Telusu Kada: నాని క్లాప్‌తో సిద్దు జొన్నలగడ్డ సినిమా మొదలైంది.. తెలుసు కదా!

ABN , First Publish Date - 2023-10-18T17:21:24+05:30 IST

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఇటీవల స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ హీరోగా తమ ప్రొడక్షన్ నంబర్ 30 చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. చిత్ర ప్రకటనతో పాటే టైటిల్ కూడా అనౌన్స్ చేశారు. ‘తెలుసు కదా’ అనే టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రంతో స్లైలిస్ట్, కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాని బుధవారం గ్రాండ్‌గా ప్రారంభించారు.

Telusu Kada: నాని క్లాప్‌తో సిద్దు జొన్నలగడ్డ సినిమా మొదలైంది.. తెలుసు కదా!
Telusu Kada Movie Opening Still

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) ఇటీవల స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ (Star Boy Siddu Jonnalagadda) హీరోగా తమ ప్రొడక్షన్ నంబర్ 30 చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. చిత్ర ప్రకటనతో పాటే టైటిల్ కూడా అనౌన్స్ చేశారు. ‘తెలుసు కదా’ (Telusu Kada) అనే టైటిల్‌తో, సోల్‌ఫుల్ లవ్ స్టొరీ‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంతో స్టైలిస్ట్, కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన (Neeraja Kona) దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. టైటిల్ గ్లింప్స్‌తో‌నే అందరినీ ఆకట్టుకున్న ఈ చిత్రం బుధవారం హైదరాబాద్‌లో కోర్‌ టీమ్‌, పలువురు అతిథుల సమక్షంలో గ్రాండ్‌గా ప్రారంభమైంది.

Siddu-1.jpg

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) ముహూర్తం షాట్‌కి క్లాప్‌ ఇవ్వగా.. హీరోలు నితిన్ (Nithiin), ఆది పినిశెట్టి (Aadhi Pinisetty) స్క్రిప్ట్‌ని మేకర్స్‌కి అందజేశారు. దర్శకుడు బాబీ (Director Bobby) కెమెరా స్విచాన్ చేయగా, తొలి షాట్‌కు దర్శకుడు హరీష్ శంకర్ (Harish Shankar) గౌరవ దర్శకత్వం వహించారు. ఈ కార్యక్రమంలో ఆది, నందిని రెడ్డి, కోన వెంకట్, వక్కంతం వంశీ, బొమ్మరిల్లు భాస్కర్, మల్లిక్ రామ్, సితార నాగ వంశీ, నిర్మాత విజయేందర్ రెడ్డి తదితరులు పాల్గొని సినిమా ఘన విజయం సాధించాలని కోరారు.


Siddhu-2.jpg

భారీ బడ్జెట్‌తో టీజీ విశ్వప్రసాద్‌ (TG Vishwa Prasad) నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సిద్దు జొన్నలగడ్డ సరసన రాశీ ఖన్నా (Raashi Khanna), శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. స్టార్ కంపోజర్ థమన్ ఎస్ సంగీతం అందిస్తుండగా, యువరాజ్ జె ఛాయాగ్రహణం అందిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని మేకర్స్ ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలిపారు.


ఇవి కూడా చదవండి:

============================

*Leo: వేకువజామున 4గంటల ఆటకు హైకోర్టు నో.. కారణమిదే!

**************************************

*Rajinikanth: విజయ్‌ ‘లియో’ ఘన విజయం సాధించాలి

**************************************

*Kajal Aggarwal: బాలయ్య ఇలాంటి కథ చేసినందుకు నేను హ్యాపీ!

****************************************

Updated Date - 2023-10-18T17:21:24+05:30 IST