సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

PedaKapu1: ‘పెదకాపు1’.. శ్రీకాంత్ అడ్డాల ఈసారి డైరెక్ట్ అటాక్

ABN, First Publish Date - 2023-06-02T13:38:21+05:30

‘నారప్ప’ తర్వాత దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల చేస్తున్న చిత్రానికి ‘పెదకాపు1’ అనే టైటిల్‌ని ఖరారు చేస్తూ.. శుక్రవారం ఫస్ట్ లుక్‌ని కూడా విడుదల చేశారు. ఈ చిత్రంతో విరాట్ కర్ణ హీరోగా పరిచయం అవుతుండగా.. మిర్యాల సత్యనారాయణరెడ్డి సమర్పణలో ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Peda Kapu 1 First Look
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘కొత్త బంగారులోకం’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ వంటి చిత్రాలతో దర్శకుడిగా తన మార్క్ ప్రదర్శించిన శ్రీకాంత్ అడ్డాల (Srikanth Addala).. కొన్నాళ్లుగా ఇండస్ట్రీలో తన ప్రభావాన్ని చూపలేకపోతున్నారు. ఇటీవల వచ్చిన ‘నారప్ప’ (Naarappa)తో కాస్త హడావుడి చేశారు కానీ.. ఆ సినిమా ఓటీటీలో విడుదల కావడంతో శ్రీకాంత్ అడ్డాలకు సరైన కమ్ బ్యాక్ ఫిల్మ్‌గా నిలవలేకపోయింది. ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల ‘అఖండ’ (Akhanda) వంటి చిత్రాన్ని నిర్మించిన ‘ద్వారకా క్రియేషన్స్’ (Dwaraka Creations)లో ఓ చిత్రం చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్‌ని తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాకు ‘పెదకాపు-1’ (PedaKapu-1) అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ చిత్రంతో ‘విరాట్ కర్ణ’ (Virat Karrna) అనే నూతన హీరోని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ.. అతని ఫస్ట్ లుక్‌ని కూడా విడుదల చేశారు.

మిర్యాల సత్యనారాయణరెడ్డి సమర్పణలో ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మిర్యాల రవీందర్ రెడ్డి (Miryala Ravinder Reddy) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టైటిల్, ఫస్ట్ లుక్ అనౌన్స్‌మెంట్స్ పోస్టర్‌తోనే.. శ్రీకాంత్ అడ్డాల ఈసారి మాములుగా రావడం లేదనే హింట్ ఇవ్వగా.. తాజాగా రివీల్ చేసిన టైటిల్, ఫస్ట్ లుక్‌తో ఇండస్ట్రీపై ఆయన డైరెక్ట్ అటాక్ చేయబోతున్నారనేది స్పష్టమైంది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో హీరో విరాట్ కర్ణ ఇంటెన్స్ లుక్‌ ఆకట్టుకుంటోంది. భారీ జనసమూహంలో విజయానికి గుర్తుగా అభివాదం చేస్తూ కనిపించారు విరాట్ కర్ణ. అతని చుట్టూ జనసంద్రం కనిపిస్తోంది. ఈ పోస్టర్‌లో ‘ఓ సామాన్యుడి సంతకం’ అనే ట్యాగ్‌‌లైన్‌ మరింత ఆసక్తికరంగా ఉంది. (PedaKapu1 First Look Out)

ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ విషయానికి వస్తే.. నటసింహం బాలయ్యతో బోయపాటి (Boyapati) రూపొందించిన ‘అఖండ’ చిత్రం ఈ బ్యానర్ వేల్యూని మరింతగా పెంచింది. ఇప్పుడీ బ్యానర్ నుంచి వస్తున్న ఈ ‘పెద్దకాపు1’ ప్రాజెక్ట్‌పై.. టైటిల్, ఫస్ట్ లుక్‌తో శ్రీకాంత్ అడ్డాల భారీగా అంచనాలను పెంచేశారు. ఈ సినిమా సక్సెస్ కావడం ఆయనకి ఎంతో కీలకం. అందుకే ఓ పవర్‌ఫుల్ సబ్జెక్ట్‌తో బరిలోకి దిగుతున్నట్లుగా ఈ టైటిల్, ఫస్ట్ లుక్‌తో శ్రీకాంత్ అడ్డాల క్లారిటీ ఇచ్చేశారు. అయితే టైటిల్ పక్కన ‘1’ ఏమిటనేది మాత్రం ఆయన క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. (Srikanth Addala Next Film PK1).

ఇవి కూడా చదవండి:

************************************************

*Anasuya: ఇప్పటిదాకా మోకాళ్ల పైన పట్టుకున్న మగాళ్లనే చూశా..!

*Mahesh Yuvasena: సూపర్ స్టార్ ఫ్యాన్స్‌ ఎంత గొప్పగా ఆలోచించారో చూశారా?

*Natti Kumar: అది కరెక్ట్ కాదు... ఏపీ సీఎం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం

*Jurassic June: ‘జురాసిక్ పార్క్’‌కు 30 ఏళ్లు.. ఆ పేరు ఇక ఉండదు

*Shaitan: రెడ్ అలెర్ట్!.. బోల్డ్ అండ్ డిస్టర్బ్ చేసే కంటెంట్‌తో..

Updated Date - 2023-06-02T13:38:21+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!