Pawan Kalyan: OG సెట్స్‌లో పవర్ స్టార్.. లుక్ అదిరిందిగా..!

ABN , First Publish Date - 2023-04-20T17:41:19+05:30 IST

అభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ తాజాగా OG మేకర్స్.. సెట్స్‌లో పవర్ స్టార్ ఫోన్ మాట్లాడుతున్న పిక్‌ని విడుదల చేశారు. ఈ పిక్‌లో..

Pawan Kalyan: OG సెట్స్‌లో పవర్ స్టార్.. లుక్ అదిరిందిగా..!
Pawan Kalyan in OG Sets

‘ఆర్ఆర్ఆర్’ (RRR) చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి (Tollywood) ఆస్కార్ (Oscar) రావడానికి కారణమైన డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ (DVV Entertainment) సంస్థలో ఇప్పుడు ఒక భారీ యాక్షన్ డ్రామాను నిర్మాత డీవీవీ దానయ్య (Dvv Danayya) ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. OG పేరుతో రూపుదిద్దుకుంటోన్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం కోసం దర్శకుడు సుజీత్‌ (Sujeeth)తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) జత కట్టారు. ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఏప్రిల్ 15న ముంబైలో ప్రారంభమైంది. హీరో పవన్ కళ్యాణ్ ఈ వారం ప్రారంభంలోనే ఈ సినిమా సెట్స్‌లో అడుగుపెట్టి అభిమానుల్లో ఉత్సాహం నింపారు. అభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ తాజాగా మేకర్స్.. సెట్స్‌లో పవర్ స్టార్ ఫోన్ మాట్లాడుతున్న పిక్‌ని విడుదల చేశారు. ఈ పిక్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఈ పిక్‌లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ని (Power Star Pawan Kalyan OG Look) చూసిన వారంతా.. సుజీత్‌కు థ్యాంక్స్ చెబుతున్నారు. లుక్ అదిరిపోయింది అన్నా.. ఇలాగే కంటిన్యూ చెయ్.. ఇంకాస్త గడ్డం ఉండేలా చూడు.. అంటూ సలహాలు ఇస్తున్నారు. పవన్ కల్యాణ్ కూడా ఈ పిక్‌లో సరికొత్తగా కనిపిస్తున్నారు. ఆయన సింపుల్‌గా తన పని తను చేసుకుంటున్నా.. అదే ఒక స్టైలిష్ లుక్‌లాగా మారిపోయింది. అదే పవర్ స్టార్‌లో ఉన్న స్పెషల్. ఆయన నార్మల్ పిక్ కూడా ట్రెండ్ సెట్టర్ అవుతుందంటే.. ఫైర్ స్ట్రోమ్ రేంజ్ అలాంటిది మరి. ప్రస్తుతం ఈ పిక్‌ చూసిన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ.. నిర్మాణ సంస్థకు థ్యాంక్స్ చెబుతున్నారు. నిర్మాత డీవీవీ దానయ్యకు రిలీజ్ రోజు ఖచ్చితంగా కటౌట్ పెడతామంటూ కామెంట్స్ సెక్షన్‌లో కుమ్మేస్తున్నారు. మొత్తానికి చడీచప్పుడు కాకుండా.. ఇలాంటి పిక్స్ వదులుతూ.. సినిమాపై నిర్మాణ సంస్థ భారీ అంచనాలను క్రియేట్ చేస్తోంది.

Mumbai-OG.jpg

కాగా, ఈ సినిమాలో పవర్ స్టార్ సరసన ప్రియాంక మోహన్ (Priyanka Mohan) హీరోయిన్‌గా నటించబోతున్నట్లుగా బుధవారం మేకర్స్ అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. ఇప్పుడు ఈ పిక్. ఇలా వరుసగా OG ట్రెండ్ అవుతూనే ఉంది. ప్రస్తుతం ఈ సినిమా మొదటి షెడ్యూల్‌ ముంబై మరియు పరిసర ప్రాంతాలలో జరుగుతోంది. ఈ నెలాఖరు వరకు జరగనున్న ఈ షెడ్యూల్‌లో ప్రధాన తారాగణంపై యాక్షన్ సన్నివేశాలతో పాటు పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారని తెలుస్తోంది (Pawan Kalyan OG Shooting Update). దర్శకుడు సుజీత్ ఎక్కడా రాజీపడకుండా అద్భుతమైన యాక్షన్ చిత్రాన్ని అందించడానికి కృషి చేస్తున్నారు. అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం (S Thaman) అందిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

************************************************

*Ram Charan: భార్య కోసం రామ్ చరణ్ సంచలన నిర్ణయం

*Dasara: నాని ‘దసరా’ ఓటీటీ స్ట్రీమింగ్‌కి డేట్ ఫిక్సయింది.. ఎప్పుడంటే?

*23YrsOfBlockBusterBadri: పవన్ కల్యాణ్ ‘బద్రి’ గురించి ఈ విషయం తెలుసా?

*Sai Dharam Tej: ‘విరూపాక్ష’ను ‘కాంతార’తో పోల్చవద్దు

*Thalapathy Vijay: ఒకే ఒక్క సిట్టింగ్‌లో.. మరో టాలీవుడ్ దర్శకుడితో విజయ్ మూవీ!

Updated Date - 2023-04-20T17:41:19+05:30 IST