Sound Party: ట్రెండింగ్‌లో ‘సౌండ్ పార్టీ’.. కారణమిదే..

ABN , First Publish Date - 2023-09-08T17:10:13+05:30 IST

ఫుల్ మూన్ మీడియా ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం-1గా రూపొందుతోన్న చిత్రం ‘సౌండ్ పార్టీ’. ‘బిగ్ బాస్’ ఫేమ్ వీజే స‌న్నీ, హ్రితిక శ్రీనివాస్ జంట‌గా న‌టిస్తున్నారు. రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మాత‌లు. జయ శంకర్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి సంజ‌య్ శేరి ద‌ర్శ‌కుడు. తాజాగా ఈ సినిమా నుండి విడుదలైన టైటిల్ ట్రాక్ మంచి స్పందనను రాబడుతూ టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

Sound Party: ట్రెండింగ్‌లో ‘సౌండ్ పార్టీ’.. కారణమిదే..
VJ Sunny in Sound Party

ఫుల్ మూన్ మీడియా ప్రొడ‌క్ష‌న్స్ (Full Moon Media Productions) ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం-1గా రూపొందుతోన్న చిత్రం ‘సౌండ్ పార్టీ’ (Sound Party). ‘బిగ్ బాస్’ ఫేమ్ వీజే స‌న్నీ (VJ Sunny), హ్రితిక శ్రీనివాస్ జంట‌గా న‌టిస్తున్నారు. రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మాత‌లు. జయ శంకర్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి సంజ‌య్ శేరి ద‌ర్శ‌కుడు. ఈ చిత్ర టీజ‌ర్ ఇప్ప‌టికే విడుద‌లై టాలీవుడ్‌లో గ‌ట్టిగానే సౌండ్ చేసింది. తాజాగా ఈ సినిమా నుండి ‘మ‌ని మ‌ని మ‌ని మ‌నీ దీని ముఖ‌ములు సోమెనీ’ అనే లిరిక‌ల్ వీడియో సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు. ప్ర‌జంట్ ఈ సాంగ్ యూట్యూబ్‌లో వైర‌ల్ అవుతోంది. (Sound Party First Single)


డ‌బ్బు ప్రాధాన్య‌త గురించి యువ ర‌చ‌యిత పూర్ణ‌చారి ప్ర‌జంట్ ట్రెండ్‌కి క‌నెక్ట‌య్యే విధంగా ఈ పాటని రాయ‌గా.. మోహిత్ రెహ‌మానిక్ దానికి త‌గ్గ‌ట్టుగా మాంచి బీట్‌తో కంపోజ్ చేశారు. యూట్యూబ్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోన్న ఈ సాంగ్ మంచి వ్యూస్‌తో, రీల్స్‌తో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఫ‌స్ట్ లిరిక‌ల్‌తోనే మంచి బ‌జ్ క్రియేట్ చేసిన ‘సౌండ్ పార్టీ’ చిత్రం.. సినిమాతో ఇండస్ట్రీలో రీ -సౌండ్ సృష్టించ‌డం ఖాయం అనేలా మేకర్స్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నా. ప్రస్తుతం ఈ సినిమా శ‌ర‌వేగంగా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్తి చేసుకుంటుందని, త్వ‌ర‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని నిర్మాత రవి పోలిశెట్టి చెబుతున్నారు. (Sound Party Movie)

VJ-Sunny.jpg

ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీజ‌ర్ విడుదలైనప్పటి నుండి మా ‘సౌండ్ పార్టీ’ చిత్రానికి మంచి బ‌జ్ వ‌చ్చింది. అలాగే ‘సౌండ్ పార్టీ’ టైటిల్ ట్రాక్‌కి కూడా ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌స్తోంది. ప్ర‌స్తుతం పాటలు సినిమాకు ఎంత ప్ల‌స్ అవుతున్నాయో, సినిమాను ప‌బ్లిక్‌లోకి ఏ విధంగా తీసుకెళ్తున్నాయో చూస్తున్నాం. ఈ త‌రుణంలో మా సినిమా నుండి రిలీజైన ఫ‌స్ట్ లిరిక‌ల్ సాంగ్‌కి మంచి రెస్పాన్స్ రావ‌డం ఎంతో సంతోషంగా ఉంది. త్వ‌ర‌లోనే మిగ‌తా పాట‌లు రిలీజ్ చేయ‌నున్నాం. స‌మ‌ర్ప‌కుడు జ‌య శంక‌ర్, ద‌ర్శ‌కుడు సంజ‌య్ శేరి ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్తి చేస్తున్నారు. త్వ‌ర‌లో విడుద‌ల తేదీ ప్ర‌క‌టిస్తామని తెలిపారు.


ఇవి కూడా చదవండి:

============================

*Chandramukhi 2: ‘చంద్రముఖి 2’ వాయిదా పడిందా.. ఈ సినిమా వచ్చేది కూడా ఆ తేదీనేనా?

*********************************

*Jawan: లెజెండ్‌లో ఉన్న స్టఫ్ ఇది.. ‘జవాన్‌’పై మహేష్ బాబు రివ్యూ.. ఎంత బాగుందో

*********************************

*Srimanthudu: ఈ ఘనత సాధించిన తొలి తెలుగు సినిమాగా ‘శ్రీమంతుడు’ రికార్డ్

**********************************

*Rules Ranjann Trailer: గంట లేదు, అరగంట లేదు.. ఎక్కడో విన్నట్టుందే..

**********************************

*Jailer Fame Marimuthu: గుండెపోటుతో ‘జైలర్’ యాక్టర్ కన్నుమూత

**********************************

*Vetrimaaran: ‘ఇండియా’ అనే పేరే చాలు

**********************************

Updated Date - 2023-09-08T17:10:13+05:30 IST