Anand Deverakonda: ‘బేబీ’ తర్వాత.. ఆనంద్ రూట్ మార్చాడు.. ఈసారి మాస్ బొమ్మతో..

ABN , First Publish Date - 2023-09-09T19:29:50+05:30 IST

ఇటీవల వచ్చిన ‘బేబీ’ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు హీరో ఆనంద్ దేవరకొండ. ఆ సినిమా తర్వాత ఎలాంటి సినిమా చేస్తాడో అని అంతా అనుకుంటున్న సమయంలో.. ‘గం..గం..గణేశా’ అనే కొత్త చిత్రంతో రాబోతున్నట్లుగా ప్రకటించారు. తాజాగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్ హీరో ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు.

Anand Deverakonda: ‘బేబీ’ తర్వాత.. ఆనంద్ రూట్ మార్చాడు.. ఈసారి మాస్ బొమ్మతో..
Anand Deverakonda in Gam Gam Ganesha

ఇటీవల వచ్చిన ‘బేబీ’ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు హీరో ఆనంద్ దేవరకొండ. ఆ సినిమా తర్వాత ఎలాంటి సినిమా చేస్తాడో అని అంతా అనుకుంటున్న సమయంలో.. ‘గం..గం..గణేశా’ (Gam Gam Ganesha) అనే కొత్త చిత్రంతో రాబోతున్నట్లుగా ప్రకటించారు. ఇప్పటిదాకా తను చేయని యాక్షన్ జానర్‌లో ఈ సినిమా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాను హై-లైఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి (Uday Shetty) ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను హీరో ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda) తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా రిలీజ్ చేయగా.. స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఆ పోస్టర్‌ను ఇన్‌స్టాలో పోస్ట్ చేసి.. చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.


ఈ పోస్టర్‌లో రెండు రైఫిల్స్ పట్టుకున్న ఆనంద్ దేవరకొండ కనిపిస్తున్నారు. పోస్టర్ బ్యాక్‌గ్రౌండ్‌లో గన్స్ పట్టుకున్న గ్యాంగ్స్, బాంబ్ బ్లాస్టింగ్ సీన్స్ కనిపిస్తున్నాయి. రాజావారి పల్లి అనే బోర్డు మీద రన్ - ఫన్ - గన్ అనే క్యాప్షన్ రాసి ఉంది. మొత్తంగా ఫస్ట్ లుక్ పోస్టర్ మూవీ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. అలాగే ఇప్పటి వరకు ఆనంద్ కనిపించని మాస్ అవతార్‌‌లో ఆనంద్‌ని ఈ సినిమాలో చూపించబోతున్నట్లుగా అయితే తెలుస్తోంది. ‘గం..గం..గణేశా’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ షేర్ చేస్తూ ఇది యాక్షన్ మూవీనా? కామెడీ మూవీనా?.. త్వరలో మనం తెలుసుకుందాం. మరిన్ని డీటెయిల్స్, ఎగ్జైటింగ్ అప్‌డేట్స్ రాబోతున్నాయి.. అని ఆనంద్ దేవరకొండ క్యాప్షన్ ఇచ్చారు. (Gam Gam Ganesha First Look Out)

anand-.jpg

ప్రగతి శ్రీవాస్తవ, కరిష్మా, వెన్నెల కిషోర్, జబర్దస్త్ ఇమాన్యూయల్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోందని.. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. సినిమాలోని నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో రివీల్ చేస్తామని చెప్పుకొచ్చారు. మొదటి నుంచి వైవిధ్యభరిత సినిమాలతో హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న ఆనంద్ దేవరకొండ.. ఫస్ట్ టైమ్ యాక్షన్ అవతార్‌లో ఏం చేయబోతున్నాడో తెలియాలంటే.. ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.


ఇవి కూడా చదవండి:

============================

*Sky: ఈ ‘స్కై’కి ట్యాగ్‌లైన్ అదిరింది

*********************************

*Gopichand32: గోపీచంద్ 32వ చిత్రం ఆ దర్శకుడితోనే.. ఓపెనింగ్ కూడా పూర్తయింది

*********************************

*Jawan: లెజెండ్‌లో ఉన్న స్టఫ్ ఇది.. ‘జవాన్‌’పై మహేష్ బాబు రివ్యూ.. ఎంత బాగుందో

*********************************

*Srimanthudu: ఈ ఘనత సాధించిన తొలి తెలుగు సినిమాగా ‘శ్రీమంతుడు’ రికార్డ్

**********************************

*Rules Ranjann Trailer: గంట లేదు, అరగంట లేదు.. ఎక్కడో విన్నట్టుందే..

**********************************

Updated Date - 2023-09-09T19:29:50+05:30 IST