సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Saindhav: ‌వెంకీ ‘సైంధవ్’లో హీరోయిన్ లుక్ విడుదల

ABN, First Publish Date - 2023-04-15T14:37:31+05:30

ఫస్ట్ లుక్‌ పోస్టర్‌‌ని గమనిస్తే.. ఏదో లోతుగా ఆమె ఆలోచిస్తున్నట్లు చాలా సీరియస్‌‌గా కనిపిస్తోంది. చేతిలో లంచ్ బాక్స్‌‌తో కారులో కూర్చుని..

Venkatesh in Saindhav
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh) 75వ లాండ్ మార్క్ మూవీ ‘సైంధవ్’ (Saindhav). టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ శైలేష్ కొలను (Sailesh Kolanu) దర్శకత్వంలో.. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ (Niharika Entertainment) పతాకంపై వెంకట్ బోయనపల్లి (Venkat Boyanapalli) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌‌లో తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ప్రస్తుతం వైజాగ్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. మొదటి షెడ్యూల్ అనంతరం చిన్న గ్యాప్‌తో రీసెంట్‌గానే రెండో షెడ్యూల్ ప్రారంభమైంది. తాజాగా ఈ చిత్ర హీరోయిన్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో వెంకీ సరసన శ్రద్ధా శ్రీనాథ్ (Shraddha Srinath) కథానాయికగా నటిస్తోంది. ‘సైంధవ్’‌లో మనోజ్ఞ (Manognya)గా ఆమె నటిస్తుందని తెలుపుతూ.. శ్రద్ధా శ్రీనాథ్ లుక్‌ని పరిచయం చేశారు.

Read Also- Shaakuntalam film review: కాళిదాసు కవిత్వం కొంతయితే...

శ్రద్ధా శ్రీనాథ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్‌‌ని గమనిస్తే.. ఏదో లోతుగా ఆమె ఆలోచిస్తున్నట్లు చాలా సీరియస్‌‌గా కనిపిస్తోంది. చేతిలో లంచ్ బాక్స్‌‌తో కారులో కూర్చుని వుంది కానీ ఆమె దృష్టి మరెక్కడో వుంది. మనోజ్ఞ క్యారెక్టర్ ఇప్పటి వరకు శ్రద్ధకు వచ్చిన పాత్రల్లో బెస్ట్ అని.. ఇది పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ క్యారెక్టర్ అని మేకర్స్ అంటున్నారు. జెర్సీలో తన నటనకు ప్రశంసలు పొందిన శ్రద్ధా.. సైంధవ్‌‌లో మనోజ్ఞ‌గా ప్రేక్షకులను ఆశ్చర్యపరచనుందట. ఆమె పాత్రే కాకుండా.. చాలా మంది అద్భుతమైన నటీనటులు కలిసి తెరపై ప్రేక్షకులకి గొప్ప అనుభూతిని ఇవ్వనున్నారని నిర్మాతలు చెబుతున్నారు. బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ ఈ చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. అలాగే పలువురు ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. (Shraddha Srinath Look in Saindhav)

విక్టరీ వెంకటేష్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా (Pan India) చిత్రంగా రూపొందుతోంది. ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఇతర నటీనటులను త్వరలో మేకర్స్ రివీల్ చేయనున్నారు. ఈ సినిమాని దక్షిణాది భాషలు, హిందీలో డిసెంబర్ 22న క్రిస్మస్ కానుకగా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. (Victory Venkatesh 75th Film)

ఇవి కూడా చదవండి:

*********************************

*Radhika Apte: నన్ను ఆ సర్జరీ చేయించుకోమన్నారు.. ఇప్పుడలా అంటేనా?

*Allu Arha: ‘రుద్రమదేవి’కి అల్లు అర్జున్.. ‘శాకుంతలం’కి అల్లు అర్హ

*Namitha: అది మన సంస్కృతి కాదు. మనకంటూ ఒక సంస్కృతి ఉంది

*KGF Actress: ‘కెజియఫ్‌’లో వణికించిన నటి.. ఇప్పుడు హాస్పిటల్‌లో ఉంది

Updated Date - 2023-04-15T14:37:33+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!