Leo: వేకువజామున 4గంటల ఆటకు హైకోర్టు నో.. కారణమిదే!

ABN , First Publish Date - 2023-10-18T15:37:49+05:30 IST

విజయ్ నటించిన ‘లియో’ చిత్రానికి వేకువజామున 4గంటల ప్రత్యేక ఆటకు మద్రాస్ హైకోర్టు అనుమతి నిరాకరించింది. అయితే, ఉదయం 9గంటల ఆటను 7 గంటలకే ప్రదర్శించేలా అనుమతించే విషయంపై ప్రభుత్వ వైఖరిని బుధవారం సాయంత్రం లోపు వెల్లడించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 19న ‘లియో’ ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.

Leo: వేకువజామున 4గంటల ఆటకు హైకోర్టు నో.. కారణమిదే!
Vijay in Leo Movie

విజయ్ (Vijay) నటించిన ‘లియో’ (Leo) చిత్రానికి వేకువజామున 4గంటల ప్రత్యేక ఆటకు మద్రాస్ హైకోర్టు అనుమతి నిరాకరించింది. అయితే, ఉదయం 9గంటల ఆటను 7 గంటలకే ప్రదర్శించేలా అనుమతించే విషయంపై ప్రభుత్వ వైఖరిని బుధవారం సాయంత్రం లోపు వెల్లడించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 19న ‘లియో’ ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. తమిళనాడు (Tamil Nadu) మినహా పుదుచ్చేరి, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో వేకువజామున 4 గంటలకు తొలి ఆట ప్రదర్శనకు అనుమతి లభించింది. అయితే తొలి ఆటను వేకువజామున 4 గంటలకు, ఉదయం 7గంటల ఆటను 7గంటలకే ప్రదర్శించేందుక అనుమతి ఇవ్వాలని నిర్మాణ సంస్థ సెవెన్ స్ర్కీన్ స్టూడియోస్ హైకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వం 5 ఆటలు ప్రదర్శించేందుకు అనుమతి ఇవ్వడం వల్లే వేకువ జామున 4గంటల ఆటకు అనుమతి కోరుతున్నారు కదా.. అని హైకోర్టు ప్రశ్నించింది.

దీనికి ప్రభుత్వ న్యాయవాది సమాధానమిస్తూ.. సాధారణంగా శని, ఆదివారాలతో పాటు పబ్లిక్ సెలవుల్లో మాత్రమే అనుమతి ఇస్తారని, సాధారణ రోజుల్లో ఉండవన్నారు. ‘లియో రన్నింగ్ టైమ్ 2 గంటలా 45 నిమిషాలు అని తెలిసి ఉంటే, 5 ఆటలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చేది కాదన్నారు. వేకువజామున 4, ఉదయం 7 గంటల ఆటలకు అనుమతి ఇవ్వడం వల్ల పలు సమస్యలు ఉత్పన్నమవుతాయన్నారు. గతంలో 4 గంటల షోకు వెళ్లిన ఒక హీరో అభిమాని ప్రాణాలు కోల్పోయాడన్నారు. ‘లియో’ ట్రైలర్ రిలీజ్ సమయంలోనూ థియేటర్‌ను ధ్వంసం చేశారన్నారు. శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని వివరించారు. (Leo Movie)


Leo.jpg

ఈ వాదనలు ఆలకించిన న్యాయమూర్తి అనిత సుమంత్.. వేకువ జామున 4 గంటల షోకు అనుమతి ఇచ్చేందుకు నిరాకరించారు. అయితే ఉదయం 9గంటల ఆటపై బుధవారం సాయంత్రంలోపు తగిన ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఇదిలావుండగా సినిమా విడుదలను పురస్కరించుకుని దర్శకుడు లోకేష్ కనకరాజ్ రామేశ్వరంలోని శ్రీరామనాథ స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.


ఇవి కూడా చదవండి:

============================

*Rajinikanth: విజయ్‌ ‘లియో’ ఘన విజయం సాధించాలి

**************************************

*Kajal Aggarwal: బాలయ్య ఇలాంటి కథ చేసినందుకు నేను హ్యాపీ!

****************************************

*Leo: ‘లియో’ ఫీవర్‌.. 9కి వద్దు.. ఉదయం 4, 7 గంటల ఆట కోసం పట్టు

*****************************************

*Japan: దీపావళికి థియేటర్లలోకి.. ఈలోపే పోస్టర్స్‌తో పేల్చేస్తున్నారు

*****************************************

*Sona: ఆ చిన్న పొరపాటు వల్లే నన్ను శృంగార తారను చేశారు

***************************************

Updated Date - 2023-10-18T15:39:26+05:30 IST