (Balayya) వంటి వారి సరసన నటించేందుకు కూడా రెడీ అనేలా సంకేతాలు ఇస్తే మాత్రం.. మరోసారి టాలీవుడ్‌లో ఆమె బిజీ అయ్యే అవకాశం ఉన్నట్లుగా కూడా టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే యంగ్ హీరోయిన్ శృతిహాసన్ (Shruti Haasan) ఈ మధ్య ఈ ఇద్దరితో హిట్ కొట్టి మళ్లీ రేసులోకి వచ్చింది. మరి ఇలాంటి తరుణంలో రకుల్ ఎలాంటి డెసిషన్ (Rakul Decision) తీసుకుంటుందో వెయిట్ అండ్ సీ..

ఇవి కూడా చదవండి:

*********************************

*Shaakuntalam: ఇక అల్లు అర్జున్ ఫ్యాన్సే.. ఈ ప్రోమో అర్థం అదేనా?

*Vetrimaaran: ‘విడుదల’కు పాజిటివ్ టాక్.. ఛాన్స్ ఇచ్చే టాలీవుడ్ హీరో ఎవరు?

*Tammreddy Bharadwaja: మీ ఫ్యామిలీస్‌‌ని తిట్టినప్పుడు.. ఏమైంది మీ మగతనం? ఇండస్ట్రీ హీరోలకి సూటి ప్రశ్న?

*Actress Prema: రెండో పెళ్లి విషయమై ఫుల్ క్లారిటీ ఇచ్చిన ప్రేమ..!

*Radhika Apte: నన్ను ఆ సర్జరీ చేయించుకోమన్నారు.. ఇప్పుడలా అంటేనా?

Updated Date - 2023-04-16T14:21:21+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!