సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Karthik Dandu: ఎన్టీఆర్‌ వాయిస్‌తో ‘విరూపాక్ష’కు పవర్

ABN, First Publish Date - 2023-04-17T17:38:25+05:30

మొదటి సినిమాతోనే పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ని డీట్ చేసిన దర్శకుడు కార్తీక్ దండు. ఆయన తాజాగా ‘విరూపాక్ష’ సినిమా గురించి మాట్లాడుతూ..

Director Karthik Dandu
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej), సంయుక్తా మీనన్ (Samyuktha Menon) హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న పాన్ ఇండియా మిస్టీక్ థ్రిల్లర్ ‘విరూపాక్ష’ (Virupaksha). కార్తీక్ దండు (Karthik Dandu) దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర (SVCC), సుకుమార్ రైటింగ్స్ (Sukumar Writings) బ్యానర్స్‌పై బాపినీడు బి.సమర్పణలో.. నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ (BVSN Prasad) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే అందించారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఏప్రిల్ 21న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను ఏలూరులోని సీఆర్ రెడ్డి కాలేజ్ గ్రౌండ్‌లో నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కార్తిక్ దండు మాట్లాడుతూ (Karthik Dandu about Virupaksha).. ‘‘రాజమౌళి (Rajamouli), కీరవాణి(Keeravani)గారి వల్ల ఈరోజు మన సినిమా ఇండస్ట్రీ వైపు ప్రపంచం చూస్తోంది. ఫస్ట్ ఎన్టీఆర్‌గారి (Jr NTR) వాయిస్ వల్ల ఈ ‘విరూపాక్ష’ సినిమాకు పవర్ వచ్చింది. సినిమా టీజర్‌ను చూసి పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌గారు (Power Star Pawan Kalyan) మెచ్చుకున్నారు. ఆయన బ్లెస్సింగ్స్ ఎప్పటికీ మరిచిపోలేను. సుకుమార్‌గారు ఈ కథ విని.. స్క్రీన్‌ప్లే చేస్తాను, ప్రొడ్యూస్ చేస్తాను అని అన్నారు. అయితే ఇంకా పెద్ద స్థాయిలో సినిమాను తీయాలని బీవీఎస్‌ఎన్ ప్రసాద్‌‌గారికి చెప్పారు. ఈ సినిమాను ఇంత గొప్పగా నిర్మించిన ప్రసాద్‌గారికి థాంక్స్. సాయి ధరమ్ తేజ్‌గారు చాలా మంచి వారని అందరూ చెబుతుండేవారు. అయితే ఆయనతో పని చేసిన తరువాత నాకు మరింతగా అర్థమైంది. ఆయనకు ఈ సినిమా కెరీర్ పాథ్ బ్రేకింగ్ సినిమా అవుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆయనకు థాంక్స్. ఈ సినిమాను ఇంత గొప్పగా నిర్మించిన బాపీ, ప్రసాద్ గారికి థాంక్స్. సినిమాను ప్రతీ ఒక్కరూ ఎంజాయ్ చేస్తూ చేశారు. ఈ సినిమాలో భాగస్వామి అయిన సంయుక్తకు థాంక్స్. ప్రతీ ఒక్కరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

ఇందులో నటీనటులు కాకుండా నేను సృష్టించిన పాత్రలే కనిపిస్తాయి. సినిమాను పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. నేను అనుకున్న విజన్‌ను శ్యాం సర్ అద్భుతంగా చూపించారు. నాగేంద్రగారు రుద్రవనం (Rudravanam)ను అద్భుతంగా నిర్మించారు. అజనీష్ ఆర్ఆర్ సినిమాకు ప్లస్ అవుతుంది. అద్భుతంగా సౌండ్ డిజైన్ చేశారు. సినిమాకు మొదటి ఆడియెన్ ఎడిటర్. మూడు గంటల సినిమా ఇస్తే.. రెండు గంటల 24 నిమిషాల సినిమా ఇచ్చాడు. ఏ ఒక్క ఎమోషన్ మిస్ అవ్వకుండా అద్భుతంగా ఎడిట్ చేసి ఇచ్చిన నవీన్‌కు థాంక్స్. రాజశేఖర్ చేసిన డీటీఎస్ మిక్స్ అద్భుతంగా ఉంటుంది. నాకు హారర్ సినిమాలంటే ఇష్టం. నేను ఈ సినిమాతో హారర్ జానర్‌ రుణం తీర్చుకున్నాను’’ అని అన్నారు (Karthik Dandu Speech at Virupaksha Event).

ఇవి కూడా చదవండి:

*********************************

*Trisha: కార్తీతో కెమిస్ట్రీపై.. త్రిష ఆసక్తికర వ్యాఖ్యలు

*Kanchu Kagada: ఎన్టీఆర్‌ అభిమానుల ఆందోళన.. వెనక్కి తగ్గని కృష్ణ!

*Box Office: బావలు కలిస్తే.. బాక్సాఫీస్ బద్దలే!

*Vetrimaaran: ‘విడుదల’కు పాజిటివ్ టాక్.. ఛాన్స్ ఇచ్చే టాలీవుడ్ హీరో ఎవరు?

*Tammreddy Bharadwaja: మీ ఫ్యామిలీస్‌‌ని తిట్టినప్పుడు.. ఏమైంది మీ మగతనం? ఇండస్ట్రీ హీరోలకి సూటి ప్రశ్న?

Updated Date - 2023-04-17T17:38:27+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!