VD13: సెట్స్‌లో మృణాల్‌ని సర్‌ప్రైజ్ చేసిన విజయ్ దేవరకొండ

ABN , First Publish Date - 2023-08-01T20:26:15+05:30 IST

‘గీత గోవిందం’ వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత.. మరోసారి విజయ్ దేవరకొండ, పరుశురాం కాంబోలో VD13 పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండ హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా పరుశురాం తెరకెక్కిస్తున్న ఈ మూవీని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్ర సెట్స్‌లో మృణాల్ ఠాగూర్ పుట్టినరోజు వేడుకను మేకర్స్ నిర్వహించారు.

VD13: సెట్స్‌లో మృణాల్‌ని సర్‌ప్రైజ్ చేసిన విజయ్ దేవరకొండ
VD13 Movie Sets

‘గీత గోవిందం’ (Geetha Govindam) వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత.. మరోసారి విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), పరుశురాం (Parasuram Petla) కాంబోలో VD13 పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండ హీరోగా, మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) హీరోయిన్‌గా పరుశురాం తెరకెక్కిస్తున్న ఈ మూవీని దిల్ రాజు నిర్మిస్తున్నారు. విజయ్ దేవరకొండ (VD13) పదమూడో చిత్రంగా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో (SVC54) 54వ సినిమాగా ఈ ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది. ఈ మధ్యే మూవీని అధికారికంగా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. దిల్ రాజు, శిరీష్ వంటి వారు ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర బ్యానర్ మీద నిర్మిస్తుండగా.. వాసు వర్మ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాతోనే దిల్ రాజు, శిరీష్‌తో వాసు వర్మ చేతులు కలిపారు. ఈ సినిమాను భారీ ఎత్తున నిర్మిస్తున్నారు.


ఈ సినిమాకు సంబంధించి ఇటీవలే లోకేషన్ల వేట పూర్తి చేసినట్లుగా ప్రకటించిన టీమ్.. వెంటనే సినిమాని సెట్స్‌పై తీసుకెళ్లింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ని చేస్తున్నట్లుగా.. యూనిట్ స్పీడ్ చూస్తుంటే తెలుస్తోంది. ఇక హీరోయిన్ మృణాల్ ఠాకూర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యారామె. ‘సీతా రామం’ సినిమాలో సీత పాత్రలో నటించి మెప్పించారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ హీరోగా వస్తోన్న ఈ సినిమాలో నటిస్తున్నారు.

VD-13-Pic.jpg

ఆగస్ట్ 1 హీరోయిన్ మృణాల్ ఠాకూర్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా సెట్‌లో ఆమె బర్త్ డేను గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసింది చిత్రయూనిట్. సెట్‌లో ఆమె చేత కేక్ కట్ చేయించారు. అనంతరం ఫోటోలకు పోజులు ఇచ్చారు. ఆ ఫోటోల్లో మృణాల్ నవ్వులు చిందిస్తూ ఉన్నారు. విజయ్ దేవరకొండ లుక్స్ సరికొత్తగా ఉన్నాయి. ఈ ఫోటోల్లో యంగ్ నిర్మాత హన్షిత రెడ్డి, శిరీష్‌లు కూడా ఉన్నారు.


ఇవి కూడా చదవండి:

**************************************

*Pawan Kalyan: సినీ పరిశ్రమ తలెత్తుకునేలా చేస్తారని ఆశిస్తున్నా..

**************************************

*Tiger Nageswara Rao: ఆ రూమర్స్‌కు బ్రేక్ వేస్తూ.. మరోసారి రిలీజ్ డేట్‌పై క్లారిటీ

**************************************

*Mrunal Thakur: బర్త్‌డే స్పెషల్‌గా ‘హాయ్ నాన్న’ టీమ్ ఇచ్చిన ట్రీట్ ఇదే..

**************************************

*Navdeep: స్వామీ.. నదికి పోలేదా? అంటే.. ‘నదే సిటీకి వచ్చింది’ అంటూ ప్రభుత్వంపై పంచ్

**************************************

Updated Date - 2023-08-01T20:26:15+05:30 IST