Bichagadu 2: ఈ బిచ్చగాడు వచ్చేది ఎప్పుడంటే..

ABN , First Publish Date - 2023-02-27T22:45:19+05:30 IST

విజయ్ ఆంటోనీ (Vijay Antony)ని స్టార్ హీరోగా మార్చిన చిత్రం ‘బిచ్చగాడు’ (Bichagadu). ఈ సినిమా ఎటువంటి రికార్డులను క్రియేట్ చేసిందో తెలియంది కాదు. ప్రస్తుతం ఈ చిత్రానికి

Bichagadu 2: ఈ బిచ్చగాడు వచ్చేది ఎప్పుడంటే..
Bichagadu 2 Poster

విజయ్ ఆంటోనీ (Vijay Antony)ని స్టార్ హీరోగా మార్చిన చిత్రం ‘బిచ్చగాడు’ (Bichagadu). ఈ సినిమా ఎటువంటి రికార్డులను క్రియేట్ చేసిందో తెలియంది కాదు. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్‌గా సిద్ధమవుతోంది. ‘బిచ్చగాడు 2’ (Bichagadu 2) టైటిల్‌తో రూపుదిద్దుకుంటోన్న ఈ సీక్వెల్‌కు సంబంధించి తాజాగా మేకర్స్ విడుదల తేదీని ప్రకటించారు. మొదటి పార్ట్ 144 రోజుల ఆడి.. బ్లాక్‌బస్టర్ అవ్వడంతో.. ఇప్పుడీ సీక్వెల్‌ని సమ్మర్‌లో ఏప్రిల్ 14న విడుదల చేయనున్నారు. అంటే 14వ తేదీ, 4వ నెల.. మొత్తం సంఖ్యంలో 144 కనబడేలా.. ఈ మూవీకి విడుదల తేదీని ఫిక్స్ చేశారు. (Bichagadu 2 Release Date)

కాగా.. ఈ చిత్రాన్ని విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ (Vijay Antony Film Corporation) బ్యానర్‌పై ఫాతిమా విజయ్ ఆంటోనీ (Fatima Vijay Antony) నిర్మిస్తుండగా.. విజయ్ ఆంటోనీ కథ, దర్శకత్వంతో పాటు సంగీతం, ఎడిటింగ్ బాధ్యతలూ నిర్వహిస్తున్నారు. బ్రెయిన్ ట్రాన్స్ ప్లాంటేషన్ అనే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కావ్య థాపర్ హీరోయిన్‌ (Kavya Thapar)గా నటిస్తోంది. దేవ్ గిల్, హరీష్ పెరడి, జాన్ విజయ్, రాధా రవి, మన్సూర్ అలీ ఖాన్ ఇతర పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్ర రిలీజ్ డేట్‌తో పాటు విడుదల చేసిన థీమ్ సాంగ్.. సినిమాపై మంచి ఆసక్తి క్రియేట్ చేస్తోంది.

ఇవి కూడా చదవండి

*********************************

Laya: పవన్ కల్యాణ్ మాట నిలబెట్టుకున్నారు.. ఆసక్తికర విషయం చెప్పిన లయ

Krishnam Raju’s Wife: ఆస్కార్‌ దగ్గరలోనే ఉందనిపిస్తోంది

Chiranjeevi: రాజశేఖర్ చేసిన పనికి.. చిరు సెల్యూట్ చేశారు

Veera Simha Reddy: ఒక్క నిమిషంలోనే.. ఓటీటీలో ఊచకోత!

Nara Lokesh: మెగాస్టార్ చిరంజీవి అభిమానిని.. ‘వాల్తేరు వీరయ్య’ చూశా..

Rashmi Gautam: యాసిడ్ పోస్తారట.. కేసు పెట్టాలా? వద్దా?

Sir: దర్శకుడే కారణం.. చిరు చెప్పిందే మూర్తిగారు చెప్పారు

GlobalStar Ram Charan: రామ్ చరణ్ రేంజ్ మారిపోయిందబ్బా..

Updated Date - 2023-02-27T22:45:24+05:30 IST