Anushka Shetty: ఆగస్ట్ రిలీజ్ లిస్ట్‌లోకి అనుష్క సినిమా..

ABN , First Publish Date - 2023-07-03T16:30:53+05:30 IST

న‌వీన్ పొలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మ‌హేష్ బాబు.పి ద‌ర్శ‌క‌త్వంలో వంశీ, ప్ర‌మోద్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఆగ‌స్ట్ 4న తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది.

Anushka Shetty: ఆగస్ట్ రిలీజ్ లిస్ట్‌లోకి అనుష్క సినిమా..
Miss Shetty Mr Polishetty Movie Still

న‌వీన్ పొలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ (Miss Shetty Mr Polishetty). యువీ క్రియేష‌న్స్ (UV Creations) బ్యాన‌ర్‌పై మ‌హేష్ బాబు.పి (Mahesh Babu P) ద‌ర్శ‌క‌త్వంలో వంశీ, ప్ర‌మోద్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా మొదలై చాలా కాలం అవుతున్నప్పటికీ.. ఈ మధ్యనే వరుస అప్‌డేట్స్‌ని ఇవ్వడం మేకర్స్ స్టార్ట్ చేశారు. తాజాగా ఈ సినిమా వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఆగ‌స్ట్ 4న తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో గ్రాండ్ రిలీజ్ కానుందని మేకర్స్ అధికారికంగా తెలియజేశారు. రిలీజ్ డేట్‌ని ప్రకటిస్తూ విడుదల చేసిన పోస్టర్ కూడా ఆసక్తికరంగా ఉంది. (Miss Shetty Mr Polishetty Release Date)

‘భాగమతి’ (Bhaagamathie) వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ త‌ర్వాత మరోసారి యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో అనుష్క న‌టిస్తోన్న చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ నుంచి మంచి బ‌జ్ క్రియేట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి విడుద‌లైన టీజ‌ర్‌, రెండు సాంగ్స్ ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. అందులో ఓ పాట‌ను కోలీవుడ్ స్టార్ హీరో ధ‌నుష్ (Dhanush) పాడ‌టం విశేషం. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తవడంతో.. మేకర్స్ విడుదల తేదీని ప్రకటించారు. అలాగే ప్రమోషన్స్‌పై కూడా టీమ్ దృష్టి పెట్టబోతున్నట్లగా తెలుస్తోంది.

Anushka-and-Naveen.jpg

అన్విత ర‌వళి శెట్టి పాత్ర‌లో అనుష్క‌.. స్టాండ‌ప్ క‌మెడియ‌న్‌ (Stand Up Comedian) సిద్ధు పొలిశెట్టి పాత్ర‌లో న‌వీన్ పొలిశెట్టి ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఇక తాజాగా వచ్చిన రిలీజ్ డేట్ పోస్ట‌ర్‌ (Miss Shetty Mr Polishetty Release Date Poster)ను గ‌మ‌నిస్తే.. ఇందులోనూ హీరో హీరోయిన్లు ఉన్నారు. ఓ ప్లెజంట్ ఫీలింగ్ ఇచ్చేలా పోస్ట‌ర్ ఉంది. ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ఉండబోతుందని మేకర్స్ చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

**************************************

*Bandla Ganesh: పవర్‌స్టార్‌ పేరు చెప్పుకుని లబ్ధి పొందను.. నా చూపు, నా ఆశ ఒకటే..

**************************************

*Sudigali Sudheer: ఆమెతో సీక్రెట్‌గా నిశ్చితార్థం.. నిజమేనా?

**************************************

*Miriam Maa: 50 ఏళ్లు పైబడిన ఒక మహిళ కృత్రిమ గర్భధారణను ఎంచుకుంటే..

**************************************

Updated Date - 2023-07-03T16:30:53+05:30 IST