సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Virupaksha Teaser: ప్ర‌మాదాన్ని దాట‌డానికే ఈ ప్రయాణం.. ఎక్కడో కనెక్ట్ అవుతున్నట్లుందే!

ABN, First Publish Date - 2023-03-02T19:23:58+05:30

ప్ర‌శ్న ఎక్క‌డ మొద‌లైందో స‌మాధానం అక్క‌డే వెత‌కాలంటున్నారు సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ (Supreme Hero Sai Dharam Tej). ఆయన హీరోగా, కార్తీక్ దండు (Karthik Dandu) దర్శకత్వంలో ప్ర‌శ్న ఎక్క‌డ మొద‌లైందో స‌మాధానం అక్క‌డే వెత‌కాలంటున్నారు సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ (Supreme Hero Sai Dharam Tej). ఆయన హీరోగా, కార్తీక్ దండు (Karthik Dandu) దర్శకత్వంలో

Sai Dharam Tej in Virupaksha
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్ర‌శ్న ఎక్క‌డ మొద‌లైందో స‌మాధానం అక్క‌డే వెత‌కాలంటున్నారు సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ (Supreme Hero Sai Dharam Tej). ఆయన హీరోగా, కార్తీక్ దండు (Karthik Dandu) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న మిస్టీక్ థ్రిల్లర్ చిత్రం ‘విరూపాక్ష’ (Virupaksha). శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ, సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్స్‌పై బాపినీడు.బి సమర్పణలో ప్రముఖ నిర్మాత బీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ (BVSN Prasad) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్‌లో ఈ చిత్రాన్ని ఏప్రిల్ 21న భారీ ఎత్తున విడుదల చేయ‌టానికి నిర్మాత‌లు సన్నాహాలు చేస్తున్నారు. సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా గురువారం ఈ చిత్ర టీజ‌ర్‌ను ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Power Star Pawan Kalyan) విడుద‌ల చేశారు.

విరూపాక్ష టీజ‌ర్ (Virupaksha Teaser) విషయానికి వస్తే..‘చ‌రిత్ర‌లో ఇలాంటి సంఘ‌ట‌న జ‌ర‌గ‌టం ఇదే మొద‌టిసారి’ అని సాయిచంద్ చెబుతున్న వాయిస్‌తో అద్భుతమైన విజువల్స్‌తో, ఆకట్టుకునే బిజీఎమ్‌తో టీజర్ మొదలైంది. అదే స‌మ‌యంలో ఓ జీపు అడ‌వి మార్గం గుండా ప్ర‌యాణించి ఓ భ‌వంతి ముందు ఆగుతుంది. అనంతరం.. దీనికి ప‌రిష్కారం ఉందా? లేదా? అని ఓ వ్య‌క్తి సాయి చంద్‌ని ప్ర‌శ్నించ‌గా.. దీని నుంచి బ‌య‌ట ప‌డ‌టానికి మ‌న‌కు ఒకే ఒక మార్గం ఉందని సాయిచంద్ మార్గాన్ని చెబుతాడు. వెంట‌నే ఆ వ్య‌క్తి అస‌లేం జ‌రుగుతుందిక్క‌డ అని అడుగుతాడు. వెంట‌నే సాయిధ‌ర‌మ్ తేజ్ పాత్ర‌ను రివీల్ చేశారు. అస‌లు సాయిధ‌ర‌మ్ తేజ్‌కి.. సాయిచంద్ (Saichand) చెబుతున్న స‌మస్య‌కు ప‌రిష్కారం ఏంట‌నేది తెలుసుకోవాలంటే ‘విరూపాక్ష‌’ సినిమా చూడాల్సిందే అనేలా మేకర్స్ ఈ టీజర్‌ని కట్ చేశారు. (Virupaksha Teaser Review)

1990లో జ‌రిగే క‌థ‌లో ఓ ప్రాంతంలోని ప్ర‌జ‌లు విచిత్ర‌మైన స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతుంటారు. ప్ర‌శ్న ఎక్క‌డ మొద‌లైందో స‌మాధానం అక్క‌డే వెత‌కాల‌ని, ఏదో పుస‌క్తాన్ని హీరో చ‌దువుతుండ‌టం, ప్ర‌మాదాన్ని దాట‌డానికే నా ప్రయాణం అని హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ చెప్ప‌టం సినిమా కథపై ఆసక్తిని క్రియేట్ చేస్తున్నాయి. ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌కు ప‌రిష్కారం చూప‌టానికి.. హీరో సాయిధ‌రమ్ తేజ్ ఏం చేశాడనేదే ‘విరూపాక్ష’ అస‌లు క‌థ అనేది ఈ టీజర్ చూస్తుంటే అర్థ‌మ‌వుతుంది. శ్యామ్ ద‌త్ సైనుద్దీన్, అజ‌నీష్ లోక్‌నాథ్ బీజీఎం సినిమాపై ఆస‌క్తిని రెట్టింపు చేస్తున్నాయి. టీజ‌ర్ చివ‌ర‌లో ఓ అమ్మాయి అలా గాలిలో ఎగురుతూ క‌న‌ప‌డుతున్న స‌న్నివేశంలో ఆడియెన్స్‌లో తెలియ‌ని ఓ భ‌యాన్ని క‌లిగిస్తోంది. ఓవరాల్‌గా పాన్ ఇండియా సినిమాకి ఉండాల్సిన కంటెంట్ ఈ సినిమాలో ఉందనేది ఈ టీజర్‌తో స్పష్టమవుతోంది. ఇక ‘ప్ర‌మాదాన్ని దాట‌డానికే నా ప్రయాణం’ అని హీరో చెప్పిన డైలాగ్.. సాయితేజ్ రియల్ లైఫ్‌లో రీసెంట్‌గా జరిగిన సంఘటనకు చాలా దగ్గరగా ఉండటం విశేషం. సంయుక్తా మీనన్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రానికి స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ (Sukumar) స్క్రీన్‌ప్లే అందించారు. (Virupaksha Telugu Teaser)


ఇవి కూడా చదవండి:

*********************************

Allu Arjun: ఇక్కడా తగ్గేదే లే.. ఐకాన్ స్టార్ ఖాతాలో మరో రికార్డ్

* Poorna: ఏడో నెల గర్భిణీ.. ‘కానూర్’ తంతు వీడియో వైరల్

* Mega Power Star Ram Charan: నా జీవితంలో అద్భుత‌మైన క్ష‌ణాలివి

Actress: అరుదైన వ్యాధి బారిన మరో నటి.. బాబోయ్ పగవారికి కూడా ఈ వ్యాధి రాకూడదు

* KTR: ‘బలగం’.. కేటీఆర్ కంటి సైగతో యాంకర్ ఏం చేసిందో చూశారా..

* Laya: పవన్ కల్యాణ్ మాట నిలబెట్టుకున్నారు.. ఆసక్తికర విషయం చెప్పిన లయ

Updated Date - 2023-03-02T19:24:00+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!