Animal: ‘యానిమల్’ వాయిదా.. కారణం చెప్పిన ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు

ABN , First Publish Date - 2023-07-03T19:13:54+05:30 IST

బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్, ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న యాక్షన్-థ్రిల్లర్ చిత్రం ‘యానిమల్’. ఈ సినిమాని ఆగస్ట్ 11న విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ బాగా పెండింగ్ ఉండటంతో.. డిసెంబర్ 1కి వాయిదా వేసినట్లుగా చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అధికారికంగా ప్రకటించారు.

Animal: ‘యానిమల్’ వాయిదా.. కారణం చెప్పిన ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు
Ranbir Kapoor and Sandeep Reddy Vanga

బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ (Ranbir Kapoor), ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న యాక్షన్-థ్రిల్లర్ చిత్రం ‘యానిమల్’ (Animal). ఇటీవల విడుదలైన ఈ చిత్ర ప్రీ-టీజర్ ట్రెమండస్ రెస్పాన్స్‌ను సొంతం చేసుకోవడమే కాకుండా.. సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది. ముఖ్యంగా వరుస పరాజయాల్లో ఉన్న బాలీవుడ్‌కు ఊపిరిపోసే చిత్రంగా అనిపించింది. ఇక ఎప్పుడెప్పుడు ఈ సినిమా విడుదల అవుతుందా? అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రమంలో మేకర్స్ ఆగస్ట్ 11న అంటూ అధికారికంగా విడుదల తేదీని ప్రకటించారు. కానీ ఇప్పుడీ సినిమా ఆ తేదీకి విడుదల కావడం లేదు. ఈ సినిమాని వాయిదా వేస్తున్నట్లుగా దర్శకుడు సందీప్ రెడ్డి తెలియజేస్తూ.. అధికారికంగా ఓ వీడియోను విడుదల చేశారు. ఇందులో సినిమాని వాయిదా వేయడానికి గల కారణాన్ని కూడా ఆయన వివరించాడు. అంతే కాదు.. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారో కూడా తెలియజేశాడు. (Animal Movie Postponed)

ఆ వివరాల్లోకి వెళితే.. ఈ సినిమా వాయిదాకి కారణం పోస్ట్ ప్రొడక్షన్ పనులు అధికంగా ఉండటమే అని తెలిపారు. అదే ఆలస్యానికి ప్రధాన కారణమని వివరించారు. సినిమాలో 7 పాటలు ఉన్నాయని, ఒక్కో పాటను ఐదు భాషల్లో పర్ఫెక్ట్ లిరిక్స్‌తో రికార్డ్ చేయడం బిగ్ టాస్క్ అని చెప్పారు. ప్రీ టీజర్‌లోని సీక్వెన్స్ సినిమాలో ఉందని కూడా స్పష్టం చేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి చిత్రాన్ని డిసెంబర్ 1న భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని.. సందీప్ రెడ్డి ఈ వీడియోలో తెలిపారు. (Sandeep Reddy Vanga about Animal)

Rashmika.jpg

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ‌లోని డైనమిక్ పవర్‌హౌస్‌ల కలయికలో విజనరీ భూషణ్ కుమార్ టి సిరీస్‌పై భద్రకాళి పిక్చర్స్‌పై ప్రణయ్ రెడ్డి వంగాతో కలసి ఈ యాక్షన్ సాగాను నిర్మిస్తున్నారు. రణబీర్ కపూర్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) కథానాయికగా నటిస్తుండగా, అనిల్ కపూర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రానికి అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

**************************************

*Anushka Shetty: ఆగస్ట్ రిలీజ్ లిస్ట్‌లోకి అనుష్క సినిమా..

**************************************

*Bandla Ganesh: పవర్‌స్టార్‌ పేరు చెప్పుకుని లబ్ధి పొందను.. నా చూపు, నా ఆశ ఒకటే..

**************************************

*Sudigali Sudheer: ఆమెతో సీక్రెట్‌గా నిశ్చితార్థం.. నిజమేనా?

**************************************

*Miriam Maa: 50 ఏళ్లు పైబడిన ఒక మహిళ కృత్రిమ గర్భధారణను ఎంచుకుంటే..

**************************************

Updated Date - 2023-07-03T19:13:54+05:30 IST