Sound Party: ట్రైల‌ర్ వదిలారు.. నవ్వులతో రీ సౌండే!

ABN , First Publish Date - 2023-11-17T22:43:14+05:30 IST

సినిమా సక్సెస్‌కు సంబంధించి ఈ మధ్య కాలంలో దాదాపు ట్రైలర్‌తోనే తెలిసిపోతుంది. అలాగే కొన్ని సాంగ్స్‌ కూడా సినిమాపై మంచి బజ్‌ని క్రియేట్ చేస్తున్నాయి. ‘సౌండ్ పార్టీ’ పేరుతో తెరకెక్కతోన్న చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన పాటలు సినిమాపై మంచి బజ్‌ని క్రియేట్ చేశాయి. ఇదే సినిమాకు సంబంధించి గురువారం వదిలిన ట్రైలర్.. విడుదలకు ముందే సినిమాకు హిట్ కళను తీసుకొస్తోంది.

Sound Party: ట్రైల‌ర్ వదిలారు.. నవ్వులతో రీ సౌండే!
VJ Sunny and Hrithika Srinivas

సినిమా సక్సెస్‌కు సంబంధించి ఈ మధ్య కాలంలో దాదాపు ట్రైలర్‌తోనే తెలిసిపోతుంది. అలాగే కొన్ని సాంగ్స్‌ కూడా సినిమాపై మంచి బజ్‌ని క్రియేట్ చేస్తున్నాయి. ‘సౌండ్ పార్టీ’ (Sound Party) పేరుతో తెరకెక్కతోన్న చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన పాటలు సినిమాపై మంచి బజ్‌ని క్రియేట్ చేశాయి. ఇదే సినిమాకు సంబంధించి గురువారం వదిలిన ట్రైలర్.. విడుదలకు ముందే సినిమాకు హిట్ కళను తీసుకొస్తోంది. రెండున్న‌ర నిమిషాల నిడివిగ‌ల ఈ ట్రైల‌ర్ మొద‌టి నుండి ఎండింగ్ వ‌ర‌కు అదిరిపోయే పంచ్ డైలాగ్స్‌తో ఆక‌ట్టుకుంటోంది. ముఖ్యంగా హీరో వీజే స‌న్ని, శివ‌న్నారాయ‌ణలకు మధ్య వ‌చ్చే డైలాగ్స్ క్రేజీ‌గా ఉంటూ యూత్‌ని ఎట్రాక్ట్ చేస్తున్నాయి. (Sound Party Trailer Response)

అందుకు మ‌చ్చుతున‌కగా చెప్పుకుంటే.. ‘ప్ర‌స్తుతం యూత్ అంతా జియో, ఓయో మీదే న‌డుస్తోంది’ అంటూ శివ‌న్నారాయ‌ణ (Shivannarayana) చెప్పిన డైలాగ్. వీరితో పాటు ఇందులో స‌ప్త‌గిరి, థ‌ర్టీ ఇయ‌ర్స్ పృధ్వీ ఇంకా ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో మంచి క‌మెడియ‌న్స్ పేరు తెచ్చుకున్న వాళ్లంతా ఈ చిత్రంలో క‌నిపిస్తున్నారు. మోహిత్ రెహ‌మానికి మ్యూజిక్, శ్రీనివాస రెడ్డి సినిమాటోగ్ర‌ఫీ హైలెట్‌గా ఉండబోతుందనే విషయాన్సి కూడా ఈ ట్రైల‌ర్ తెలియజేస్తోంది. ప్ర‌స్తుతం ఫ్యామిలీ అండ్ యూత్ ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రాల‌ను ప్రేక్ష‌కులు ఆదరిస్తున్నారు. ఇవ్వ‌న్నీ దృష్టిలో పెట్టుకుని ద‌ర్శ‌కుడు సింగిల్ లైన్ పంచ్ డైలాగ్స్‌తో, మంచి కాస్టింగ్స్‌తో అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను టార్గెట్ చేస్తూ ఈ చిత్రాన్ని ఒక మంచి ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తీర్చిదిద్దిన‌ట్లుగా అయితే అర్థమవుతోంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ ట్రెండింగ్‌లో ఉందంటే.. ఇందులో కామెడీ ఏ రేంజ్‌లో వర్కవుట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. (Sound Party Trailer Out)


Hritika-Srinivas.jpg

ఫుల్ మూన్ మీడియా ప్రొడ‌క్ష‌న్స్ (Full Moon Media Productions) ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం-1గా తెరకెక్కుతోన్న ఈ ‘సౌండ్ పార్టీ’ చిత్రంలో వీజే స‌న్నీ (VJ Sunny,), హ్రితిక శ్రీనివాస్ (Hrithika Srinivas) జంట‌గా న‌టించారు. రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మించగా.. జయ శంకర్ సమర్పిస్తున్నారు. సంజ‌య్ శేరి (Sanjay Sheri) ద‌ర్శ‌కుడు. నవంబర్ 24 ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని మేకర్స్ గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు.


ఇవి కూడా చదవండి:

========================

*Varalaxmi Sarathkumar: ‘కోట బొమ్మాళి పీఎస్‌’ ఎలా ఉంటుందంటే..?

************************************

*KR Vijaya: కెఆర్ విజయ @ 60

*****************************

*Anushka Sharma: నువ్వు నిజంగా దేవుడి బిడ్డవు.. కోహ్లీపై అనుష్క శర్మ పోస్ట్ వైరల్

**************************

Updated Date - 2023-11-17T22:43:15+05:30 IST