Sudigali Sudheer: 4వ చిత్రానికి క్లాప్ కొట్టారు.. ఇక కామెడీ కష్టమే!

ABN , First Publish Date - 2023-05-12T20:29:55+05:30 IST

అతి తక్కువ టైమ్‌లో స్టార్ కమెడియన్‌గా పేరు తెచ్చుకున్న నటులలో సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer) ఒకరు. ఆయనిప్పుడు హీరోగా బిజీ అవుతున్నారు. రీసెంట్‌గా ‘గాలోడు’ (Gaalodu) సినిమాతో

Sudigali Sudheer: 4వ చిత్రానికి క్లాప్ కొట్టారు.. ఇక కామెడీ కష్టమే!
Sudigali Sudheer 4th Film Opening

అతి తక్కువ టైమ్‌లో స్టార్ కమెడియన్‌గా పేరు తెచ్చుకున్న నటులలో సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer) ఒకరు. ఆయనిప్పుడు హీరోగా బిజీ అవుతున్నారు. రీసెంట్‌గా ‘గాలోడు’ (Gaalodu) సినిమాతో మంచి సక్సెస్‌ని అందుకున్న సుధీర్ ఇప్పుడు తన నాల్గవ చిత్రాన్ని కూడా ప్రారంభించుకున్నాడు. సుడిగాలి సుధీర్, దివ్య భారతి (Divya Bharathi) హీరోహీరోయిన్లుగా ‘పాగల్’ (Paagal) ఫేమ్ నరేష్ కుప్పిలి (Naresh Kuppili) దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘#SS4’. లక్కీ మీడియా మరియు మహారాజా క్రియేషన్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి చంద్ర శేఖర్ రెడ్డి మొగుళ్ళ (Chandra Shekhar Reddy Mogulla) మరియు బెక్కం వేణుగోపాల్ (Bekkam Venugopal) నిర్మాతలు. శుక్రవారం ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించారు. ముహూర్తపు సన్నివేశానికి చదలవాడ శ్రీనివాస్ (Chadalavada Srinivas) క్లాప్ కొట్టగా జెమినీ కిరణ్ (Gemini Kiran) కెమెరా స్విచ్ ఆన్ చేశారు. నిర్మాతలు డి. సురేష్ బాబు, కె.ఎస్ రామారావు, సూర్యదేవర రాదాకృష్ణ, కెఎల్‌ దామోదర ప్రసాద్‍ ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. ఈ సినిమా స్క్రిప్ట్ వన్ ఇయర్ క్రితమే ఫైనలైంది. గత 4, 5 నెలలుగా ప్రీ ప్రొడక్షన్ గట్టిగా చేశాం. ఈ సినిమాకు లియో మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇది కూడా ఒక హిట్ సినిమా అవ్వబోతుంది. దర్శకుడు నరేష్‌తో మంచి పరిచయం ఉంది. మా సినిమాను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నామని అన్నారు. దర్శకుడు నరేష్ కుప్పిలి మాట్లాడుతూ.. సుధీర్ గారికి ఈ కథను ఒక గంట నేరేట్ చేయగానే ఆయనకు బాగా నచ్చి ఒప్పుకున్నారు. మా ప్రొడ్యూసర్స్ ఈ సినిమా విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అన్ని సమకూర్చారు. లియో మాకు మంచి మ్యూజిక్ ఇచ్చారు. మా రైటర్‌ ఫణికి థాంక్యూ.. అని చెప్పారు. (Producers and Director about SS4 Movie)

Sudheer-Babu.jpg

హీరో సుధీర్ (Sudheer) మాట్లాడుతూ.. మా టీమ్‌ని ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. నన్ను ప్రేక్షకులు ఇంతగా ఆదరించడానికి కారణం మీడియానే. మరో మంచి సినిమాతో మీ ముందుకు రాబోతున్నాను. సినిమాకు సంబంధించిన ఇతర విషయాలను త్వరలోనే మాట్లాడుకుందాం.. అని అన్నారు. అయితే సుధీర్ ఇలా వరుస సినిమాలతో బిజీ అవుతుండటంతో.. ఆయన ఫ్యాన్స్ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో సుధీర్ సినిమా ఓపెనింగ్ సందర్భంగా ఆయన అభిమానులు.. ఓపెనింగ్ ఫొటోలను వైరల్ చేస్తున్నారు. ఆయన కామెడీని ఇష్టపడే వారు మాత్రం.. ఇక బుల్లితెరపై (Small Screen) సుధీర్ కామెడీ కష్టమే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి చదవండి:

************************************************

*Liger: ఆగని వివాదం.. ధర్నాకు దిగిన బాధితులు.. ఛార్మీ సమాధానమిదే!

*Shaakuntalam: చెప్పిన టైమ్ కంటే ఒక రోజు ముందే.. ఓటీటీలోకి వచ్చేసింది

*Naresh: ట్రైలర్.. జస్ట్ మచ్చు తునక మాత్రమే! నా బయోపిక్ కాదు

*Harish Shankar: అప్పుడు 10 ఏళ్ల ఆకలి.. ఇప్పుడు ఇది నా 11 ఏళ్ల ఆకలి

*Ustaad Bhagat Singh: ఈసారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది

*Poonam Kaur: ‘ఉస్తాద్’‌ని కెలికిన పూనమ్ కౌర్.. ఉగ్రరూపం ప్రదర్శిస్తోన్న ఫ్యాన్స్

*Allu Arjun: 30 ఏళ్ల తర్వాత సడెన్‌గా ఆమెని చూసి షాకైన బన్నీ.. ఆమె ఎవరో తెలుసా?

*Kushboo: పెళ్ళి కోసం నేను మతం మారలేదు.. ‘కేరళ స్టోరీ’ విమర్శలపై ధీటైన సమాధానం

Updated Date - 2023-05-12T20:30:01+05:30 IST