Rajinikanth: విజయ్‌ ‘లియో’ ఘన విజయం సాధించాలి

ABN , First Publish Date - 2023-10-17T19:56:59+05:30 IST

అగ్రహీరో విజయ్‌ నటించిన ‘లియో’ చిత్రం ఘన విజయం సాధించాలని సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఆకాంక్షిస్తూ చిత్ర బృందానికి బెస్టాఫ్‌ లక్‌ చెప్పారు. ‘తలైవర్‌170’ చిత్రం షూటింగ్‌ తమిళ నాడు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జరుపుకుంటోంది. తూత్తుకుడి ఎయిర్‌పోర్టులో కాసేపు మీడియాతో ముచ్చటించిన రజనీకాంత్.. ‘లియో’ టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Rajinikanth: విజయ్‌ ‘లియో’ ఘన విజయం సాధించాలి
Super Star Rajinikanth

అగ్రహీరో విజయ్‌ (Vijay) నటించిన ‘లియో’ (Leo) చిత్రం ఘన విజయం సాధించాలని సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ (Rajinikanth) ఆకాంక్షిస్తూ చిత్ర బృందానికి బెస్టాఫ్‌ లక్‌ చెప్పారు. ‘తలైవర్‌170’ (Thalaivar170) చిత్రం షూటింగ్‌ తమిళ నాడు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జరుపుకుంటోంది. కన్నియాకుమారిలో కొంత చిత్రీకరణ జరపగా అందులో రజనీ పాల్గొన్నారు. ఆ తర్వాత ఆయన సోమవారం కన్నియాకుమారి నుంచి తూత్తుకుడి ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడ ఆయన విలేకరులతో కాసేపు ముచ్చటించారు.

ఆయన మాట్లాడుతూ.. ‘‘ఇక్కడి ప్రజలు ఎంతో ప్రేమాభిమానాలు కలిగిన వారు. అందరితో కలిసి ఫొటోలు దిగలేకపోయాననే బాధ మనసులో ఉంది. మళ్లీ సమయం వస్తే తప్పకుండా అందరితో ఫొటోలు దిగుతాను. నటుడు విజయ్‌ నటించిన ‘లియో’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఆ సినిమా బ్లాక్‌బస్టర్‌ విజయం సాధించాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. నా పై మీరంతా కురిపిస్తోన్న ప్రేమకు ధన్యవాదాలు’’ అని రజనీకాంత్ అన్నారు. ఇదిలావుండగా తిరువనంతపురంలో ‘తలైవర్‌170’ షూటింగ్‌ ప్రారంభంకాగా.. ఆ తర్వాత తిరునెల్వేలి, కన్నియాకుమారి ప్రాంతాల్లో షూటింగ్‌ జరుపుకుంది. (Rajinikanth Blessings to Leo)


Vijay.jpg

రజనీకాంత్ విషయానికి వస్తే.. ఇటీవల ఆయన నటించిన ‘జైలర్’ (Jailer) చిత్రం బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. ఇప్పటి వరకు తమిళ సినీ ఇండస్ట్రీలో ఉన్న రికార్డులన్నింటిని చెరిపేస్తూ.. సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఆయన ‘లాల్ సలామ్’ చిత్ర షూటింగ్‌ని కంప్లీట్ చేసి.. ‘తలైవర్‌170’ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ‘లియో’ చిత్ర దర్శకుడైన లోకేష్ కనగరాజ్‌తో రజనీకాంత్ తన 171వ (తలైవర్‌171) చిత్రాన్ని చేయనున్న విషయం తెలిసిందే. అయితే ఈ మధ్య విజయ్ విషయంలోనే రజనీకాంత్ కొన్ని వ్యాఖ్యలు చేశారనేలా కోలీవుడ్ అంతా మారుమోగింది. కానీ ఇప్పుడు విజయ్‌ సినిమా విడుదల కాబోతోన్న సందర్భాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలపడంతో.. విజయ్ ఫ్యాన్స్ కూడా సూపర్ స్టార్‌కు థ్యాంక్స్ చెబుతున్నారు.


ఇవి కూడా చదవండి:

============================

*Kajal Aggarwal: బాలయ్య ఇలాంటి కథ చేసినందుకు నేను హ్యాపీ!

****************************************

*Leo: ‘లియో’ ఫీవర్‌.. 9కి వద్దు.. ఉదయం 4, 7 గంటల ఆట కోసం పట్టు

*****************************************

*Japan: దీపావళికి థియేటర్లలోకి.. ఈలోపే పోస్టర్స్‌తో పేల్చేస్తున్నారు

*****************************************

*Sona: ఆ చిన్న పొరపాటు వల్లే నన్ను శృంగార తారను చేశారు

***************************************

*Akira Nandan: ‘టైగర్ నాగేశ్వరరావు’ ఈవెంట్‌లో ఈ పేరే హాట్ టాపిక్..

***********************************

Updated Date - 2023-10-17T19:56:59+05:30 IST