Umapathi: ‘ఉమాపతి’ ట్రైలర్.. అవికాగోర్ ఏం ఉందిరా బాబు..!

ABN , First Publish Date - 2023-12-16T23:28:13+05:30 IST

గ్రామీణ ప్రేమ కథా చిత్రాలకు ప్రేక్షకుల సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని ఇప్పటికే పలు చిత్రాలు నిరూపించాయి. ఇప్పుడు అలాంటి ఓ కథతో ‘ఉమాపతి’ అనే చిత్రం రాబోతోంది. ఈ సినిమాలో అనురాగ్ హీరోగా నటిస్తుండగా.. ‘చిన్నారి పెళ్లికూతురు’ ఫేమ్ అవికా గోర్ హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు.

Umapathi: ‘ఉమాపతి’ ట్రైలర్.. అవికాగోర్ ఏం ఉందిరా బాబు..!
Umapathi Movie Still

గ్రామీణ ప్రేమ కథా చిత్రాలకు ప్రేక్షకుల సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని ఇప్పటికే పలు చిత్రాలు నిరూపించాయి. ఇప్పుడు అలాంటి ఓ కథతో ‘ఉమాపతి’ (Umapathi) అనే చిత్రం రాబోతోంది. ఈ సినిమాలో అనురాగ్ (Anurag) హీరోగా నటిస్తుండగా.. ‘చిన్నారి పెళ్లికూతురు’ ఫేమ్ అవికా గోర్ (Avika Gor) హీరోయిన్‌గా నటిస్తోంది. క్రిషి క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని కే. కోటేశ్వర రావు నిర్మిస్తుండగా.. సత్య ద్వారంపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్లు, పాటలు, టీజర్ ఇలా అన్నీ కూడా పాజిటివ్ బజ్‌ను సొంతం చేసుకోగా.. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ ప్రస్తుతం టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

ట్రైలర్ విషయానికి వస్తే.. అందమైన గ్రామీణ వాతావరణం, ఊర్లోని రకరకాల మనస్తత్వాలున్న మనషులు, అల్లరి చిల్లరగా తిరిగే హీరో.. రెండు ఊర్ల మధ్య ఏవో గొడవలు ఉన్నట్టు.. ఆ గొడవలే హీరో హీరోయిన్ల ప్రేమకు అడ్డంకిలా మారేట్టు చూపించిన సీన్లు బాగున్నాయి. ట్రైలర్‌లో సహజత్వం ఉట్టి పడుతోంది. విజువల్స్ చాలా న్యాచురల్‌గా ఉన్నాయి. ఆర్ఆర్ చక్కగా ఉంది. కుటుంబ సమేతంగా చూడదగ్గ వినోదాత్మకంగా చిత్రంగా ఈ సినిమా తెరకెక్కినట్లుగా ఈ ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. (Umapathi Trailer Out)


Umapathi-2.jpg

‘ఫిదా’ వంటి బ్లాక్ బస్టర్ మూవీకి పని చేసిన మ్యూజిక్ డైరెక్టర్ శక్తికాంత్ కార్తీక్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు రాఘవేంద్ర కెమెరామెన్‌గా, గౌతమ్ రాజు, నానిలు ఎడిటర్లుగా పని చేశారు. వెంకట్ ఆరే ఆర్ట్ డిపార్ట్మెంట్‌ను, చంద్రబోస్, మూర్తి దేవగుప్తపు, భాస్కర భట్ల పాటల రచయితలుగా పని చేసిన ఈ మూవీని డిసెంబర్ 29న గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Salaar: అభిమానులకు 100 టికెట్స్ ఇస్తానంటోన్న యంగ్ హీరో.. క్రేజ్ అలా ఉంది మరి!

*********************************

*Manchu Manoj: శోభా నాగిరెడ్డి బర్త్ యానివర్సరీ.. గుడ్ న్యూస్ చెప్పిన మంచు మనోజ్

******************************************

*Bhagyashri Borse: షాకిచ్చిన హరీష్ శంకర్.. మాస్ రాజా సరసన క్లాస్ రాణి

*************************************

*SeshExShruti: శృతి హాసన్ గ్రిప్పింగ్ క్యారెక్టర్ పోస్టర్ ఫస్ట్ లుక్‌

*****************************************

Updated Date - 2023-12-16T23:28:14+05:30 IST