Rama Banam: ‘రామ బాణం’ మూడో పాటకి ఫేమస్ బ్యూటీ టచ్

ABN , First Publish Date - 2023-04-24T19:42:24+05:30 IST

తాజాగా ‘రామబాణం’ చిత్రయూనిట్ మూడో పాటని విడుదల చేశారు. ఈ పాటని ఫేమస్ బ్యూటీ, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ గత బ్లాక్‌బస్టర్ ‘ధమాకా’ హీరోయిన్ శ్రీలీల..

Rama Banam: ‘రామ బాణం’ మూడో పాటకి ఫేమస్ బ్యూటీ టచ్
Rama Banam Still

మ్యాచో హీరో గోపీచంద్ (Macho hero Gopichand) , డైరెక్టర్ శ్రీవాస్‌ (Sriwass)‌ల సక్సెస్ ఫుల్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘రామబాణం’. వీరి కాంబినేషన్‌లో ఇది హ్యాట్రిక్ ఫిల్మ్. ‘రామబాణం’ (Rama Banam)కు సంబంధించి ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌ మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు విడుదలైన రెండు పాటలు, ట్రైలర్ ప్రేక్షకులను ఆకర్షిస్తోన్న నేపథ్యంలో.. తాజాగా చిత్రయూనిట్ మూడో పాటని విడుదల చేశారు. ఈ పాటని ఫేమస్ బ్యూటీ, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) గత బ్లాక్‌బస్టర్ ‘ధమాకా’ (Dhamaka) హీరోయిన్ శ్రీలీల (Sreeleela) ఆవిష్కరించింది. మిక్కీ జె మేయర్ (Mickey J Meyer) ఈ పాటని మెస్మరైజింగ్ ట్రాక్‌గా కంపోజ్ చేశారు.

‘‘మొదటి సారిగా మనసు పడి.. వదలకుండ నీ వెంటపడి

మొదలైనది నా గుండెల్లో.. లవ్ మెలొడి

నువ్వే నువ్వే నువ్వే.. పూల గుత్తిలా కనిపిస్తావే..’’ అంటూ సాగిన ఈ పాటని.. ఇటు మెలోడి అటు బీట్ రెండింటిని అద్భుతంగా బ్యాలెన్స్ చేస్తూ... మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా మిక్కీ జె మేయర్ ఈ పాటని స్వరపరిచారు. తను ఇష్టపడే అమ్మాయి అందంపై హీరో ప్రశంసలు కురిపించేలా ఉన్న ఈ పాటకు శ్రీమణి (Srimani) సాహిత్యం అందించారు. రితేష్ జి రావు (Ritesh G Rao) ప్లజంట్ వాయిస్ పాటకు అదనపు ఆకర్షణగా నిలుస్తోంది. కోల్‌కతా నేపథ్యంలో సాగే ఈ పాటలో విజువల్స్ కూడా చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయి. గోపీచంద్ (Gopichand), డింపుల్ హయాతి (Dimple Hayathi) అందంగా కనిపించారు. దినేష్ కుమార్ పాటకు కొరియోగ్రఫీ అందించారు.

Gopichand-pic.jpg

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని భారీస్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహా నిర్మాత. భూపతి రాజా ఈ చిత్రానికి కథను అందించారు. జగపతి బాబు, ఖుష్బు ముఖ్య తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రంలో సచిన్ ఖేడేకర్, నాజర్, అలీ, రాజా రవీంద్ర, వెన్నెల కిషోర్, సప్తగిరి, కాశీ విశ్వనాథ్, సత్య, గెటప్ శ్రీను, సమీర్, తరుణ్ అరోరా తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. మే 5న ఈ చిత్రం భారీస్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. (Rama Banam Third Single Out)


ఇవి కూడా చదవండి:

************************************************

*Upasana: అత్యంత ప్రేమాభిమానాల మధ్య ఉపాసన సీమంతం.. ఫొటోలు వైరల్

*Young Actor: ఇంట్లో ఉరి వేసుకొని నటుడి ఆత్మహత్య

*King Nagarjuna: కడుపులో ఉండగానే.. అయ్యగారి గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!

*Hari Hara Veera Mallu: కీరవాణి కూడా..!

*Akhil Akkineni: ‘ఏజెంట్’లో అది నాకు చాలా కష్టమనిపించింది

*OG Producer: మటన్ బిర్యానీతో పవన్ కల్యాణ్ ఫ్యాన్‌ని సర్‌ప్రైజ్ చేసిన నిర్మాత

Updated Date - 2023-04-24T19:42:24+05:30 IST